• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ట్రేడింగ్‌లో లాభాల పేరిట భారీ మోసం..!

ఏలూరు అగ్రహారానికి చెందిన వెంకట సాయి దీపక్ ట్రేడింగ్‌లో లాభాల పేరట మోసపోయానంటూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశాడు. ఎస్సై రామకృష్ణ వివరాల మేరకు.. హైదరాబాదులోని ఓ కంపెనీలో తన తోటి ఉద్యోగిగా పనిచేస్తున్న సాయి ప్రవీణ్‌కు గత ఏడాది పలు దఫాలుగా రూ. 6.64 లక్షల సొమ్మును వెంకట సాయి ఇచ్చాడన్నారు. 6 నెలలు గడుస్తున్నా లాభాలు ఇవ్వలేదని తెలిపారు.

May 31, 2026 / 01:11 PM IST

భర్తను హతమార్చిన భార్య..?

KRNL: ఆదోని పట్టణంలోని అమరావతి నగర్‌లో భార్య చేతిలో భర్త మహేష్ మృతిచెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో రాత్రి భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం. అనంతరం మహేష్‌ను సమీప పొలం వద్దకు తీసుకెళ్లి గొంతు పిసికి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై ఇవాళ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

May 31, 2026 / 12:50 PM IST

ASI శ్రీనివాసులు అనారోగ్యంతో ఆకస్మిక మృతి

TPT: నారాయణవనం మండల పోలీస్ స్టేషన్‌లో ASIగా పని చేస్తున్న శ్రీనివాసులు ఆదివారం వేకువజామున రేణిగుంటలోని అమర హాస్పిటల్లో మ‌ృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. గాజుల మండ్యంకు చెందిన ఆయన అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతూ చనిపోయారన్నారు. ఆయనకు ప్రస్తుతం SIగా పదోన్నతి లభించింది. శిక్షణ కోసం అనుమతి వస్తుందని ఎదురుచూస్తున్నారని సహచర పోలీసులు తెలిపారు.

May 31, 2026 / 12:47 PM IST

మండలంలో పొగాకుపై అవగాహన ర్యాలీ

CTR: పొగాకు వాడకంతో ఆరోగ్యానికి నష్టం చేకూరుతుందని సదుం మండలం చెరుకువారిపల్లి పీహెచ్‌సీ డాక్టర్ హేమంత్ కృష్ణ తెలిపారు. ప్రపంచ పోగాకు వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. పొగాకు వాడకంతో క్యాన్సర్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడతాయని వెల్లడించారు. వాటి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.

May 31, 2026 / 12:44 PM IST

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్

GNTR: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ 3న పీవీఎస్ లలితా ఆస్పత్రి ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను గుంటూరు నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదివారం పరిశీలించారు. హెలిప్యాడ్, పర్యటన మార్గం, ఆస్పత్రిలోని ప్రారంభోత్సవ ప్రాంగణం, సభా వేదిక తదితర ప్రాంతాలను తనిఖీ చేసి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.

May 31, 2026 / 12:34 PM IST

శ్రీవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

ELR: ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయానికి ఆదివారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. పలు క్యూ కాంప్లెక్స్‌లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో భక్తుల సౌకర్యార్థం మజ్జిగను , చిన్నపిల్లల కోసం పాలు దేవస్థానం అధికారులు పంపిణీ చేశారు. ఆదివారం అధిక సంఖ్యలో భక్తుల రావడంతో ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

May 31, 2026 / 12:30 PM IST

నూకాంబిక అమ్మవారి ఆలయంలో భక్తుల సందడి

అనకాపల్లి: అనకాపల్లి నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పలువురు ఆలయ ఆవరణలో వంటలు వండి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన అధికారులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఛైర్మన్ నాగశ్రీను పాల్గొన్నారు.

May 31, 2026 / 12:29 PM IST

నరసాపురం కాలువకు నీటి విడుదల..!

WG: నరసాపురం ప్రధాన కాలువలోకి ఆదివారం నీటిపారుదలశాఖ అధికారులు నీరు విడుదల చేశారు. వేసవిలో కాలువ పనుల నిమిత్తం నిలిపివేసిన నీటిని తిరిగి వదలడంతో ఖరీఫ్ సీజన్ పంటలకు సమృద్ధిగా సాగునీరు అందుతుందని డిఈఈ సిహెచ్. వెంకటనారాయణ తెలిపారు. అలాగే ఈ నీటి విడుదలతో పాలకొల్లులో గత కొన్ని రోజులుగా వేధిస్తున్న తాగునీటి సమస్య కూడా పూర్తిగా తీరుతుందని ఆయన పేర్కొన్నారు.

May 31, 2026 / 12:26 PM IST

SGS కళాశాల అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

NTR: జగ్గయ్యపేటఎస్‌జీఎస్ కళాశాలను ఆదివారం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ మున్సిపల్ ఛైర్మన్ రాఘవేంద్ర సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇటీవల ఈదురు గాలులు, వర్షాలతో జరిగిన నష్టాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, పూర్తి అంచనా నివేదికను కలెక్టర్‌కు పంపాలని ఎంఆర్ఓను ఆదేశించారు. ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని కళాశాల యాజమాన్యానికి హామీ ఇచ్చారు.

May 31, 2026 / 12:23 PM IST

నీళ్ల వాసన.. పట్టణ ప్రజలకు ఇబ్బందులు

KDP: నీళ్లు వాసన వస్తున్నాయని పులివెందుల పట్టణంలోని లక్ష్మీ హాల్ ఏరియా సరస్వతీ వీధికి చెందిన ప్రజలు ఆదివారం మున్సిపల్ కమిషనర్ ముని కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. నీళ్లు కూడా 3 రోజులకు ఒకసారి వస్తున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ తెలియజేశారు.మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

May 31, 2026 / 12:22 PM IST

రుచికి మారు పేరు అడవి తేనె

అల్లూరి: ఏజెన్సీ అడవుల్లో లభించే స్వచ్ఛమైన తేనెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కొండలు, లోయలు, అటవీ ప్రాంతాల్లో గిరిజనులు సంప్రదాయ పద్ధతుల్లో తేనెను సేకరిస్తున్నారు. ఔషధ గుణాలు, సహజ రుచితో ఈ తేనె వినియోగదారులను ఆకట్టుకుంటోంది. విక్రయ వేదికలు కల్పిస్తే గిరిజనులకు మరింత ఆదాయం లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

May 31, 2026 / 12:21 PM IST

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ లోని 18వ డివిజన్, హరినాధపురంలో ప్రజా బాట కార్యక్రమాన్ని ఆదివారం TDP పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నిర్వహించారు. స్థానిక సమస్యలను ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 18వ డివిజన్ అభివృద్ధికి 7.50 కోట్ల రూపాయల నిధులు కేటాయించామన్నారు. ఏ సమస్య ఉన్నా పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

May 31, 2026 / 12:20 PM IST

తూర్పు నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై సమీక్ష

GNTR: గుంటూరు నగరంలోని తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్, కోర్ క్లస్టర్ ఇన్‌ఛార్జులతో ముఖ్య సమావేశం నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయి కార్యక్రమాల అమలు తదితర అంశాలపై చర్చించారు.

May 31, 2026 / 12:15 PM IST

జిందాల్ ప్లాంట్‌ను పరిశీలించిన డిప్యూటీ సీఎం

PLD: కొండవీడులోని జిందాల్ ప్లాంట్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం పరిశీలించారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాష్ట్రాన్ని డంపింగ్ యార్డ్ రహితంగా మార్చాలన్నారు. కాలుష్య రహిత గోదావరి పుష్కరాల కోసం 268 పంచాయతీల్లో శిక్షణ ఇస్తామన్నారు. రాష్ట్రంలో కొత్తగా మరో 6 ప్లాంట్లు స్థాపిస్తామని పేర్కొన్నారు.

May 31, 2026 / 12:14 PM IST

నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు: ఎమ్మెల్యే

NTR: రూరల్ మండలం గొల్లపూడిలోని వాటర్ ఫిల్టర్ బెడ్‌ను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ఆదివారం పరిశీలించారు. గొల్లపూడి నుంచి జక్కంపూడి వద్ద నిర్మించిన టిడ్కో గృహాలకు సురక్షిత కృష్ణా జలాలను సరఫరవేసవిలో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిల్టర్ బెడ్‌ను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.

May 31, 2026 / 12:11 PM IST