• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జాతీయ స్థాయి క్రీడాకారులకు ఆర్థిక సాయం

KRNL: జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైన మంత్రాలయం ZPHS విద్యార్థులకు సోమవారం వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రదీప్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. ఈ నెల 20 నుంచి 28 వరకు రాజస్థాన్‌‌లో జరగనున్న పోటీలకు వెళ్లే ముగ్గురు విద్యార్థులకు రూ.20 వేలు అందజేశారు. క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయమని వ్యాయామ ఉపాధ్యాయుడు రవీంద్ర నరసింహ రాజు పేర్కొన్నారు.

April 7, 2026 / 06:55 AM IST

తెనాలిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన

GNTR: తెనాలి మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ కమిషనర్ రామా అప్పలనాయుడు ఆధ్వర్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్, హోటల్స్ అసోసియేషన్ సభ్యులు, ప్లాస్టిక్ విక్రయదారులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని, పర్యావరణ హిత ప్రత్యామ్నాయాల వినియోగించాలని సూచించారు.

April 7, 2026 / 06:54 AM IST

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి.. కేసు నమోదు

NLR: బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తన కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఓ తల్లి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అల్లుడు కార్తీక్ డబ్బుల కోసం తన కుమార్తెను వేధించేవాడని ఆ వేధింపుల వల్లే ఆమె మరణించిందని ఆరోపించింది. బాధ్యుడైన కార్తీక్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరాగా దీని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 7, 2026 / 06:46 AM IST

‘ఒత్తిడి లేకుండా ప్రతిభను గుర్తించి లక్ష్యాలను చేరుకోవాలి’

PPM: టెన్త్ నుంచే విద్యార్థులు ఉన్నత భవిష్యత్తు కోసం స్పష్టమైన కెరీర్‌ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని JC యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు. నిన్న స్దానికంగా ఉన్న ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన కెరీర్‌ ఫెస్ట్‌-2026 ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన ఆయన ఒత్తిడితో కాకుండా స్వయం ప్రతిభను గుర్తించి లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.

April 7, 2026 / 06:45 AM IST

బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవు: ఎక్సెజ్ సీఐ

KDP: సిద్దవటం ప్రోహిబిషన్ & ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్దవటం, అట్లూరు, ఒంటిమిట్ట మండలాల్లో బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయిస్తే కఠినమైన చర్యలు తప్పవని ఎక్సైజ్ సీఐ రాజశేఖర్ హెచ్చరించారు. సోమవారం సాయంత్రం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అట్లూరు, సిద్దవటం, ఒంటిమిట్ట మండలాల్లో గంజాయి ఇతర మాదక ద్రవ్యాలు బెల్ట్ షాపులు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఆయన తెలిపారు.

April 7, 2026 / 06:40 AM IST

మంత్రి పయ్యావుల కేశవ్ నేటి పర్యటన వివరాలివే

ATP: మంత్రి పయ్యావుల కేశవ్ మంగళవారం అనంతపురంలో పర్యటించనున్నారు. ఉదయం రాంనగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి అందుబాటులో ఉంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి విద్యుత్, హంద్రీనీవా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ కార్యవర్గ సభ్యులు తెలిపారు.

April 7, 2026 / 06:37 AM IST

శ్రీ మఠం అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం

KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి రూ.లక్ష విరాళంగా వచ్చినట్లు సోమవారం మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. బెంగళూరుకు చెందిన వెంకటేష్ అనే భక్తుడు విరాళం అందజేశారన్నారు. ఈ విరాళాన్ని అన్నదాన పథకానికి వినియోగించాలని భక్తుడు కోరారు. వెంకటేష్ కుటుంబ సభ్యులకు శ్రీ మఠం అధికారులు ప్రత్యేక దర్శన కల్పించి, ఆశీర్వచనాలు అందజేశారు.

April 7, 2026 / 06:36 AM IST

సీఎంకు బహిరంగ లేఖ

BPT: ఈ నెల 9న సీఎం సూరేపల్లి రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జైభీమ్ రావ్ భారత్ పార్టీ నేత రమేష్ రాంజీ ఓ లేఖ విడుదల చేశారు. రేపల్లె డివిజన్ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఓలేరు వద్ద చెక్ డ్యాం నిర్మించాలన్నారు. జంపనిలో పారిశ్రామికవాడ, రేపల్లెలో పీజీ సెంటర్, ఆటోనగర్ ఏర్పాటు చేయాలన్నారు. భట్టిప్రోలు బౌద్ధ క్షేత్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

April 7, 2026 / 06:35 AM IST

PMMSY పథకంతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగు: ఎమ్మెల్యే

VZM: మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నెల్లిమర్ల MLA లోకం నాగ మాధవి పేర్కొన్నారు. సోమవారం ముక్కాం పంచాయితీలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత ట్రాన్స్‌పాండర్లను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ… PM మోదీ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (PMMSY ) పథకం మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతోందని కొనియాడారు.

April 7, 2026 / 06:30 AM IST

‘నిర్దేశిత గడువులోగా నీటి సంరక్షణ పనులు పూర్తి చేయాలి’

SKLM: నిర్దేశిత గడువులోగా నీటి సంరక్షణ పనులు పూర్తి చేయాలి అని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సోమవారం సాయంత్రం అధికారులను ఆదేశించారు. జిల్లాలో భూగర్భ జల మట్టాలను పెంపొందించడమే లక్ష్యంగా చేపట్టిన ‘జలధార – జలహారతి’ పనులను 100 రోజుల్లోగా పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలోని కాలువలు, చెరువులలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

April 7, 2026 / 06:30 AM IST

బైక్ దగ్గంపై పోలీసుల స్పష్టత

KDP: వేంపల్లి బైపాస్ రోడ్డులో మోటారు సైకిల్ కాలిపోయిన ఘటనపై CI నరసింహులు క్లారిటీ ఇచ్చారు. ఇందులో ఎటువంటి ప్రమేయం లేదనన్నారు. ఆదివారం రాత్రి MM ఫంక్షన్ హాల్ వద్ద పెళ్లికి వచ్చిన కమాల్ బాష తన పల్సర్ బైక్‌ను స్నేహితుడు మహమ్మద్‌కు ఇచ్చాడు. బైకును వేగంగా నడపడం వల్ల NTR సర్కిల్ వద్ద స్కీడ్ అయి కిందపడింది. ట్యాంక్ నుంచి పెట్రోల్ లీకై, మంటలు చెలరేగి దగ్ధమైందన్నారు.

April 7, 2026 / 06:25 AM IST

బాపట్ల అభివృద్ధికి లోకేష్ భరోసా

BPT: మంత్రి లోకేష్‌ను బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి, సూర్యలంక పర్యాటకంపై ఆయనకు వివరించారు. అక్కడ పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని లోకేష్ అభినందించారు. సంక్షేమ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బాపట్ల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని లోకేష్ భరోసా ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

April 7, 2026 / 06:24 AM IST

అర్జీదారులతో ఫోన్‌లో మాట్లాడిన కలెక్టర్

KRNL: 1100 కాల్ సెంటర్ ఫిర్యాదుల పరిష్కారంపై అసంతృప్తి వ్యక్తం చేసిన అర్జీదారులతో జిల్లా కలెక్టర్ సిరి సోమవారం ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తహశీల్దార్లు, సర్వే అధికారులను ఆదేశించారు. సీఎం కార్యాలయం నుంచి వచ్చే అర్జీలను ప్రతి వారం పర్యవేక్షించాలన్నారు.

April 7, 2026 / 06:17 AM IST

తిరుమల హుండీలో చెల్లని డబ్బులు

TPT: తిరుమలలోని శ్రీవారి హుండీకి భక్తులు చెల్లని నోట్లు సమర్పించడం సమస్యగా మారింది. డిమానిటైజేషన్ సమయంలో రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు ఇప్పటికీ హుండీలో కనిపిస్తున్నాయి. ఈ రద్దు నోట్ల విలువ సుమారు రూ.400 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. రద్దయిన రూ.2000 నోట్లు కూడా ప్రతి నెల సుమారు రూ.35 లక్షల వరకు హుండీలో సమర్పించబడుతున్నాయని టీటీడీ అధికారులు తెలిపారు.

April 7, 2026 / 06:16 AM IST

ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో రాజీవ్ కనకాల సందడి

VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల మెగా కల్చరల్ ఫెస్ట్‌లో ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తండ్రి చదువుకున్న ఇదే వేదికపై నిలబడటం ఎంతో భావోద్వేగాన్ని కలిగిస్తోందని, ఈ కార్యక్రమంలో పాల్గొనడమే తనకు దక్కిన పెద్ద పురస్కారమని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ పాల్గొన్నారు.

April 7, 2026 / 06:14 AM IST