• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

దర్శిలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు

ప్రకాశం: దర్శి పట్టణంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. సీఐ రామారావు ఆధ్వర్యంలో జిల్లా నుంచి వచ్చిన ప్రత్యేక బృందం, డాగ్ స్క్వాడ్తో కలిసి బస్టాండ్, ఫుడ్ కోర్టులు, బేకరీలలో సోదాలు నిర్వహించారు. మాదకద్రవ్యాల నిర్మూలన, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణే లక్ష్యంగా ఈ తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

April 29, 2026 / 09:59 AM IST

32 కిలోల గంజాయి స్వాధీనం.. సీలేరు ఎస్సై

ASR: జీకేవీధి మండలం ఐస్ గెడ్డ సమీప చిత్రకొండ జంక్షన్ వద్ద 32 కిలోల గంజాయి పట్టుబడిందని సీలేరు ఎస్సై ఎండీ యాసిన్ తెలిపారు. ముందస్తు సమాచారంతో తమ సిబ్బందితో కలిసి మంగళవారం సాయంత్రం వాహన తనిఖీలు చేస్తుండగా కారులో తరలిస్తున్న గంజాయి పట్టుబడిందని చెప్పారు. గంజాయితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామన్నారు.

April 29, 2026 / 09:48 AM IST

వరి కోత యంత్రానికి ఎకరాకు ఎంతో తెలుసా..?

పశ్చిమ గోదావరి జిల్లాలో సార్వ మాసూళ్లు లో వరి కోత యంత్రానికి ఎకరాకు 3 వేలు గా వ్యవసాయ శాఖ ఆమోదం తెలిపిందని జిల్లా ADA శ్రీనివాస రావు ఒక ప్రకటనలో బుధవారం తెలిపారు. వీటిని సిబ్బంది సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసి రైతాంగానికి తెలియజేయాలన్నారు. వాతావరణ అననుకూల పరిస్థితుల ప్రభావం వల్ల రైతుల వద్ద అధికంగా వసూలు చేస్తే చర్యలు తప్పవన్నారు.

April 29, 2026 / 09:43 AM IST

కొల్లేరులో సందడి చేసిన విజిలింగ్ డక్స్

ELR: దెందులూరు(m) కొవ్వలి పెద్దచెరువులో పెద్దచెరువులో చాలా కాలం తర్వాత విజిలింగ్ డక్స్ కనిపించాయి. పక్షులు రాకతో కొవ్వలి పెద్ద చెరువు మళ్లీ జీవంతో కళకళలాడూతూ.. కనిపిస్తుందని స్థానికులు తెలిపారు. ఈ పక్షి పూర్తిగా శాకాహారి అని కొల్లేరులోనే సంతానోత్పత్తి చేసుకుని సంతానాన్ని ఉత్పత్తి చేసుకుంటాయని అన్నారు. పక్షులు రావడంతో పర్యాటకులు పెరిగే అవకాశం ఉందన్నారు.

April 29, 2026 / 09:40 AM IST

డీఎస్పీకి గ్రామ సమస్యలు విన్నపం

NDL: ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసులు ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టారు. సిరివెళ్ల మండలం రాజానగరం గ్రామస్తులు ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసులను తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామస్తులు గ్రామంలో ఉన్న సమస్యలను వారు డీఎస్పీకి వివరించారు. అనంతరం DSP శ్రీనివాసులును గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.

April 29, 2026 / 09:37 AM IST

బొమ్మూరులో శుభ్రత కార్యక్రమం

E.G: బొమ్మూరు గ్రామంలో JLB నగర్, నేతాజీ నగర్ ప్రాంతాల్లో డ్రైన్లు, రోడ్లను బుధవారం శుభ్రం చేశారు. కార్యక్రమంలో కార్మికులతో కలిసి స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాయుడు సునీల్, మెట్ల వెర్రియ్య, కొయ్యలమూడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మత్సేటి శివసత్య ప్రసాద్ నేతృత్వం వహించారు.

April 29, 2026 / 09:33 AM IST

అంబులెన్స్‌లోనే ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం

NLR: ఇందుకూరుపేట మండలం ముదివర్తి పాలెం అంబులెన్స్‌లో ఓ గర్భిణీ పండింటి బిడ్డకు జన్మనిచ్చింది. ఎస్టీ కాలనీకి చెందిన రుతు (20) ఆసుపత్రికి తరలిస్తుండడంతో మార్గమధ్యంలో నొప్పులు అధికం కావడంతో అంబులెన్స్‌లోనే డెలివరీ చేయడంతో మగ బిడ్డకు జన్మించింది. దీంతో అంబులెన్స్‌లోనే డెలివరీ చేసిన ఎం.టీ పీ. అంకయ్య, కే. శ్రీనివాసులు‌ను స్థానికులు అభినందించారు.

April 29, 2026 / 09:30 AM IST

రేపే పదో తరగతి ఫలితాలు.. జిల్లాలో ఉత్కంఠ

ATP: పదో తరగతి విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. అనంతపురం జిల్లాలో 143 కేంద్రాల్లో 33,260 మంది, శ్రీ సత్యసాయి జిల్లాలో 107 కేంద్రాల్లో 22,303 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. రేపు విడుదల కానున్న ఫలితాలతో తమ భవిష్యత్తు తేలనుండడంతో విద్యార్థుల్లో కొంతమేర టెన్షన్ నెలకొంది.

April 29, 2026 / 09:30 AM IST

‘గొలుగొండలో పెట్రోల్ డీజిల్ పై ఎలాంటి కొరత లేదు’

AKP: పెట్రోల్ డీజిల్ పై ఏలాంటి కొరత లేదని గొలుగొండ మండల తహసీల్దార్ కాకర నూకరాజు మంగళవారం మీడియా పర్యవేక్షణలో తెలిపారు. అనంతరం ఎ. ఎల్ పురం, చోద్యం,గొలుగొండ,ఏటి గైరంపేట బంకుల్లో పెట్రోల్ డీజిల్ కోసం ఏలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదన తాసిల్దార్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వీఆర్వో కె. పడాల్ వీఆర్ఏలు హాజరైయ్యారు.

April 29, 2026 / 09:30 AM IST

వీధి కుక్కల దాడి…40 గొర్రెలు మృతి

అన్నమయ్య: సరస్వతిపల్లి గ్రామంలో వీధి కుక్కల దాడి తీవ్ర విషాదానికి దారితీసింది. హరిజనవాడకు చెందిన పిల్లిండ్ల ఆంజనేయులు గొర్రెల మందపై రాత్రి సమయంలో కుక్కల గుంపు దాడి చేసి సుమారు 40 గొర్రెలను చంపివేసింది. ఈ ఘటనతో రైతుకు రూ.4 నుంచి 5 లక్షల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. గ్రామంలో భయాందోళనలు నెలకొనగా, అధికారులు తక్షణ చర్యలు తీసుకుని నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

April 29, 2026 / 09:30 AM IST

మైనర్ బాలికపై లైంగిక వేధింపులు.. ఆటో డ్రైవర్ ఆరెస్ట్

VSP: మధురవాడ సమీపంలోని ఓ కాలనీలో మైనర్ బాలికను లైంగికంగా వేధించిన ఆటో డ్రైవర్ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అదే కాలనీలో నివాసం ఉంటున్న ఆనంద్ పదహారేళ్ల మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. అతడిపై ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు.

April 29, 2026 / 09:26 AM IST

కారు ఢీ కొని ఇద్దరు యువకులు మృతి

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం పేరాపురం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోటబొమ్మాళి గంగుపేటకు చెందిన సదునుపల్లి రాము (34), రమేష్ (32) అక్కడికక్కడే మృతి చెందారు. వస్త్ర దుకాణాలకు సిబ్బంది పంపిస్తూ జీవనం సాగిస్తున్న వీరు విశాఖపట్నం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. రహదారి దాటుతుండగా అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టడంతో ఇద్దరూ ఎగిరిపడి మృతి చెందారు.

April 29, 2026 / 09:23 AM IST

కర్రల కంచెతోనే అంగన్వాడీ భద్రత!

PPM: వీరఘట్టం మండలం పాపంపేటలోని అంగన్వాడీ కేంద్రానికి రక్షణ గోడ లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. కేంద్రం ఆవరణలోకి పశువులు ప్రవేశిస్తుండటంతో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాత్కాలికంగా కర్రలు, వస్త్రాలతో కంచె ఏర్పాటు చేసుకున్నప్పటికీ పూర్తి భద్రత లేకపోవడంతో అధికారులు వెంటనే రక్షణ గోడ నిర్మించాలని కోరుతున్నారు.

April 29, 2026 / 09:22 AM IST

నెల రోజులుగా నీటి కష్టాలు.. ప్రజలు ఆవేదన

అన్నమయ్య జిల్లా, కురబలకోట మండలం, తెట్టు హరిజనవాడలో నెలరోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. బోరు మోటార్ పనిచేయకపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయినట్లు స్థానికులు తెలిపారు. 20 రోజుల క్రితం గ్రామ సెక్రెటరీకి అర్జీ పెట్టుకున్నా సమస్య పరిష్కారం కాలేదని, తమ గోడు ఎవరితో చెప్పుకోవాలో తెలియక గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

April 29, 2026 / 09:21 AM IST

ఎగుమతులే లక్ష్యంగా విజన్ 2030: కలెక్టర్

KDP: భారతీయ వస్త్ర రంగాన్ని ప్రపంచ మార్కెట్‌లో బలోపేతం చేసేందుకు జిల్లాలో జౌళి పరిశ్రమను, ఎగుమతులను ప్రోత్సహించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర చేనేత జౌళి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సిసోడియా, కమిషనర్ రేఖరాణి నిర్వహించిన టెక్స్ టైల్స్ ఎగుమతుల విజన్-2030 వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు.

April 29, 2026 / 09:21 AM IST