KDP: సిద్దవటం ప్రోహిబిషన్ & ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్దవటం, అట్లూరు, ఒంటిమిట్ట మండలాల్లో బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయిస్తే కఠినమైన చర్యలు తప్పవని ఎక్సైజ్ సీఐ రాజశేఖర్ హెచ్చరించారు. సోమవారం సాయంత్రం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అట్లూరు, సిద్దవటం, ఒంటిమిట్ట మండలాల్లో గంజాయి ఇతర మాదక ద్రవ్యాలు బెల్ట్ షాపులు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఆయన తెలిపారు.
BPT: ఈ నెల 9న సీఎం సూరేపల్లి రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జైభీమ్ రావ్ భారత్ పార్టీ నేత రమేష్ రాంజీ ఓ లేఖ విడుదల చేశారు. రేపల్లె డివిజన్ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఓలేరు వద్ద చెక్ డ్యాం నిర్మించాలన్నారు. జంపనిలో పారిశ్రామికవాడ, రేపల్లెలో పీజీ సెంటర్, ఆటోనగర్ ఏర్పాటు చేయాలన్నారు. భట్టిప్రోలు బౌద్ధ క్షేత్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
VZM: మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నెల్లిమర్ల MLA లోకం నాగ మాధవి పేర్కొన్నారు. సోమవారం ముక్కాం పంచాయితీలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత ట్రాన్స్పాండర్లను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ… PM మోదీ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (PMMSY ) పథకం మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతోందని కొనియాడారు.
SKLM: నిర్దేశిత గడువులోగా నీటి సంరక్షణ పనులు పూర్తి చేయాలి అని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సోమవారం సాయంత్రం అధికారులను ఆదేశించారు. జిల్లాలో భూగర్భ జల మట్టాలను పెంపొందించడమే లక్ష్యంగా చేపట్టిన ‘జలధార – జలహారతి’ పనులను 100 రోజుల్లోగా పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలోని కాలువలు, చెరువులలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
KDP: వేంపల్లి బైపాస్ రోడ్డులో మోటారు సైకిల్ కాలిపోయిన ఘటనపై CI నరసింహులు క్లారిటీ ఇచ్చారు. ఇందులో ఎటువంటి ప్రమేయం లేదనన్నారు. ఆదివారం రాత్రి MM ఫంక్షన్ హాల్ వద్ద పెళ్లికి వచ్చిన కమాల్ బాష తన పల్సర్ బైక్‌ను స్నేహితుడు మహమ్మద్‌కు ఇచ్చాడు. బైకును వేగంగా నడపడం వల్ల NTR సర్కిల్ వద్ద స్కీడ్ అయి కిందపడింది. ట్యాంక్ నుంచి పెట్రోల్ లీకై, మంటలు చెలరేగి దగ్ధమైందన్నారు.
BPT: మంత్రి లోకేష్‌ను బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి, సూర్యలంక పర్యాటకంపై ఆయనకు వివరించారు. అక్కడ పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని లోకేష్ అభినందించారు. సంక్షేమ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బాపట్ల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని లోకేష్ భరోసా ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల మెగా కల్చరల్ ఫెస్ట్‌లో ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తండ్రి చదువుకున్న ఇదే వేదికపై నిలబడటం ఎంతో భావోద్వేగాన్ని కలిగిస్తోందని, ఈ కార్యక్రమంలో పాల్గొనడమే తనకు దక్కిన పెద్ద పురస్కారమని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ పాల్గొన్నారు.
CTR: ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దని జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ సూచించారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో సోమవారం ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలతో అధికారులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రతి అర్జీని తప్పక పరిష్కరించాలని చెప్పారు.
ATP: అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్పర్సన్ బల్లా పల్లవి మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. మార్కెట్ యార్డ్‌లో రైతులు, వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యార్డ్‌ను ఆధునీకరించి రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని పల్లవి వివరించారు. అనంతరం స్థానిక రాజకీయాలపై చర్చించారు.
సత్యసాయి: జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో సోమందేపల్లి-పెనుగొండ మధ్య బైక్ రేసింగ్ నిర్వహించిన యువకులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై సుధాకర్ యాదవ్ తెలిపారు. సరదా కోసం చేసే పనులు ప్రాణాల మీదకు తెస్తాయని, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ASR: జిల్లా అభివృద్ధికి అధికారుల కోఆర్డినేషన్, కోఆపరేషన్ తప్పనిసరని జిల్లా కలెక్టర్ టీ.నిశాంతి సోమవారం కలెక్టరేట్లో పేర్కొన్నారు. జిల్లాలో చేపడుతున్న ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందాలంటే జిల్లాలోని అన్ని శాఖల అధికారుల మధ్య పూర్తిస్థాయి సమన్వయం, సహకారం ఉండాలన్నారు. అధికారులకు శాఖపరమైన అవగాహన ఉంటే వారు చేపట్టే పనులు సులభతరం అవుతాయన్నారు.
VZM: బొండపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై యూ. మహేష్ సోమవారం ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని వాహనదారులకు సూచించారు. డ్రైవింగ్ సమయంలో వాహనపత్రాలు వెంట ఉండాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని కోరారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.
SKLM: జిల్లాలో మరో రెండు రోజులు విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ MD ప్రఖర్ జైన్ సోమవారం ప్రకటనలో తెలిపారు. ఇవాళ, రేపు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, ఎండ తీవ్రత చూపే అవకాశం ఉందన్నారు తెలిపారు. నిన్న ఎచ్చెర్లలో 52.5 మిమీ అధిక వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు
AKP: ఎలమంచిలి మండలంలో 17 పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఎంపీడీవో కొండలరావు సోమవారం తెలిపారు. మూడు నుంచి నాలుగు పంచాయతీలకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రత్యేక అధికారులుగా నియమించిన వారిలో తనతో పాటు, తహసీల్దార్ కె. వరహాలు, డిప్యూటీ ఎంపీడీవోలు అనంతనాగ్, వి.దీపిక, మోహన్ రావు ఉన్నట్లు పేర్కొన్నారు.
GNTR: తెనాలి మహిళా మండలి భవన్లో మెప్మా ఆఫీసులో నిన్న స్లమ్ సమాఖ్య మహిళలకు హోమ్ కంపోస్ట్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామా అప్పలనాయుడు పాల్గొన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని సూచించారు. తడి చెత్తతో ఎరువు తయారు చేసుకుని మొక్కలకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. హోమ్ కంపోస్ట్ ద్వారా చెత్త తగ్గించి పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు.