CTR: చిత్తూరు జిల్లా పోలీసుల పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో 41 ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. భూ, డబ్బు, కుటుంబ తగాదాలు వంటి వివిధ సమస్యలు వచ్చాయి. ప్రతి ఫిర్యాదును చట్టప్రకారం విచారించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు న్యాయం చేయడం పోలీసుల ప్రధాన బాధ్యత అని ఎస్పీ తెలిపారు.
అన్నమయ్య జిల్లాలో నీటి కొరత నివారణకు జలధార–జలహారతి కార్యక్రమాన్ని 100 రోజుల మిషన్‌గా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రారంభించారు. కేసాపురం పరిధిలోని రెడ్డివారిపల్లి చెరువు వద్ద ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చిన్న చెరువుల పునరుద్ధరణ, ఫీడర్ ఛానళ్ల శుభ్రపరిచే పనులతో భూగర్భ జలాలు 5.6 మీటర్లు పెరిగాయని, తాగునీటి సమస్య 90% వరకు పరిష్కారమైందని కలెక్టర్ తెలిపారు.
E.G: రాజమండ్రిలో జరుగుతున్న గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులను రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా ఇతర అధికారులతో కలిసి ప్రతి పనిని క్షుణ్ణంగా సమీక్షించారు. పనుల వేగాన్ని మరింత పెంచి త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
AKP: చోడవరం మండలం జుత్తాడ గ్రామంలో పట్టాలమ్మ తల్లి పండుగ సందర్భంగా సోమవారం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీలను ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం బ్యాట్ పట్టుకుని క్రీడాకారులతో సరదాగా ఆడారు. పండుగల వేళ క్రీడా పోటీలు నిర్వహించడం ఆనందదాయకమని, యువత క్రీడలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
PPM: జిల్లాలో గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి అన్యాక్రాంతం, గంగునాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో తరతరాలుగా సాగు చేస్తున్న గిరిజనులకు పేదలకు పట్టాలు ఇవ్వడం లేదన్నారు.
VZM: చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా సీఎం చంద్రబాబు “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా ఈరోజు విజయనగరం మండలం ద్వారపూడి గ్రామంలో గల చెరువు వద్ద ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అదితి గజపతి రాజు ప్రారంభించారు. భూగర్భ జలాలను పెంచడం, చెరువులను పూడికతీసి నీటిని సంరక్షించడం ప్రధాన లక్ష్యమన్నారు.
GNTR: చేబ్రోలు వద్ద ప్రమాదం జరిగింది. చేబ్రోలు కాలువ వంతెన పైనుంచి వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకెళ్లింది. వంతెనపై వెళ్తున్న సమయంలో డ్రైవర్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. లారీ కాలువలో పడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ATP: గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో దాతల సహకారంతో జరుగుతున్న అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా కోనేరుతో పాటు ఆలయంలో స్వామివారి గర్భగుడి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆలయ ఈవో విజయ రాజు పేర్కొన్నారు. త్వరలోనే ఆలయ నిర్మాణ పనులు పూర్తవుతాయన్నారు.
కృష్ణా: పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం నూతన భవనాన్ని KDCC బ్యాంకు ఛైర్మన్ నెట్టెం రఘురామ్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘురామ్ మాట్లాడుతూ.. సహకార రంగం రైతులకు నిజమైన ఆర్థిక భరోసా కల్పించే బలమైన వేదికగా మారిందని తెలిపారు.
SKLM: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందనిజిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణు గోపాలం అన్నారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు జనతా వారధి అనే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ మేరకు జిల్లా జడ్పీ కార్యాలయం ఆవరణలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
AKP: సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు అనకాపల్లి పదవ తరగతి స్పాట్ కేంద్రం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి సోమవారం నిరసన తెలియజేశారు. ప్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. వెంటనే పీఆర్సీ ప్రకటించాలన్నారు. అప్పటివరకు మధ్యంతర భృతిని ఇవ్వాలన్నారు.
సత్యసాయి: అనంతపురం జేఎన్టీయూ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ తిరుగు ప్రయాణమయ్యారు. సోమవారం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు పూలబొక్కే అందజేసి వీడ్కోలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
CTR: పూతలపట్టు మండలం దిగువ పాలకురు గ్రామానికి చెందిన దాము అనే రైతు ఆవు ఒకేసారి రెండు మగ దూడలకు జన్మనిచ్చింది. ఈ ఘటన గ్రామంలో ఆసక్తిని రేకెత్తించింది. రెండు దూడలు ఆరోగ్యంగా ఉండటంతో రైతు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థులు కూడా ఈ దృశ్యాన్ని చూసేందుకు అక్కడికి చేరుకుంటున్నారు.
BPT: పర్చూరు సీఐ పరిధిలోని చెన్నుబొట్ల అగ్రహారం గ్రామంలో జూదం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఎస్ఐ తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురు జూదరులను పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.2,580 నగదు స్వాధీనం చేసుకున్నారు.
PLD: సత్తెనపల్లి పట్టణంలోని మెయిన్ రోడ్‌లో అయ్యప్ప స్వామి 16వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మి నారాయణ పాల్గొని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తి భావంతో నిర్వహిస్తున్న ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో సత్సంకల్పాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.