• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

విన్సెంట్ ఫెర్రర్‌కు ఎమ్మెల్యే ఘన నివాళి

ATP: ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ 106వ జయంతి వేడుకలు కళ్యాణదుర్గంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగుల అభ్యున్నతికి ఫెర్రర్ చేసిన సేవలను కొనియాడారు. కూటమి ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ చేయించిందని ఆయన తెలిపారు.

April 9, 2026 / 01:39 PM IST

సెన్సస్ పనిలో ఖచ్చితత్వం తప్పనిసరి: జేసీ

PPM: కురుపాం జిల్లా పరిషత్ పాఠశాలలో జరుగుతున్న సెన్సస్ శిక్షణ కార్యక్రమాన్ని గురువారం జాయింట్ కలెక్టర్ యస్వంత్ కుమార్ రెడ్డి సందర్శించారు. శిక్షణలో పాల్గొంటున్న సిబ్బందితో మాట్లాడి, సెన్సస్ ఖచ్చితత్వంతో, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, శిక్షణ విధానం, అమలుపై వివరాలు తెలుసుకున్నారు.

April 9, 2026 / 01:36 PM IST

ఆకలి లేని సమాజం నిర్మాణం మన అందరి బాధ్యత

TPT: ఆకలి లేని సమాజం నిర్మాణం మన అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పేర్కొనారు. అన్న క్యాంటీన్-ఆకలి లేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ముందడుగు అనే పోస్టర్‌ను జీఎస్‌డబ్ల్యూ‌ఎస్ కోఆర్డినేటర్ జగదీష్‌తో కలిసి విడుదల చేశారు. ఆయన ప్రజలను మొబైల్ ఫోన్ల ద్వారా క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ఈ సేవా కార్యక్రమంలో భాగస్వామ్యులుగా ఉండమని ఆహ్వానించారు.

April 9, 2026 / 01:36 PM IST

చిత్తూరులో మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు

CTR: మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చిత్తూరు జిల్లా ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్ నిత్యబాబు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..18 సంవత్సరాలు పూర్తి కాని పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తెలిపారు. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండి, పిల్లల భద్రతను ప్రధానంగా పరిగణించాలి అని ఆయన కోరారు.

April 9, 2026 / 01:32 PM IST

ఏబీఎన్ రాధాకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు

సత్యసాయి: ఏబీఎన్ రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ గురువారం పెనుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీకెండ్ కామెంట్ కార్యక్రమంలో వైఎస్ జగన్, పార్టీ కార్యకర్తలపై అత్యంత అవమానకర, అసత్య వ్యాఖ్యలు చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు.

April 9, 2026 / 01:30 PM IST

‘బ్రిడ్జిలపై ఫెన్సింగ్ పనులు తక్షణమే పూర్తి చేయాలి’

KDP: కడప నగరపాలక సంస్థ కమిషనర్ గురువారం నగరంలో పర్యటించారు. బుగ్గవంకలో ప్రజలు నేరుగా చెత్త వేయకుండా బ్రిడ్జిలపై ఫెన్సింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని పబ్లిక్ టాయిలెట్లను తనిఖీ చేసి, వాటి నిర్వహణ, పరిశుభ్రతను పరిశీలించారు. టాయిలెట్లను నిత్యం శుభ్రంగా ఉంచాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.

April 9, 2026 / 01:30 PM IST

ఎస్సీ హోదాపై తీర్పు పునఃసమీక్ష డిమాండ్

KRNL: దళితులు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుందన్న సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలని దళిత సంఘాల నాయకులు కేంద్రాన్ని ఇవాళ కోరారు. ఎమ్మిగనూరులో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఈ నిర్ణయం దళితుల హక్కులకు విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి దళితులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు.

April 9, 2026 / 01:30 PM IST

మిడుతూరులో రోడ్లు, డ్రైనేజీపై కలెక్టర్ పరిశీలన

NDL: మిడుతూరులో రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై గ్రామస్థుల విజ్ఞప్తితో కలెక్టర్ రాజకుమారి ఇవాళ ప్రాంతాలను పరిశీలించారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా పనులు చేపట్టి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడంలో నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులను ఆదేశించారు. సమస్యలను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు.

April 9, 2026 / 01:20 PM IST

యనమదుర్రులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

W.G: భీమవరం (M) యనమదుర్రులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ప్రవీణ్ కుమార్ రెడ్డి, కూటమి నేతలు పాల్గొన్నారు. రైతులు ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం ఎమ్మెల్యేను రైతులు వరి కంకులతో ఘనంగా సత్కరించారు.

April 9, 2026 / 01:20 PM IST

రేపు ప్రొద్దుటూరు మున్సిపల్ మార్కెట్ వేలం

KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ కూరగాయల మార్కెట్ వేలం శుక్రవారం నిర్వహిస్తున్నట్లు స్థానిక మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి గురువారం తెలిపారు. కూరగాయల మార్కెట్‌తో పాటు, మాంసం చేపల మార్కెట్, వాహనాల పార్కింగ్కు వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్కెట్ ఫీజుల పెంపుపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో సోమవారం నిర్వహించాల్సిన వేలం వాయిదా పడింది.

April 9, 2026 / 01:20 PM IST

‘కుక్క కాట్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

KRNL: ఎండాకాలంలో కుక్క కాట్ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆస్పరిలో డాక్టర్ బాలకృష్ణారెడ్డి సూచించారు. అధిక వేడి వల్ల కుక్కలు దాడి చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. కుక్క కరిచిన వెంటనే గాయాన్ని సబ్బు నీటితో శుభ్రంగా కడగాలని పేర్కొన్నారు. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆరోగ్య కేంద్రానికి వెళ్లి చికిత్స పొందాలన్నారు.

April 9, 2026 / 01:20 PM IST

వార్డుల విభజన ప్రక్రియ గడువు పెంపు

కోనసీమ: అమలాపురం మున్సిపాలిటీలో వార్డులు విభజన ప్రక్రియ గడువును ఏప్రిల్ 26 వరకు పెంచుతూ మున్సిపల్ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ.. మున్సిఫల్ సిబ్బంది జనగణన పనులలో బిజీగా ఉండటంతో జాప్యం జరిగినట్లు తెలిపారు. దీంతో వార్డులు పునర్విభజన పనులకు మరింత గడువు లభించినట్లయింది.

April 9, 2026 / 01:20 PM IST

సూర్యఘర్ పథకానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పెనుబర్తి గ్రామం చెర్ల ఎస్.టి. సంఘంలో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇంటిపైన సోలార్‌ను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని పేర్కొన్నారు. అర్హులై ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. 

April 9, 2026 / 01:15 PM IST

సంతబొమ్మాళిలోని షాపుల్లో ముమ్మర తనిఖీలు

SKLM: సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో గురువారం ముమ్మరంగా వివిధ రకాల షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి ఉమాపతి, ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రానికి చెందిన సూపర్‌వైజర్ సంపతిరావు మోహనరావులు బాటిల్స్‌పై ఉన్న గడువుతేదీలు, బ్యాచ్ నెంబర్లు పరిశీలించారు. శ్రీకాకుళం మండలంలో ఇటీవల ఎక్స్‌పైర్ అయిన బాదంమిల్క్ తాగి సుమారు 90 మంది డయేరియాకు గురయ్యారు.

April 9, 2026 / 01:15 PM IST

విజయవాడలో క్వాంటం హార్డ్‌వేర్ తయారీ కేంద్రం

ఎన్టీఆర్: విజయవాడ మేధా టవర్స్‌లో దేశంలోనే మొదటి క్వాంటం హార్డ్‌వేర్ టెస్ట్ బెడ్ల తయారీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14న సీఎం చంద్రబాబు ఆ కార్యకలాపాలను ప్రారంభించనుండగా.. ఈ క్వాంటం కంప్యూటర్‌ను క్యుబిటెక్ సంస్థ ఏర్పాటు చేస్తోంది. రానున్న రోజులలో క్వాంటం హార్డ్‌వేర్, పరిశోధనలకు ఈ టెస్ట్ బెడ్లు విస్తృతంగా ఉపయోగించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

April 9, 2026 / 01:11 PM IST