• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రకృతి కోసం ప్లాస్టిక్ వాడకం తగ్గించండి: GVMC

VSP: సింగల్ యూజ్ ప్లాస్టిక్ ప్రకృతిని, మానవ జీవనశైలిని కలుషిత పరుస్తోందని GVMC కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. సింగల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పక్షులు, జీవరాశులు, జలరాశులు రోగాల బారిన పడుతున్నాయన్నారు. ప్రజలు దీనికి బదులుగా ప్రత్యామ్నాయ వస్తువులను వాడాలని, సముద్రపు జీవ రాశులను కాపాడుకుందామని పిలుపునిచ్చారు.

April 22, 2026 / 10:13 AM IST

చిన్నారిని ముద్దాడిన YS జగన్

KDP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం పులివెందులకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున నాయకులు, కార్య కర్తలు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. ఇదే సందర్భంలో ఓ చిన్నారి YS జగన్‌ను చూసేందుకు కుటుంబ సభ్యులతో రావడం, దీనిని జగన్ గమనించి తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా చిన్నారిని పిలిపించుకొని ఆప్యాయంగా ముద్దాడారు.

April 22, 2026 / 10:09 AM IST

నువ్వు పంట సాగు లాభదాయకం

AKP: నువ్వు పంట సాగు లాభదాయకంగా ఉంటుందని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీహరిరావు రైతులకు సూచించారు. మంగళవారం కసింకోట మండలం వెదురుపర్తిలో సాగులో ఉన్న నువ్వు పంటను పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చునన్నారు. నువ్వు పంట కోత అనంతరం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

April 22, 2026 / 10:07 AM IST

కడపలో ‘స్టాప్,ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమం

KDP: జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో ‘స్టాప్,ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని పోలీసులు అమలు చేస్తున్నారు. రాత్రి వేళల్లో రహదారులపై పర్యటిస్తూ, లారీలు, బస్సులు, కార్లు, వ్యాన్ల డ్రైవర్లను ఆపి అలసట నివారణ కోసం నీళ్లతో ముఖం కడిగించి పంపిస్తున్నారు. డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.

April 22, 2026 / 10:06 AM IST

నాటు తుపాకులు అప్పగించాలి: ఎస్సై

ASR: డుంబ్రిగూడ మండల పరిధిలో లైసెన్సులు లేని నాటు తుపాకులు కలిగిన వారు తక్షణమే వాటిని పోలీస్ స్టేషన్‌కు వచ్చి స్వచ్ఛందంగా అప్పగించాలని ఎస్సై ఎల్. సురేష్ సూచించారు. లేనిపక్షంలో దర్యాప్తులో బయటపడితే కేసులు నమోదు చేసి అరెస్టులు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయాన్ని గమనించి ఎవరైనా నాటు తుపాకులు కలిగి ఉంటే స్వచ్ఛందంగా అప్పగించాలని తెలిపారు.

April 22, 2026 / 10:04 AM IST

ఎమ్మెల్యే కు స్వల్ప అనారోగ్యం , ప్రజా దర్బార్ రద్దు

VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబి నాయన రామభద్రాపురం మండలం నాయుడు వలసలో ఇవాళ నిర్వహించవలసిన ప్రజాదర్భార్ రద్దు చేసారు. ఆయన తీవ్రమైన త్రోట్‌ ఇన్ఫెక్షన్‌తో బాధ పడుతుండటంతో ఇవాళ జరగాల్సిన ఈ కార్యక్రమం రద్దు చేసినట్లు ప్రకటించారు. ఆయన ఆరోగ్యం కుదుటపడే వరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని MLA PRO కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

April 22, 2026 / 10:03 AM IST

సీఎం చంద్రబాబును కలిసిన ఎంపీ కలిశెట్టి

SKLM: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. విజయావకాశాలపై చర్చించారు. యువత, మహిళలు ఎన్డీఏ వైపు ఉన్నారని ఎంపీ వివరించారు. తమిళనాడులోని తెలుగు ప్రజల్లో చంద్రబాబుకున్న ఆదరణ, బ్రాండ్ ఇమేజ్ చూసి గర్వపడుతున్నట్లు ఎంపీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

April 22, 2026 / 10:01 AM IST

కమ్యూనిటీ పోలీసింగ్ ప్రాముఖ్యతపై అవగాహన

CTR: చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ సిబ్బందిలు సామాజిక భద్రతా కార్యకర్తలతో (WMSKs) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, గృహ హింస సమస్యలపై అవగాహన కల్పించారు. కమ్యూనిటీ పోలీసింగ్ ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. క్షేత్రస్థాయిలో ఏదైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలను వెంటనే నివేదించాలని సామాజిక భద్రతా కార్యకర్తలను కోరారు.

April 22, 2026 / 09:57 AM IST

ఈనెల 25న పుంగనూరులో కంటి వైద్య శిబిరం

CTR: పుంగనూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఈనెల 25న కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి తెలిపారు. ఆరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. కంటి జబ్బులు కలిగిన వారు శిబిరంలో పాల్గొని చికిత్స చేయించుకోవాలని కోరారు.

April 22, 2026 / 09:55 AM IST

అమరావతికి మరో 1529 ఎకరాలు

GNTR: రాజధాని రెండో దఫా భూసమీకరణ కొనసాగుతోంది. అమరావతి పరిధిలోని నాలుగు గ్రామాల రైతులు 1529 ఎకరాలను సీఆర్డీఏకు అప్పగించారు. ఎండ్రాయిలో 580, కర్లపూడిలో 592, పెదమద్దూరులో 342, వైకుంఠపురంలో 15 ఎకరాలు పూలింగ్‌కు వచ్చాయి. ఈ గ్రామాల్లో మొత్తం 7,562 ఎకరాలు సేకరించాల్సి ఉండగా, ప్రస్తుతానికి 1529 ఎకరాలే వచ్చినట్లు సీఆర్డీఏ అధికారులు మంగళవారం వెల్లడించారు.

April 22, 2026 / 09:33 AM IST

డిగ్రీ ప్రథమ సెమిస్టర్ ఫలితాల విడుదల

ATP: అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల డిగ్రీ మొదటి ఏడాది ఫలితాలను తాజాగా విడుదల చేశారు. ప్రిన్సిపాల్ ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో వర్సిటీ అధికారులు, ప్రిన్సిపాల్ పద్మశ్రీ ఫలితాలను ప్రకటించారు. మొత్తం 1,447 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 672 మంది ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలు ముగిసిన రెండు నెలల్లోపే ఫలితాలు విడుదలయ్యాయి.

April 22, 2026 / 09:27 AM IST

పుట్టపర్తికి వచ్చిన మర్రి శశిధర్ రెడ్డి

సత్యసాయి: పుట్టపర్తి విచ్చేసిన కేంద్ర మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి సాయి కుల్వంత్ మందిరంలోని శ్రీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో వచ్చిన ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాంతిభవన్‌లో సత్యసాయి ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

April 22, 2026 / 09:18 AM IST

జీవీఎంసీ కమిషనర్ పేరుతో నకిలీ వాట్సాప్ అకౌంట్

VSP: జిల్లాలో సైబర్ మోసాలపై ఎప్పటికప్పుడు పోలీసులు అవగాహన కల్గిస్తున్నారు. అయితే సైబర్ కేటుగాళ్లు మాత్రం రోజురోజుకీ రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. ఏకంగా జీవీఎంసీ కమిషనర్ కేతాన్ గార్గ్ ఫోటోతో నకిలీ వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసి దాని ద్వారా జీవీఎంసీ అధికారులకు డబ్బులు అడుగుతున్నట్టు మెసేజ్‌లు పంపారు.

April 22, 2026 / 09:14 AM IST

గుండెపోటుతో లైన్‌మైన్ కన్నుమూత

ASR: అంజలి శనివారం గ్రామానికి చెందిన లైన్‌మైన్ ఎర్రం దొర గుండెపోటుతో కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. జి. మాడుగుల మండలంలో నుర్మతి పరిధిలో లైన్‌మైన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన నర్సీపట్నం తన స్వగృహం వద్ద మంగళవారం రాత్రి ఆకస్మత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి కుటుంబానికి తీరని లోటును మిగిల్చింది.

April 22, 2026 / 09:14 AM IST

మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ

ప్రకాశం: జరుగుమల్లి మండలం వావిలేటిపాడు వద్ద మంగళవారం రాత్రి చాతుకుపాడు గ్రామానికి చెందిన శిరోమణి అనే మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు బంగారు గొలుసు చోరీ చేశారు. వ్యక్తిగత పనులపై మహిళ ఒంగోలు వెళ్లి వస్తుండగా మార్గం మధ్యలో దొంగలు తన బంగారు గొలుసు చోరీ చేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

April 22, 2026 / 09:13 AM IST