CTR: ఎస్ఆర్ పురం (M) 49. కొత్తపల్లి మిట్టలో వారపు సంతకు మంగళవారం వేళం జరిగింది. సీఐ హనుమంతప్ప, Dy. ఎంపీడీవో నాగరత్నమ్మ ఆధ్వర్యంలో వారపు సంత, షాపింగ్ కాంప్లెక్స్ మొదలైన ఆస్థులకు బహిరంగ వేలం నిర్వహించారు. 49. కొత్తపల్లి మిట్టకు చెందిన సీనియర్ నేత సూరి రెడ్డి రూ.16.20 లక్షలు హెచ్చుగా వేలం పాడి వారపు సంతను దక్కించుకున్నారు.
PPM: శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారిని ఇవాళ బొబ్బిలి ఎమ్మెల్యే R.V.S.K.K.రంగారావు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పీసపాటి శ్రీనివాసాచార్యులు , ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు సాదర స్వాగతం పలికారు. దేవాలయమలో విశ్వశాంతి, లోకకళ్యాణార్థం నిర్వహిస్తున్న నవ నారసింహ యాగంలో పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
VSP: గాజువాకలోని షీలానగర్ వద్ద 6.45 ఎకరాల్లో 400 మంది వైద్య సదుపాయం అందించే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని విశాఖ ఎంపీ భరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మంగళవారం ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణ పనులు పరిశీలించి మాట్లాడారు. రెండు నెలలు పూర్తిస్థాయిలో పనులు జరిగి ఆసుపత్రి ఉద్యోగ నియమకాలు చేస్తామన్నారు.
VZM: పేద కుటుంబాల విద్యుత్ కష్టాలను తీర్చి వారి ఇళ్లలో వెలుగులు నింపే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజన’ పథకాన్ని నెల్లిమర్ల MLA లోకం నాగ మాధవి డెంకాడ గ్రామంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సోలార్ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు విద్యుత్ బిల్లుల భారం పూర్తిగా తగ్గుతుంది అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
అన్నమయ్య: రైల్వేకోడూరులోని విజడమ్ సెంట్రల్ స్కూల్ 5వ తరగతి విద్యార్థిని కే.లిఫిత మార్చి 19-20 తేదీలలో కేరళలోని తిరువనంతపురంలో జరిగిన భరతనాట్య పోటీలలో పాల్గొని అవార్డు గెలుచుకుంది. ఈ విషయాన్ని విజడమ్ విద్యా సంస్థల ఛైర్మన్ డా. టీ.ప్రదీప్ తెలిపారు. ఈ సందర్భంగా ఛైర్మన్, అడ్మిన్ డైరెక్టర్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం లిఫితకు శుభాకాంక్షలు తెలిపారు.
W.G: కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ 1వ వార్డు వైసీపీ ఇన్‌ఛార్జ్ కొర్రపాటి వెంకటేశ్వరరావు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఇన్‌ఛార్జ్ వడ్డే రఘురాం పాల్గొన్నారు. అనంతరం పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.
ఉయ్యాలవాడలో ఈనెల 25 నుంచి జరగనున్న గంగాభవాని తిరుణాల నిర్వహణకు అధికారులు సహకరించాలని నిర్వాహకులు కోరారు. ఎంపీడీవో ఉమామహేశ్వరరావును గ్రామ పెద్దలు కలిసి వినతిపత్రం ఇవాళ అందజేశారు. తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, పోలీస్ బందోబస్తు, రవాణా సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వేసవి నేపథ్యంలో భక్తులకు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.
KKD: గొల్లప్రోలు పట్టణంలో జనసేన నాయకులు కడారి తమ్మయ్య నాయుడు సొంత నిధులతో వాటర్ ట్యాంకర్ సమకూర్చారు. దీనిని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రారంభించారు. వేసవిలో తాగునీటి కొరతను ముందుగానే గుర్తించి, ప్రభుత్వ సహాయం కోసం వేచి చూడకుండా స్వయంగా ముందుకు వచ్చిన తమ్మయ్య నాయుడు చొరవను ఎంపీ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
SKLM: దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలో భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. మందస గ్రామంలో ఇవాళ ఆయన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో పతాకాన్ని ఆవిష్కరించి, నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కోనసీమ: రావులపాలెంలో రహదారి వెంబడి ఉన్న అక్రమ కట్టడాలు, ఆక్రమణలు తొలగింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. పట్టణంలో రోడ్ల వెంట అక్రమంగా నిర్మించిన కట్టడాలు రహదారి విస్తరణకు అడ్డంకిగా మారాయి. మంగళవారం ఎంపీడీవో సుబ్రహ్మణ్యం స్వయంగా తొలగింపు ప్రక్రియను పరిశీలించారు. రహదారి వెంబడి అక్రమ నిర్మాణాలు తొలగించడం వల్ల వాహన రాకపోకలు సులభతరమవుతాయన్నారు.
KRNL: చిప్పగిరి మండలంలో సర్పంచుల పదవీకాలం ముగియడంతో గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఎంపీడీవోలు ఇవాళ తెలిపారు. బంటనహాల్, గుమ్మనూరు, ఏరూరులకు శ్రీనివాసరెడ్డి, బిల్డోన్, కుందనకుర్తి, నేమకలుకు నాగరాజు నియమితులయ్యారు. చిప్పగిరి, రామదుర్గంకు అల్లా బకాష్, ఇతర గ్రామాలకు అధికారులు బాధ్యతలు చేపట్టారు.
ప్రకాశం: మర్రిపూడి మండలం చిమట గ్రామంలో గంగమ్మ తల్లి జాతర తిరుణాళ్లు ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆరోజు ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు పొంగళ్ళు, మొక్కులు భక్తులు సమర్పించుకుంటారని నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం వేళల్లో ఆయా రాజకీయ పార్టీ వారి ఆధ్వర్యంలో విద్యుత్ ప్రభలు నెలకొల్పనున్నారు.
NLR: జిల్లాలో త్వరలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తామని ఉదయగిరి ఇంఛార్జ్ వ్యవసాయ శాఖ అధికారి పి.చెన్నారెడ్డి మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కొట్టాలపల్లి సొసైటీ ద్వారా వరి ధాన్యం కొనుగోళ్లు చేస్తామన్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు చేశామని తెలిపారు. త్వరలో తేదీ ప్రకటించి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు.
AKP: నాతవరం డిప్యూటీ ఎంపీడీవో కూర్మారావు మండలంలోని ఎర్రవరం సచివాలయాన్ని ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు తనిఖీ చేసి హాజరు పట్టికను పరిశీలించారు. సచివాలయంలో డిజిటల్ సేవలు ఏ విధంగా అందుతున్నాయనే విషయాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత చేరువ అయ్యేలా సిబ్బంది కృషి చేయాలన్నారు.
KDP: సిద్దవటం మండలంలోని కొత్త మాధవరం 123 వార్డులో వెలసిన శ్రీ భక్త వీరాంజనేయ స్వామికి ఇవాళ ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకం, అలంకరణ, గణపతి పూజ, ఆకు పూజ, వడమాల పూజ, సహస్రనామార్చన వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.