• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా డీఎస్పీకి ఆహ్వానం

NDL: కోవెలకుంట్లలో వెలసిన పాండురంగ విఠలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావుని ఆలయ ఉత్సవ కమిటీ ఛైర్మన్ గుద్దేటి చిన్న వెంకటసుబ్బారెడ్డి(గుండయ్య), వైస్ ఛైర్మన్ కరిమద్దుల లక్ష్మీ నాగేంద్రబాబు కలిశారు. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించి హాజరుకావాలని ఆయనను కోరారు.

April 27, 2026 / 08:44 PM IST

డ్రోన్ నిఘాతో అసాంఘిక శక్తులపై పోలీసుల కట్టడి

అన్నమయ్య: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో ముమ్మర నిఘా చేపట్టారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు కొండలు, గుట్టలు, నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రత్యేకంగా పర్యవేక్షణ కొనసాగుతోంది. పేకాట, నాటుసారా, గంజాయి రవాణా వంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

April 27, 2026 / 08:41 PM IST

మిట్టపాలెం నారాయణస్వామి ఆలయ ఆదాయం.!

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెంలో వెలసి ఉన్న నారాయణస్వామి ఆలయానికి ఆదివారం భక్తుల ద్వారా రూ.1,88,233 ఆదాయం వచ్చినట్లు ఈవో గిరిరాజు నర్సింహబాబు సోమవారం తెలిపారు. టికెట్లు, లడ్డు ప్రసాదం విక్రయం, శాశ్వత అన్నదానం, మహాప్రాకార నిర్మాణ విరాళాలు, పంచామృత అభిషేకాలు, శ్రీపాద కానుకల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు.

April 27, 2026 / 08:34 PM IST

‘వదంతులు నమ్మవద్దు’

SKLM: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న ప్రచారం అసత్యమని ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి తెలిపారు. అన్ని బంకుల్లో ఇంధనం సమృద్ధిగా ఉందని స్పష్టం చేశారు. వదంతులను నమ్మి అధికంగా నిల్వ చేయొద్దని హెచ్చరించారు. అక్రమ నిల్వలు, నల్లబజారు, తప్పుడు ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనుమానాస్పద విషయాలు గమనిస్తే 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

April 27, 2026 / 08:34 PM IST

త్రైమాసిక పన్ను గడువు 30లోపు – డీఆర్‌టీఓ హెచ్చరిక

TPT: జిల్లాలో వాణిజ్య వాహనాల యజమానులు త్రైమాసిక పన్నును ఈ నెల 30లోపు పెనాల్టీ లేకుండా చెల్లించాలని డీఆర్‌టీవో కొర్రపాటి మురళీమోహన్ తెలిపారు. గడువు దాటితే మేలో 100%, జూన్‌లో 200% పెనాల్టీ విధిస్తారు. బకాయి పన్నులు, కాంపౌండింగ్ ఫీజులు వెంటనే చెల్లించాలన్నారు. పన్నులు చెల్లించని వాహనాలపై ప్రత్యేక బృందాలు కఠిన చర్యలు తీసుకుంటాయన్నారు.

April 27, 2026 / 08:31 PM IST

కుప్పం అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్సీ సమీక్ష

HYD: కుప్పం మునిసిపాలిటీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. కుప్పం ప్రాంతంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. కౌన్సిల్ సభ్యులు చెప్పిన సమస్యలపై వాటి పరిష్కార చర్యలు వెంటనే తీసుకున్నట్లు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిల్ సభ్యులు, పాల్గొన్నారు.

April 27, 2026 / 08:30 PM IST

‘వర్షాభావాన్ని తట్టుకునే పంటలు వేయాలి’

ATP: గుత్తిలోని రైతు సేవా కేంద్రంలో సోమవారం ఏఓ ముస్తఫా అహ్మద్ ఆధ్వర్యంలో రైతులకు జిప్సం, కందులు, జొన్నలు, సెనగలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఏడిఏ వెంకట్రాముడు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. అధిక ఉష్ణోగ్రత వలన ఎలినీనో ప్రభావం ఎక్కువగా ఉంటుందని వర్షాభావాన్ని తట్టుకునే పంటలు కందులు, ఆముదులు, జొన్నలు, కొర్రలు, పంటల మీద ఎక్కువగా ఆసక్తి పెట్టాలన్నారు.

April 27, 2026 / 08:30 PM IST

జలధార–జలహారతిపై అవగాహన కార్యక్రమం

VZM: జిల్లాలో అమలవుతున్న జలధార-జలహారతి పనులను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో విజయనగరం, మన్యం జిల్లాల అధికారులకు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100రోజుల ప్రత్యేక డ్రైవ్ జిల్లాలో మంచి ఫలితాల దిశగా సాగుతుందన్నారు.

April 27, 2026 / 08:25 PM IST

BOI బ్రాంచ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: పెనమలూరు(M) పోరంకి గ్రామంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన బ్రాంచ్‌ను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సోమవారం ప్రారంభించారు. పోరంకి వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు విస్తరించడం, ప్రజలకు ఉపయోగకరమని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలకు, సులభమైన, వేగవంతమైన ఆర్థిక సేవలు అందుబాటులోకి రావడం ద్వారా వ్యాపారులకు బలం చేకూరుతుందని ఆయన తెలిపారు.

April 27, 2026 / 08:25 PM IST

పోలీసుల బందోబస్త్ మధ్య డీజిల్ అమ్మకాలు

W.G: నరసాపురం పెట్రోల్ బంకుల వద్ద సోమవారం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బంకుల వద్ద పహారా కాస్తున్నారు. రబీ సీజన్ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న వేళ డీజిల్ దొరక్కపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే రైతులు ప్లాస్టిక్ డబ్బాలతో బంకుల వద్ద బారులు తీరారు.

April 27, 2026 / 08:22 PM IST

వెల్దుర్తిలో మే 2న సాధారణ సమావేశం.!

KRNL: వెల్దుర్తి మండల ప్రజా పరిషత్ సాధారణ సమావేశం మే 2న జరుగుతుందని ఎంపీడీవో చంద్రశేఖర్ రెడ్డి సోమవారం పేర్కొన్నారు. మండల అభివృద్ధి పనులు, గ్రామ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, శాఖల పనితీరుపై చర్చించనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది నిర్ణీత సమయానికి హాజరుకావాలని MPDO సూచించారు.

April 27, 2026 / 08:17 PM IST

మృతదేహం లభ్యం.. హత్య కేసు నమోదు

ASR: అనంతగిరి మండలం కాశీపట్నం సమీపంలో గోస్తని నది ఒడ్డున పొదల్లో లభించిన తల లేని వ్యక్తి మృతదేహం ఘటనపై హత్య కేసు నమోదు చేశామని ఎస్సై శంకరరావు సోమవారం తెలిపారు. మృతదేహం కుడిచేయి మీద అమ్మా, నాన్న అని తెలుగులో టాటూ ఉందన్నారు. మృతుడి వయసు సుమారు 30నుంచి 40ఏళ్లు ఉంటుంన్నారు. 5.6 అంగుళాల పొడవు ఉందన్నారు. మృతదేహాన్ని గుర్తించిన వారు స్టేషన్లో సంప్రదించాలన్నారు.

April 27, 2026 / 08:16 PM IST

గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసిన జేసీ

పార్వతీపురం మండలం అడ్డాపుశిల గ్రామ సచివాలయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో భాగంగా ఆయన ఈ సందర్శన చేపట్టారు. సచివాలయ సిబ్బంది సమయపాలనను, బయోమెట్రిక్ హజారును స్వయంగా పరిశీలించారు. విధుల్లో నిర్లక్షం వహించరాదని హెచ్చరించారు.

April 27, 2026 / 08:15 PM IST

కేదారేశ్వర స్వామి సేవలో ఎమ్మెల్యే

SKLM: నరసన్నపేట మండలం పారశెల్లి గ్రామం శ్రీ జల భవాని సమేత కేదారేశ్వర స్వామి తృతీయ వార్షికోత్సవం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సోమవారం గ్రామస్తుల ఆహ్వానం మేరకు స్వామివారిని ఎమ్మెల్యే రమణమూర్తి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజల మీద ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

April 27, 2026 / 08:10 PM IST

ఇంధన కొరత వదంతులు నమ్మవద్దు: ఎస్పీ

ATP: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని అనంతపురం ఎస్పీ పి.జగదీష్ ప్రజలను కోరారు. అన్ని బంకుల్లో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. అక్రమ నిల్వలు సృష్టించినా, బ్లాక్ మార్కెట్లో విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 27, 2026 / 08:10 PM IST