• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘తాగునీటి కుళాయిలకు మోటార్లు పెడితే చర్యలు’

SKLM: ఆమదాలవలస పురపాలకసంఘం పరిధిలోని 23 వార్డుల్లో ఇళ్ల ఇచ్చిన కుళాయిలకు మోటార్లు బిగిస్తే చర్యలు తీసుకుంటామని మునిసిపల్ కమిషనర్ తమ్మినేని రవి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేసవి దృష్ట్యా పట్టణ ప్రజలకు తాగునీరు సరఫరా చేయడంలో అంతరాయం ఏర్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. మోటార్లు తొలగించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 29, 2026 / 07:43 AM IST

రోడ్ల మరమ్మతులకు నిధులు విడుదల: మంత్రి

NDL: రాష్ట్రంలో గ్రామీణ రహదారులు, వంతెనల నిర్మాణాలు, మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.1,085 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు వేర్వేరు జీవోలు జారీ చేశామన్నారు. పనులు సకాలంలో పూర్తిచేయడానికి నాలుగు క్వార్టర్ల నిధులను ఒకేసారి కేటాయించామని, ప్రణాళిక ప్రకారం విభాగాధిపతులు నిధులను సమర్థవంతంగా వినియోగించాలన్నారు.

April 29, 2026 / 07:43 AM IST

అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు: ఎమ్మెల్యే

W.G: వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోని మాజీ సీఎం జగన్ ఇప్పుడు పెట్రోలు, డీజిల్ కొరత ఏర్పడిందంటూ నానా యాగీ చేయడం ఎంతవరకు సమంజసం అని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రశ్నించారు. మంగళవారం తణుకులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆయిల్ కంపెనీలతో నిత్యం సమీక్ష చేస్తూ కొరతను అధిగమించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

April 29, 2026 / 07:43 AM IST

పెట్రోల్ బంకును తనిఖీ చేసిన తహసీల్దార్

VSM: పెట్రోల్, డీజిల్ సంక్షోభం నేపథ్యంలో కొత్తవలస మండల తహసీల్దార్ రమాలక్ష్మీ, డి.టీ చిరంజీవి సంయుక్తంగా అరకు విశాఖ ప్రధాన రహదారిలో ఉన్న పెట్రోల్ బంకును మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా నిల్వల రిజిస్ట్రార్ ను తనిఖీ చేశారు. వాహనదారులకు మాత్రమే పెట్రోలో వేయాలని, డబ్బాలు, బాటిల్స్ వేయకూడదని నిర్వాహకులకు సూచించారు.ఆమె వెంట ఆర్. ఐ షణ్ముఖరావు ఉన్నారు.

April 29, 2026 / 07:40 AM IST

‘డీజిల్ కొరతపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు’

PLD: కారంపూడి మండలంలో డీజిల్ కొరత ఉందన్న ప్రచారం అసత్యమని తహసీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్ స్పష్టం చేశారు. మంగళవారం మండలంలోని ఆరు పెట్రోల్ బంకులను ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి తదితరులతో కలిసి పరిశీలించారు. సరఫరా సజావుగా కొనసాగుతోందని తెలిపారు. పెద్ద వాహనాలకు రూ. 2వేలు, ద్విచక్ర వాహనాలకు రూ. 200 మేర ఇంధనం అందించాలని ఆదేశించారు.

April 29, 2026 / 07:39 AM IST

వృద్ధురాలిని బెదిరించి బంగారు గొలుసు అపహరణ

కడప రిమ్స్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒంటరిగా వెళ్తున్న వృద్ధురాలిని ఓ దండగుడు బెదిరించి ఆమె మెడలోని ఆరు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కడప రామాంజనేయపురానికి చెందిన లక్ష్మీదేవి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.

April 29, 2026 / 07:32 AM IST

వచ్చే నెల ఒకటి నుంచి క్రీడల్లో శిక్షణ శిబిరం

AKP: అచ్యుతాపురం మండలం భోగాపురంలో మే1వ తేదీ నుంచి రగ్బీ, హ్యాండ్ బాల్ క్రీడల్లో వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు కోచ్ నాగ వెంకట్రావు మంగళవారం తెలిపారు. వీఆర్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణ శిబిరం ఉదయం 5:30 గంటల నుంచి ఉదయం ఏడున్నర గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

April 29, 2026 / 07:30 AM IST

బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ సవరణ

KRNL: విభిన్న ప్రతిభావంతులు బ్యాక్ లాగ్ ఉద్యోగాల ప్రకటనను సవరించినట్లు జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రూయిస్ ఫాతిమా ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 18న జారీ చేసిన ప్రకటన ప్రకారం బధిరుల కేటగిరిలో 55 శాతం పైగా వికలత్వం ఉన్నవారే అర్హులని పేర్కొన్నారు. తాజాగా రెండు చెవుల్లో 60- 70 DB శబ్దలోపం ఉన్నవారే అర్హులని ఆమె స్పష్టం చేశారు.

April 29, 2026 / 07:26 AM IST

డెల్టా ప్రతినిధితో మంత్రి లోకేష్‌ భేటీ

VSP: రాష్ట్ర మంత్రి లోకేష్ విశాఖ‌లో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రెసిడెంట్ బెంజిమన్ లిన్‌తో మంగళవారం రాత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖలో సంస్థ ఇన్నోవేషన్, ఆర్&డీ కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

April 29, 2026 / 07:21 AM IST

‘పి. ఎన్. డి. టీ చట్టం మరింత పటిష్ఠం చేయాలి’

PPM: జిల్లాలో పీఎన్‌డీటీ చట్టం అమలును మరింత పటిష్టంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన పీసీ, పీ.ఎన్. డిటీ చట్టంపై సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 44 స్కానింగ్ సెంటర్లు ఉండగా, అందులో 8 సెంటర్లు పని చేయడం లేదన్నారు.డి.ఎం.హెచ్.ఓ,పాల్గొన్నారు.

April 29, 2026 / 07:17 AM IST

రేపు జిల్లాలో ఉద్యోగ మేళా

కడప నగరంలోని కోటిరెడ్డి SKR ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సలీంబాషా తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల్లో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న, పూర్తిచేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

April 29, 2026 / 07:13 AM IST

ఘనంగా అన్నమయ్య ఉత్సవాలు

అన్నమయ్య: తాళ్లపాక అన్న మాచార్యుల జయంతి ఉత్సవాలను మే 2 నుంచి 8వ తేదీ వరకు తితిదే ఆధ్వర్యంలో తాళ్లపాక, బోయనపల్లి అన్నమయ్య విగ్రహం వద్ద నిర్వహిస్తున్నట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ బాలాజీ మంగళవారం తెలిపారు. మే 2న అన్నమాచార్య ప్రాజెక్ట్‌కు కళాకారులచే సప్తగిరి సంకీర్తన గోస్టి గానం, శ్రీవారి కల్యాణం, ఊంజల్ సేవ, సంగీత కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు.

April 29, 2026 / 07:12 AM IST

మామిడి రైతుపై యుద్ధ ప్రభావం

CTR: యుద్ధంతో చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో సుమారు రూ. 1.50 లక్షల ఎకరాల్లో మామిడి సాగులో ఉంది. ఏటా రూ. 2.50 లక్షల మెట్రిక్ టన్నుల గుజ్జును పల్ప్ ఫ్యాక్టరీలు తయారు చేస్తాయి. దీంట్లో అధిక శాతం గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తారు. యుద్ధంతో తాత్కాలికంగా ఆగిన ఆర్డర్లు రాకపోవడంతో ఫ్యాక్టరీలో యజమానులు అయోమయంలో ఉన్నారు.

April 29, 2026 / 07:12 AM IST

నేడు కీలక బాధ్యతలు చేపట్టనున్న మంత్రి

NDL: టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా బుధవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఆయన మరో కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. నిన్నటితో సింగపూర్ పర్యటన ముగించుకుని మంత్రి బీసీ రాష్ట్రానికి చేరుకున్న విషయం తెలిసిందే.

April 29, 2026 / 07:12 AM IST

దేశంలో పెట్టుబడులు ఏపీకే వస్తున్నాయి: మంత్రి

KRNL: దేశానికి వచ్చే పెట్టుబడుల్లో సుమారు 25 శాతం ఏపీకే వస్తున్నాయని మంగళవారం మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ‘బస్సు వరల్డ్ ఇండియా కాంక్లేవ్-2026’ లో ఆయన ప్రసంగించారు. CM చంద్రబాబుపై ఉన్న నమ్మకమే ఈ పెట్టుబడులకు కారణమని పేర్కొన్నారు. ఏపీ ఈవీ పాలసీ 4.0 పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షిస్తోందని, అభివృద్ధిలో రాష్ట్ర దూసుకుపోతుందన్నారు.

April 29, 2026 / 07:11 AM IST