• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వేసవి శిక్షణ తరగతులు.. ఇంగ్లీష్‌పై అవగాహన

NTR: తిరువూరు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉచిత వేసవి శిక్షణ తరగతులలో భాగంగా ఇంగ్లీష్‌పై ఉపాధ్యాయుడు రాంప్రదీప్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు నిత్య జీవితంలో వివిధ సందర్భాలలో ఎదురయ్యే పరిస్థితులను తీసుకుని వాటిని ఆంగ్లంలో ఏ విధంగా ఉపయోగించాలి. ఆంగ్లంలో మాట్లాడేటప్పుడు సహజంగా చేసే కొన్ని పొరపాట్లు మొదలైన వాటి గురించి వివరించారు.

April 29, 2026 / 06:50 PM IST

‘జూన్ నాటికి కునుతూరు లేఅవుట్ పనులు పూర్తి చేయాలి’

ATP: ధర్మవరం మండలం కునుతూరు అహుడా లేఅవుట్‌లో అభివృద్ధి పనులను జూన్ నాటికి పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన లేఅవుట్‌ను సందర్శించి రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులను తనిఖీ చేశారు. నాణ్యతతో కూడిన పనులను వేగవంతం చేయాలని, గడువులోగా లేఅవుట్‌ను సిద్ధం చేయాలని సూచించారు.

April 29, 2026 / 06:44 PM IST

ఎస్టీ కాలనీ రోడ్డు నిర్మాణానికి రూ.80 లక్షలు మంజూరు

CTR: విజయపురం(M) శ్రీహరిపురం ఎస్టీ కాలనీలో రోడ్డు నిర్మాణానికి నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ రూ.80 లక్షలు మంజూరు చేయించారు. దశాబ్దాలుగా సరైన రహదారి లేక ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసుల కష్టాలు దీనితో తీరనున్నాయి. ప్రస్తుతం రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తమ చిరకాల వాంఛను నెరవేర్చినందుకు కాలనీ వాసులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

April 29, 2026 / 06:43 PM IST

వరకట్నంపై అవగాహన కార్యక్రమం

VSP: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో “వరకట్న నిషేధ చట్టం-1961”పై అవగాహన కార్యక్రమం పెందుర్తిలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీఏ సన్యాసినాయుడు వరకట్నం తీసుకోవడం, ఇవ్వడం నేరమని తెలిపారు. నేరస్తులకు జైలు శిక్షలు, జరిమానాలు ఉంటాయని హెచ్చరించారు. మహిళలు భయపడకుండా ఫిర్యాదు చేయాలని, 1098 వంటి హెల్ప్‌లైన్‌లను వినియోగించుకోవాలని సూచించారు.

April 29, 2026 / 06:41 PM IST

విలేఖరి హత్యకు నిరసన.. ఎస్పీకి వినతి

NDL: విలేఖరి జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసిస్తూ జిల్లా APUWJ నేతలు ఎస్పీ సునీల్ శేరాన్‌కు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర కార్యదర్శి సభ్యులు శ్యాంసుందర్, జిల్లా అధ్యక్షుడు మధుబాబు నేతృత్వంలో ఎస్పీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విలేకరుల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు.

April 29, 2026 / 06:39 PM IST

ప్రజలతో కలెక్టర్ చర్చ

TPT: తొట్టంబేడు(M) చోడవరంలో నిర్వహించిన రీసర్వే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పాల్గొన్నారు. భూ సర్వే ప్రక్రియను పర్యవేక్షించి, సమస్యలపై గ్రామస్థులతో నేరుగా మాట్లాడారు. భూ రికార్డుల పారదర్శకత కోసమే ఈ ప్రక్రియ అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ ఆర్. గోవిందరావుతో పాటు రెవెన్యూ, సర్వే శాఖ అధికారులు పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.

April 29, 2026 / 06:37 PM IST

విషాదం.. ఉరేసుకుని దంపతులు ఆత్మహత్య

BPT: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వేటపాలెం మండలం రావూరిపేటకు చెందిన దంపతులు మాజేటి ప్రభాకర్(33)-పార్వతి(24) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

April 29, 2026 / 06:31 PM IST

డీజిల్ నిల్వలపై ఆందోళన అక్కర్లేదు: కలెక్టర్

కోనసీమ: జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన అవసరం లేదని కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఆయిల్ కంపెనీల సేల్స్ అధికారులు, తహసీల్దార్లు, పౌరసరఫరాల డీటీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి డీజిల్ సరఫరా స్థితిగతులను సమీక్షించారు. జిల్లాకు రోజువారీ డీజిల్ తీసుకొచ్చే లారీల సంఖ్య పెరగడంతో విక్రయాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయన్నారు.

April 29, 2026 / 06:30 PM IST

బ్రహ్మరథోత్సవంలో పాల్గొన్న మంత్రి

సత్యసాయి: ధర్మవరం పట్టణంలో వైభవంగా జరిగిన శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మరథోత్సవంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. రథోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు భారీగా తరలివచ్చి రథాన్ని లాగుతుండగా మంత్రి వారితో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.

April 29, 2026 / 06:30 PM IST

గాలివీడులో జలధార పనులు జోరుగా

అన్నమయ్య: గాలివీడు మండలంలో ‘జలధార-జలహారతి’ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన కాలువలు, చెరువుల పునరుద్ధరణ పనులతో వర్షపు నీటి సంరక్షణకు తోడు సాగునీటి లభ్యత పెరుగుతోంది. రూ.5 లక్షల వ్యయంతో చేపట్టిన ఫీడర్ కాలువ పనుల ద్వారా సుమారు 210 ఎకరాలకు నీరు అందనుంది. ఈ కార్యక్రమం గ్రామీణ ఉపాధిని పెంచుతూ రైతులకు ఆశాజ్యోతి‌గా నిలుస్తోంది.

April 29, 2026 / 06:28 PM IST

‘ప్రమాదాలు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి’

AKP: జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న తీవ్రమైన ఎండలు వడగాల్పులు నేపథ్యంలో పారిశ్రామిక ప్రమాదాలను అరికట్టేందుకు, కార్మికుల భద్రతను కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో పరిశ్రమల భద్రత ప్రమాణాలపై పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలలో భద్రత తనిఖీలు నిర్వహించాలన్నారు.

April 29, 2026 / 06:27 PM IST

మే 3న ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం: ఎమ్మెల్యే

W.G: ఆలయ పునర్నిర్మాణంపై దాఖలైన పిటిషన్ కొట్టివేయడంతో మే 3న ఉదయం 7:14 గంటలకు ఆకివీడులో పనులు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తెలిపారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. ఏడు నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. భక్తుల సహకారంతో వచ్చే శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

April 29, 2026 / 06:27 PM IST

అవినీతిపై చర్చకు సిద్ధమా?

PLD: మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి కాన్వాయ్‌పై దాడిని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కారంపూడిలో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో అలజడులు సృష్టించేందుకే పిన్నెల్లి సోదరులు ఈ కుట్ర పన్నారని మండిపడ్డారు. అభివృద్ధిని ఓర్వలేకనే ఇలా చేస్తున్నారన్నారు. గత వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

April 29, 2026 / 06:26 PM IST

మంత్రి లోకేష్‌తో ఎమ్మెల్యే మర్యాదపూర్వక భేటీ

E.G: మంగళగిరిలో నారా లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోకేష్ యువ నాయకత్వానికి ప్రతీకగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని, జాతీయ స్థాయిలో పార్టీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.

April 29, 2026 / 06:20 PM IST

మొక్కలు నాటిన జనసేన పట్టణ అధ్యక్షుడు

కృష్ణా: గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణలో జనసేన పట్టణ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు బుధవారం మొక్కలను నాటారు. ఆసుపత్రి పరిసరాలను పచ్చదనంతో నింపేందుకు మొక్కలు నాటడం ఎంతో అవసరమని అన్నారు. పచ్చని వాతావరణం ప్రజల ఆరోగ్యానికి మేలు చేస్తుందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జనసేన నేతలు పాల్గొన్నారు.

April 29, 2026 / 06:19 PM IST