WG: నరసాపురం మండలం పసలదీవిలో ఈ నెల 9న ఉచిత పశువైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ ఏడీ పి. చంద్ర శేఖర్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఏఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. శిబిరంలో పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. ఈ అవకాశాన్ని రైతులు, గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
AKP: క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించడం అమానుషం అని సీపీఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. మంగళవారం అచ్యుతాపురంలో క్యూబాకి మద్దతుగా విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న క్యూబా దేశాన్ని ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
KDP: కమలాపురం 134వ నంబర్ రైల్వే గేటు వద్ద అత్యవసర ట్రాక్ మరమ్మతు పనుల కారణంగా, ఏప్రిల్ 9 నుంచి 14వ తేదీ వరకు గేటును మూసివేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. ఈ మూసివేత కేవలం రాత్రి 10:00 నుంచి ఉదయం 5:00 గంటల వరకు మాత్రమే అమలులో ఉంటుందని తెలిపారు. ప్రజల భద్రత కోసం చేపడుతున్న ఈ పనులకు అందరూ సహకరించాలని అధికారులు కోరారు.
పోలవరం జిల్లాలోని 982 అంగన్వాడీ కేంద్రాల్లో రేపటి నుంచి 23వ తేదీ వరకు పోషణ్ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. తల్లి, శిశు సంక్షేమం, పోషకాహారంపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ లక్ష్యం అని జిల్లా మాతా శిశు సంక్షేమ శాఖ పీడీ ఉమ మంగళవారం తెలిపారు. జిల్లాలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో ఉన్నారని పేర్కొన్నారు.
ప్రకాశం: దోర్నాల మండలం చిన్నగుడిపాడు గ్రామంలో చెరువులు, కాలువల పునరుద్ధరణ పనులను యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రారంభించారు. ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యాచరణలో భాగంగా చెరువుల అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
BPT: తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన రాజు అనే బాలుడు వేటపాలెంలో ప్రత్యక్షమయ్యాడు. వేటపాలెంకు చెందిన బాలగోపి అనే వ్యక్తికి రాజు రైల్వే స్టేషన్లో తారసపడి అన్నం పెట్టించమని అడిగాడు. అన్నం పెట్టిన తదుపరి రాజును వేటపాలెం ఎస్సై జనార్ధన్‌కు మంగళవారం అప్పగించాడు. రాజును ఆరా తీయగా తన తండ్రితో మంచిర్యాలలో ఉంటాడని చెప్పడంతో ఎస్సై అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
W.G: ఆచంట మండలం కొడమంచిలి పంచాయతీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన సోమేశ్వరరావును మంగళవారం కూటమి నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను ఆయనకు వివరించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపాలని నాయకులు కోరారు. స్పందించిన అధికారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
CTR: పలమనేరు శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ పునరుద్ధరణ పనుల పురోగతిపై ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి మంగళవారం అధికారులు, అర్చకులతో పాటు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ గోపుర పనులు ఎంతవరకు వచ్చాయని ఈవో రమణారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. శివాలయ గర్భగుడి పునర్నిర్మాణానికి చేపడుతున్న చర్యలపై క్షుణ్ణంగా పరిశీలించారు.
అన్నమయ్య: రాష్ట్రంలో పెరుగుతున్న బస్సు ప్రమాదాలపై హోంమంత్రి వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సమగ్ర సమీక్ష జరిగింది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రమాదాల కారణాలు, రోడ్డు భద్రతా చర్యలపై ఉన్నతాధికారులతో చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు అమలు చేయాలని నిర్ణయించారు.
ELR: లింగపాలెం మండల MRO నజిముల్లషా మంగళవారం ఒకటవ నెంబర్ రేషన్ షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ రేషన్ షాపులో ఇచ్చే బియ్యాన్ని గర్భిణీ స్త్రీలు కూడా తినవచ్చని దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయన్నారు. కార్డుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని డీలర్లకు వివరించారు. అనంతరం స్టాక్ రిజిస్టర్లు పరిశీలించి పలు సూచనలు చేశారు.
TPT: గంగమ్మ జాతరల నెల ప్రారంభం కానుండటంతో తిరుపతి తాతయ్య గంగమ్మ ఆలయ బోర్డు ఛైర్మన్, అర్చకులు, అధికారులు జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జాతరల నిర్వహణ, భక్తులకు సౌకర్యాల ఏర్పాటుపై చర్చించారు. జాతరల సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
ATP: అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయంలో MLA దగ్గుపాటి ప్రసాద్ అధ్యక్షతన బడ్జెట్ ఔట్ రీచ్ 2026-27 కార్యక్రమం జరిగింది. నియోజకవర్గానికి కేటాయించిన రూ.475 కోట్ల నిధులను పారదర్శకంగా, సద్వినియోగం చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా బడ్జెట్లో మన వాటా 11.3% ఉందని తెలిపారు. రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నా సీఎం నిధులు కేటాయించారని MLA తెలిపారు.
PLD: నరసరావుపేట మండలం అర్వపల్లి గ్రామంలో మంగళవారం పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంప్‌లో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని మెడికల్ క్యాంపు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాడి పశువుల గల రైతులు ప్రతి ఒక్కరూ మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలన్నారు.
GNTR: అమరావతి సచివాలయంలో రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకుంటున్న బస్సు ప్రమాదాలను నివారించేందుకే హోంమంత్రి వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో భవిష్యత్తులో పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో కఠినమైన భద్రతా చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు.
KRNL: తుగ్గలి వ్యవసాయ కార్యాలయంలో ఉల్లి సాగుపై AO సురేష్ బాబు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందస్తు వర్షాల వల్ల పంట నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పొలాల్లో నీరు నిల్వ ఉంటే ఉల్లిగడ్డలు కుళ్లే ప్రమాదం ఉందన్నారు. నీరు త్వరగా బయటకు వెళ్లేలా కాలువలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఉల్లితో పాటు అంతర్ పంటలు సాగు చేస్తే ఆదాయం పొందవచ్చని తెలియజేశారు.