• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రంగనాథ స్వామిని దర్శించుకున్న ఎంపీ

నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సోమవారం జూపాడు బంగ్లా మండలం తత్తూరు గ్రామంలోని శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

April 6, 2026 / 08:12 PM IST

సర్పంచ్ రాధాకృష్ణకు ఘన సత్కారం

కృష్ణా: నందివాడ మండలం తుమ్మలపల్లి గ్రామ సర్పంచ్ సింగలా రాధాకృష్ణ ఐదేళ్ల పదవీకాలం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా, పంచాయతీ కార్యాలయంలో సత్కార కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. పంచాయతీ సెక్రటరీ ‘స్వర్ణ గ్రామ పంచాయితీ సిబ్బంది కలిసి సర్పంచ్ రాధాకృష్ణను శాలువతో సత్కరించారు. గ్రామ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

April 6, 2026 / 08:00 PM IST

హైవేపై ప్రమాదం.. వృద్ధుడికి తీవ్ర గాయాలు

BPT: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సజ్జాపురానికి చెందిన తేలప్రోలు నాగేశ్వరరావు (62) తన టీవీఎస్ ఎక్సెల్‌పై రోడ్డు దాటుతుండగా, వేగంగా వచ్చిన ఒక ట్రాలీ ఆటో ఆయనను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి.

April 6, 2026 / 08:00 PM IST

‘వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు’

విశాఖపట్నంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్‌ కిశోర్‌ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యతతో పాటు గడువులోగా పూర్తి చేయాలని, పదేపదే వచ్చే సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 334 వినతులు నమోదయ్యాయని చెప్పారు.

April 6, 2026 / 08:00 PM IST

కాలువ పూడిక తీత పనులపై ఎమ్మెల్యే గళ్ళా మాధవి సమీక్ష

GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పీకల వాగు కాలువ పూడిక తీత పనులను ఎమ్మెల్యే గళ్ళా మాధవి సోమవారం పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నీటి భద్రత–సాగు నీటి సంఘాల బాధ్యత’ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ పనులు కొనసాగుతున్నాయి.

April 6, 2026 / 08:00 PM IST

బ్రహ్మంగారి విగ్రహ ప్రతిష్టలో ప్రభుత్వ విప్ జీవీ

PLD: నూజెండ్ల మండలం కంభంపాడు గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవాలయ ప్రతిష్టా మహోత్సవం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ శ్రీ జీవీ ఆంజనేయులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిభావం వల్ల గ్రామంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని, బ్రహ్మంగారి బోధనలు అందరికీ ఆదర్శప్రాయమని జీవితంలో పేర్కొన్నారు.

April 6, 2026 / 08:00 PM IST

ప్రతిరోజు త్రాగునీరు అందించాలని సీఐటీయూ వినతి

NTR: నందిగామ పట్టణంలో వేసవి కాలం దృష్ట్యా ప్రతిరోజు తాగునీరు అందించాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు అర్జీ సమర్పించారు. 20 వార్డుల్లో పది రోజులుగా నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఐటీయు కార్యదర్శి కె. గోపాల్ తెలిపారు. అనాసాగరం గ్రామంలోని కొత్త వాటర్ ట్యాంక్‌ను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.

April 6, 2026 / 08:00 PM IST

తప్పుడు బెయిల్ పత్రాలు సమర్పించిన వ్యక్తిపై కేసు

VZM: 2024లో ఎస్.కోట పోలీస్ స్టేషన్‌లో నమోదైన గంజాయి కేసులో నాసిక్‌కు చెందిన తమన్నా జావేద్ నిందితుడు. ఈ కేసులో ఎస్.కోటకి చెందిన ఎస్.సాంబశివరావు, నిందితుడికి బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేశారు. అయితే, దరఖాస్తును పరిశీలించిన కోర్టుకు తప్పుడు పత్రాలు సమర్పించినట్లు తేలింది. కోర్టు సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సీఐ వెల్లడించారు.

April 6, 2026 / 08:00 PM IST

‘ఈ నెల 8న మార్టేరులో కిసాన్ మేళా’

W.G: మార్టేరు వరి పరిశోధనా కేంద్రంలో ఈనెల 8న భారీ ‘కిసాన్ మేళా’ నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి(ఏవో) డాక్టరు జ్యోషిలా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని రైతులందరూ పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆమె కోరారు. సాగు పద్ధతులపై అవగాహనతో పాటు, శాస్త్రవేత్తలు రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు నేరుగా అందిస్తారని పేర్కొన్నారు.

April 6, 2026 / 07:48 PM IST

పౌర సేవలకు అంతరాయం

SKLM: కాశీబుగ్గ పోస్టాఫీస్‌లో పౌర సేవలకు సోమవారం అంతరాయం ఏర్పడింది. విద్యుత్ స్తంబాల మార్పిడి పనుల కారణంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. ఖాతాదారులు, పెన్షన్ దారులు అనేక అవస్థలు పడుతున్నారు. పోస్టల్ ఉన్నతాధికారులు స్పందించి కొత్త యూపీఎస్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

April 6, 2026 / 07:47 PM IST

నీటి ప్రవాహాలతో సరదాలు వద్దు: ఎస్సై

NDL: నీటి ప్రవాహాల వద్ద యువత సెల్ఫీలు తీసుకోవడం, షార్ట్ ఫిలింలు తీయడం వంటి సరదాలు వద్దని చాగలమర్రి మండల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ రాజారెడ్డి తగు హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. యువత సరదాలకు వెళ్లి తల్లిదండ్రులకు విషాదం మిగిల్చకూడదని సూచించారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో నదిలోకి దిగకూడదని తెలిపారు.

April 6, 2026 / 07:45 PM IST

ఉపాధ్యాయులతో ఎమ్మెల్యే సమావేశం

అన్నమయ్య: మదనపల్లెలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో సమావేశమై ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. గతంతో పోలిస్తే విద్యార్థుల సంఖ్య తగ్గిన నేపథ్యంలో నమోదు పెంపుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పాఠశాలల సౌకర్యాలు, విజయగాథలను తల్లిదండ్రులకు తెలియజేయాలని కోరారు. హాస్టల్ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని MLA కోరారు.

April 6, 2026 / 07:43 PM IST

స్వామివారి సేవలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా

CTR: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారిని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం ఆలయ ఏఈవో రవీంద్రబాబు, అర్చకులు, వేదపండితులు, ఇతర ఆలయ సిబ్బంది కూడా హాజరయ్యారు.

April 6, 2026 / 07:43 PM IST

‘టెంపుల్ సిటీగా తాడిపత్రి అభివృద్ధి చేయండి’

ATP: తాడిపత్రిని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలని MLA జేసీ అస్మిత్ రెడ్డి CM చంద్రబాబుని కోరారు. యాడికిలో సీఎంను కలిసి ఈ ప్రాంతంలోని చారిత్రక ఆలయాల ప్రాముఖ్యతను వివరించారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నుంచి సహకారం కావాలని విన్నవించారు.

April 6, 2026 / 07:40 PM IST

478 మంది రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ

ELR: కొయ్యలగూడెం మండలం, పొంగుటూరులో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “మీ భూమి-మీ హక్కు” కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ రాజముద్రతో రూపొందించిన పట్టాదార్ పాస్ పుస్తకాలను 478 మంది అర్హులైన రైతులకు పంపిణీ చేశారు.

April 6, 2026 / 07:36 PM IST