• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వైభవంగా పైడితల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు

VZM: కొత్తవలస మండలం వీరభద్రపురంలోని చుట్టుప్రక్కల ఏడు గ్రామాలకు చెందిన ఇలవేల్పు శ్రీ వేదుళ్ల పైడితల్లమ్మ విగ్రహ ప్రతిష్ట వేడుకలను ఇవాళ ఘనంగా ప్రారంభించారు. మాజీ సర్పంచ్ గేదల త్రినాధమూర్తి ఆద్వర్యంలో పురోహితుడు ఉమా మహేశ్వరశర్మ విఘ్నేశ్వర పూజ, అఖండ దీపారాధన, అగ్ని ప్రతిష్టాపన, హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏడు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

April 27, 2026 / 11:06 AM IST

విశాఖలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన

VSP: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ రెండు రోజుల పర్యటన కోసం ఇవాళ విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు అయ్యన్న పాత్రుడు, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, సీపీ శంకబ్రత బాగ్చి స్వాగతం పలికారు. సాయంత్రం ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొని మంగళవారం తిరుగు ప్రయాణం కానున్నారు.

April 27, 2026 / 11:04 AM IST

ఆకతాయిల అడ్డాగా మారిన సంత షెడ్లు

ASR: చింతపల్లి గిరిజన రైతుల కోసం నిర్మించిన మార్కెట్ సంత షెడ్లు ఆకతాయిల అడ్డాగా మారి దయనీయ స్థితికి చేరిందని స్థానికులు తెలిపారు. పంచాయతీ, నాబార్డ్ నిధులతో నిర్మించిన ఈ షెడ్లు ప్రస్తుతం ఖాళీ మద్యం సీసాలు, చెత్తాచెదారంతో డంపింగ్ యార్డును తలపిస్తున్నాయి. ప్రతి బుధవారం జరిగే సంతకు వచ్చే రైతులు అసౌకర్యాల కారణంగా రహదారి పక్కనే వ్యాపారం చేస్తున్నారు.

April 27, 2026 / 11:03 AM IST

విశాఖకు తరలి వెళ్ళిన టీడీపీ నాయకులు

AKP: ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. ఈ సమావేశానికి మాకవరపాలెం మండలం నుంచి టీడీపీ శ్రేణులు ప్రత్యేక బస్సుల్లో బయలుదేరాయి. ఈ నేపథ్యంలో రాచపల్లి రామేశ్వరమ్మ గుడి వద్ద టీడీపీ యువనేత చింతకాయల రాజేశ్ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

April 27, 2026 / 11:00 AM IST

కడియం పేపర్ మిల్‌ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె

E.G: కడియం పేపర్ మిల్‌లోని కాంట్రాక్ట్ కార్మికులు సోమవారం సమ్మెకు దిగారు. ఈ మేరకు వేతనాలు, సౌకర్యాల కోసం వారు నిరసన వ్యక్తం చేశారు. కొత్త వేతన విధానాన్ని అమలు చేయాలని కోరుతూ నిరసన తెలిపారు. దీంతో మిల్ పనులు ప్రభావితమయ్యాయి. వెంటనే యాజమాన్యం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు.

April 27, 2026 / 10:52 AM IST

కాలేజీ బస్సుకు ప్రమాదం..!

TPT: పెళ్లకూరు మండలం పెన్నేపల్లి వద్ద సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తి వైపు నుంచి విద్యానగర్‌లోని NBKR కాలేజీకి బస్సు బయల్దేరింది. మార్గమధ్యంలో అదుపుతప్పి హైవే సర్వీసు రోడ్డును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది విద్యార్థులు ఉండగా.. ఎవరికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

April 27, 2026 / 10:46 AM IST

‘తిరుమల ప్రసాదం బాగుంది’

తిరుమలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. ఆయన తన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుమలలో ప్రసాదం నాణ్యత చాలా బాగుందని కొనియాడారు. హిందూ దేవుళ్లను, హిందువులను అవమానించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

April 27, 2026 / 10:42 AM IST

పెట్రోల్, డీజిల్ కోసం రహదారులపై నిలిచిన వాహనాలు

VSP: భీమిలి, తగరపువలస, ఆనందపురం, వేములవలస, పెద్దపాలెం, ఎల్.వి పాలెం, దుక్కవానిపాలెం ప్రాంతాల్లో పెట్రోల్ కొరత తీవ్రంగా ఉందని స్థానికులు తెలిపారు. పలుచోట్ల పెట్రోల్ బంకులు మూతపడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందుబాటులో ఉన్న కొమ్మాది పెట్రోల్ బంక్ వద్ద భారీగా వాహనాలు క్యూలలో నిలిచిపోయాయన్నారు

April 27, 2026 / 10:40 AM IST

చిలకలూరిపేటలో డీజిల్ కటకట

PLD: చిలకలూరిపేటలో ఇంధన కొరత తీవ్రరూపం దాల్చింది. నిల్వలు లేక పలు పెట్రోల్ బంకుల్లో ఇవాళ ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇంధనం దొరక్క రవాణా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ట్రాక్టర్లకు డీజిల్ లేక వ్యవసాయ పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. అధికారులు వెంటనే స్పందించి సరఫరాను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

April 27, 2026 / 10:38 AM IST

మైనార్టీ సమస్యలపై మారుతి నాయుడుకు వినతి

KRNL: ఆదోని పట్టణంలోని మూడో వార్డు పింజరిగేరి సయ్యద్ పేటకు చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు ఇవాళ టీడీపీ యువ నాయకుడు మారుతి నాయుడును కలిశారు. దర్గా మైదానం అభివృద్ధికి ఎర్రమట్టి అందించాలని, స్థానిక సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై స్పందించిన మారుతి నాయుడు మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

April 27, 2026 / 10:34 AM IST

బొలెరో వాహనం బోల్తా పడి పలువురికి గాయాలు

NDL: నంద్యాల- గిద్దలూరు రహదారి నల్లమల ఘాట్ రోడ్లో బొలెరో వాహనం బోల్తా పడి పలువురికి గాయాలయ్యాయి. సోమవారం గాజులపల్లికి చెందిన కూలీలు గిద్దలూరులో పని నిమిత్తం వెళ్తున్నారు. నల్లమల్ల ఘాట్లో ఎస్. టర్నింగ్ వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పరువురికి గాయాలయ్యాయి. 108 వాహనాల్లో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

April 27, 2026 / 10:32 AM IST

బంకుల్లో రద్దీ నియంత్రణకు చర్యలు: MRO

WG: మొగల్తూరు(M)లోని పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత వల్ల ఏర్పడిన రద్దీని నియంత్రించేందుకు చర్యలు చేపట్టినట్లు MRO కె.రాజ్ కిషోర్ ఆదివారం తెలిపారు. మండలంలోని ఆరు బంకుల్లో రెవెన్యూ, పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం బంకుల వద్ద ఎటువంటి రద్దీ లేదని వివరించారు. వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని ఆయన వెల్లడించారు.

April 27, 2026 / 10:30 AM IST

మే ఒకటి నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు

AKP: నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మే 1 నుంచి 31 వరకు ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు ఇవాళ శాప్ కోచ్ అబ్బు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 9, సాయంత్రం 4.30 నుంచి 8 గంటల వరకు కరాటే, తైక్వాండో, యోగా, కబడ్డీ, చెస్, బాక్సింగ్, అథ్లెటిక్స్ క్రీడల్లో అనుభవజ్ఞులైన కోచ్‌లు శిక్షణ ఇస్తారన్నారు.

April 27, 2026 / 10:30 AM IST

పెట్రోల్ బంకులను పరిశీలించిన ఎస్సై

ప్రకాశం: పొదిలి SI రాజేశ్ ఇవాళ ఉదయం పట్టణంలోని పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంధన నాణ్యత, కొలతల్లో సరైన ప్రమాణాలు పాటిస్తున్నారా అని పరిశీలించారు. బంక్ యాజమాన్యాలకు వినియోగదారులను మోసంచేసే అక్రమాలు చేయకూడదని హెచ్చరించారు. మీటర్లు సరిగా పనిచేస్తున్నాయా, సరైన పరిమాణంలో ఇంధనం అందిస్తున్నారా అని ప్రత్యేక దృష్టి సారించారు.

April 27, 2026 / 10:27 AM IST

కొత్తవలస నూతన సీఐగా విజయకుమార్

VZM: కొత్తవలస పోలీస్ స్టేషన్ నూతన సీఐగా విజయకుమార్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఆయన విశాఖ రేంజ్ వీఆర్ నుంచి కొత్తవలసకు బదిలీ‌పై వచ్చారు. ఈయన 1998 బ్యాచ్‌కు చెందినవారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు విధులు నిర్వహించిన షణ్ముఖరావుకు వీఆర్‌కు బదిలీ చేసారు. సీఐ మాట్లాడుతూ.. కొత్తవలస ట్రాఫిక్‌పై దృష్టి సారిస్తూ, రాత్రి నిఘా ముమ్మరం చేస్తానని చెప్పారు.

April 27, 2026 / 10:20 AM IST