PLD: జిల్లాలో ప్రతి అర్హుడైన రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ శాఖలు, బ్యాంకర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులకు ఆర్థికంగా బలం చేకూర్చే లక్ష్యంతో కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని విస్తృతంగా అమలు చేయాలని పేర్కొన్నారు.
ATP: నార్పల మండలం మడుగుపల్లి క్రాస్ నుంచి గూగూడు వరకు గల 4 కిలోమీటర్ల పంచాయతీ రోడ్డును బాగుచేయాలని వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్య దర్శి కుళ్లాయప్ప కోరారు. ఈ మేరకు ఎంపీడీవో మమత దేవికి వినతి పత్రం ఇచ్చారు. గూగూడు కుల్లాయిస్వామి దర్శనానికి నిత్యం వేలాదిగా భక్తులు వస్తుంటారని, భక్తుల సౌకర్యార్థం నూతన రోడ్డు వేయాలని విన్నవించారు.
ELR: దెందులూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కార్యాలయంలో పలువురు నేతలతో హోంమంత్రి అనిత భేటీ అయ్యారు. నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై వారితో సమీక్షించారు. నియోజవర్గంలో పార్టీకి అంకితభావంతో పనిచేసే నేతలు ఉండడం ఎంతో గర్వకారణం అని అన్నారు. ఇదే స్ఫూర్తితో పంచాయతీ , ఎన్నికలలో గెలుపు కోసం పరిచేయాలన్నారు.
CTR: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు సమిష్టి కృషితో పాటు.. అవగాహన కల్పించాలని కోరారు.
KDP: మైదుకూరు విద్యుత్ కార్యాలయంలో ఎస్ఈ శ్రీనివాసులు అధ్యక్షతన గురువారం సమీక్షా సమావేశం జరిగింది. పీఎం సూర్యఘర్ కింద ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై చేపట్టిన సోలార్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వేసవిలో కరెంట్ కోతలు లేకుండా చూడాలని, పగటిపూట వీధిలైట్లు వెలగకుండా నివారించాలని, గ్రామాల్లో విద్యుత్ భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు.
అన్నమయ్య: శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏసియన్ అండ్ పసిఫిక్ స్టడీస్ (సీప్) స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయచోటికి చెందిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డైట్ ఇన్చార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి, మోటకట్ల హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పద్మజలు ఏప్రిల్ 6 నుంచి 8 వరకు జరిగిన అంతర్జాతీయ సెమినార్లో హాజరయ్యారు.
సత్యసాయి: గుడిబండ మండలంలలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఆనంద్ కుమార్ పర్యటించారు. మండలంలోని చిగాతుర్పి గ్రామంలో జరుగుతున్న రీ సర్వేను రైతుల సమక్షంలో పరిశీలించారు. అనంతరం సర్వేయర్లతో మాట్లాడుతూ.. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా సర్వే చేయాలన్నారు. రైతులకు రీసర్వే గురించి వివరించారు.
ATP: శింగనమలలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని, కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.
W.G: రెవెన్యూ, పౌరసరఫరాలు, రవాణా, కోఆపరేటివ్ శాఖల అధికారులతో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై గురువారం జిల్లా జేసీ రాహుల్ కుమార్ గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్, మే నెలలు రబీ సీజన్‌కు కీలకమని ఈ కాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి కేంద్రంలో కనీసం 50 శాతం గోనె సంచులు సిద్ధం చేయాలని కోరారు.
KRNL: వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల్లో బాల్య వివాహాలు, కౌమార గర్భాల నివారణ కోసం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఇవాళ “బాల్య వివాహ విముక్తి ప్రచార రథం” కార్యక్రమం నిర్వహించారు. కళాజాత బృందాలు పాటలు, నాటికల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాయి. ICDS పద్మావతి, సరస్వతి పలువురు “బేటీ బచావో – బేటీ పడావో” సందేశంతో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.
CTR: న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో తమవంతు సహకారం ఉంటుందని రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ ఉప్పలపాటి శ్రీనివాసరాజు పేర్కొన్నారు. గురువారం ఆయన పుంగనూరుకు రాగా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. స్థానికంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
GNTR: తెనాలి మండలంలో జనాభా గణనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మార్వో గోపాలకృష్ణ తెలిపారు. మే 1–30 వరకు హౌస్ లిస్టింగ్, ఏప్రిల్ 16–30 వరకు స్వచ్ఛంద నమోదు అవకాశం కల్పించారు. జనాభా గణనకు ప్రజలు భయపడకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ELR: ఏలూరులో గిలకల గేటు రైల్వే ట్రాక్‌పై గురువారం ఉదయం ఓ డెడ్ బాడీ కలకలం రేపింది. డ్యూటీలో ఉన్న ట్రాక్ మ్యాన్ రెండు ముక్కలైన మృతదేహాన్ని చూసి రైల్వే జీఆర్పీ ఎస్సైకు సమాచారం ఇచ్చారు. ఎస్సై దానం ఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీని పరిశీలించి ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని మృతి చెందవచ్చునన్నారు. మృతుడికి 65 ఏళ్లు ఉండవచ్చునని పేర్కొన్నారు.
PLD: సత్తెనపల్లి పట్టణ డంపింగ్ యార్డును స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. యార్డులోని 19 వేల టన్నుల చెత్తను తొలగించి, ఆ ప్రాంతాన్ని ఆహ్లాదకరమైన పార్కుగా మారుస్తామని ప్రకటించారు. మురుగునీటి శుద్ధి కోసం ప్రత్యేక ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, ముంపు ప్రాంతాల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
NLR: కావలికి చెందిన దరిశి వెంకట సత్య ధనుష, ఇటీవల జూనియర్ సివిల్ న్యాయాధికారిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమె గురువారం నెల్లూరు జిల్లా కోర్టు ప్రాంగణంలోని తన కార్యాలయంలో గౌరవ జిల్లా జడ్జి శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జడ్జి శ్రీనివాస్ మాట్లాడుతూ.. న్యాయ రంగం పట్ల నేటి యువత ఆసక్తి చూపడం అభినందనీయమని అన్నారు.