NLR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇటీవల విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అమరావతికి మద్దతుగా సంబరాలు చేశారు. కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి వర్ధిల్లాలని పలువురు అధ్యాపకులు ఆనందం వ్యక్తం చేశారు.
CTR: ఏపీ హజ్ కమిటీలో పలమనేరుకు చెందిన మౌలానా అబ్దుల్ అలీమ్ జూనెద్‌కు అవకాశం కల్పించడంపై మైనారిటీ సోదరులు హర్షం వ్యక్తం చేశారు. రాయలసీమ కేటగిరీలో సబ్ క్లాస్-3 కింద ఆయనను సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సిఫారసుతో అవకాశం లభించిందని పేర్కొంటూ, టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేను మైనారిటీ సోదరులు సన్మానించారు.
WG: ఆకివీడు డ్వాక్రా సంఘాల్లో రూ. 2 కోట్ల అవినీతి జరిగిన అధికారులు స్పందించకపోవడం దారుణమని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సందక ఉదయ కుమారి మంగళవారం ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం తగదని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మహిళా గ్రూపు సభ్యులతో కలిసి జిల్లా కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.
సత్యసాయి: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మంగళవారం చిలమత్తూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. పనుల వివరాలను అడిగి తెలుసుకుంటూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా వేగంగా పనులు పూర్తి చేయాలని నాయకులకు సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
E.G: కడియం మండలం మురమండ గ్రామానికి పంచాయతీ ప్రత్యేక అధికారిగా డిప్యూటీ ఎంపీడీవో నీలం శ్రీనివాస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు మార్కెట్ యార్డు కమిటీ డైరెక్టర్ దేవళ్ళ రామ్మోహన్ రావు, సొసైటీ చైర్మన్ వట్టికూటి జానకి రామయ్య దత్తుడు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కృషి చేయాలని కోరారు.
NDL: గోస్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలను వేధించిన పిన్నాపురం మనోహర్‌కు 3 రోజుల జైలు శిక్ష విధించారు. పోలీసుల వివరాల ప్రకారం.. దీబగుంట్లలో అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులు 296 బీఎన్‌ఎస్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. మంగళవారం ఆళ్లగడ్డ కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ రవికుమార్ శిక్ష ఖరారు చేసినట్లు పేర్కొన్నారు.
VZM: మహారాజా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నెల్లిమర్ల మిమ్స్ నుంచి వేణుగోపాలపురం వరకు మంగళవారం వాక్‌థాన్ నిర్వహించగా సుమారు 100 మంది MBBS విద్యార్థులు పాల్గొన్నారు. ఆరోగ్యంపై అవగాహన కలిగించే నినాదాలతో ప్రజలను చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, వైద్యులు పాల్గొన్నారు.
PPM: మధ్యాహ్న భోజన పథకంలో ప్రభుత్వం నిర్ణయించిన మెనూను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి హెచ్చరించారు. సాలూరు మున్సిపల్ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, ఆహార నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించారు. లోపాలు ఉంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
W.G: VRAలకు ఏడవ తేదీ వచ్చినా మార్చి నెల వేతనాలు చెల్లించకపోవడంపై జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం. ఆంజనేయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో బతుకులీడుస్తున్న VRAల కుటుంబాలు జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిలిచిపోయిన వేతనాలను విడుదల చేయాలని, రెవెన్యూ సిబ్బందిని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
కర్నూలు: పోలీసు శిక్షణా కేంద్రంలో ఎఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లకు ఎస్సై పదోన్నతి పరీక్షలు మంగళవారం నిర్వహించారు. రాయలసీమ జోన్‌కు చెందిన 72 మంది హాజరయ్యారు. ఐపీసీ, సీఆర్పీసీ, సాక్ష్యాధారాల చట్టం, పోలీసు విధానం తదితర అంశాలపై ఇండోర్ పరీక్షలు జరిగాయిని తెలిపారు. బుధవారం ఔట్‌డోర్ పరీక్షలు ఉంటాయిని పేర్కొన్నారు. నిర్వహణను దీపికా పాటిల్ ఐపీఎస్ పరిశీలించారు.
AKP: అగ్నిమాపక శాఖను మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మంగళవారం అమరావతి సచివాలయంలో అగ్నిమాపక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్త అగ్నిమాపక వాహనాలు సీఎం చంద్రబాబుతో ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై సమీక్షించారు. తొలి దశలో రూ.18 కోట్లతో 25 అత్యధిక ఫైర్ ఇంజన్లు అందజేస్తామన్నారు.
కడప: జిల్లా TDP అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి, మండల కూటమి ఇంఛార్జ్ శివనారాయణరెడ్డిల ఆధ్వర్యంలో బెడుదూరులో మంగళవారం 70 కుటుంబాలు టీడీపీలోకి చేరారు. వారికి టీడీపీ కండువా కప్పి నాయకులు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. CM, లోకేశ్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులు అయి ఎంతోమంది పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.
ATP: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తిరుపతిలో YCP జిల్లా స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా శింగనమల వైసీపీ ఇంఛార్జ్ సాకే శైలజానాథ్ మాట్లాడుతూ.. చంద్రబాబు రాయలసీమకు పెద్ద బిడ్డ కాదు, చెడ్డ బిడ్డ అని విమర్శించారు. సీమ ప్రాజెక్టులు పూర్తయితే తన ఉనికి పోతుందనే భయంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ప్రకాశం: కొండేపి మండలంలో డీవైఎఫ్ఐ, యాంటీ డ్రగ్స్ ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం జనచైతన్య జీపు యాత్ర నిర్వహించారు. అనకర్లపూడి, పెరిదేవి గ్రామాలు, పాఠశాలలు, కాలనీల్లో పర్యటించి విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఐద్వా జిల్లా కార్యదర్శి కె. రమాదేవి పిలుపునిచ్చారు.
NTR: విజయవాడ ఎన్టీఆర్ భవన్లో ఎంపీ కేసినేని చిన్ని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రజల దశాబ్దాల కల సహకారం అయిందని, రాష్ట్ర రాజధానిగా అమరావతికి అధికారికంగా రాజముద్ర పడటంతో ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. అమరావతి రైతుల త్యాగం, మహిళల రక్తం, కన్నీరు, త్యాగ ఫలితమని కొనియాడారు.