• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నీటి భద్రతపై రైతులకు అవగాహన కార్యక్రమం

KRNL: ఏపీ ప్రభుత్వం చేపట్టిన ‘నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంపై పెద్దకడబూరు మండలంలోని జాలవాడి గ్రామంలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇరిగేషన్ శాఖ జేఈ సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘం అధ్యక్షుడు సత్యన్న గౌడ్, టీడీపీ నాయకులు ముక్కన్న, మునెప్ప, గ్రామ అధ్యక్షుడు బోయ యంకన్న తదితరులు పాల్గొన్నారు.

April 7, 2026 / 07:42 PM IST

జేసీబీ గుంతలో పడి చిన్నారి మృతి

TPT: ఏర్పేడు మండలం చిందేపల్లి ఎస్టీ కాలనీ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. తోటి పిల్లలతో ఆడుకుంటూ కాలుజారి చెరువులోని జేసీబీ గుంతలో పడి ఎండ్ల సుస్మిత(6) మృతి చెందింది. సమాచారం అందుకున్న స్థానికులు మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

April 7, 2026 / 07:42 PM IST

ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడిని ఖండించిన ఎమ్మెల్యే

VZM: హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ శ్రేణులు చేసిన దాడిని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన తీవ్రంగా ఖండించారు. అమరావతిపై వారి అధినాయకుని నిర్ణయాన్ని ఎత్తిచూపినందుకు మీడియాపై వైసీపీ దాడి చేయడం సబబు కాదని హితవు పలికారు. ఆంధ్రజ్యోతికథనంపై అభ్యంతరం ఉంటే ఖండన ఇవ్వాలి తప్ప, ఇలా భౌతిక దాడులు సరికాదన్నారు.

April 7, 2026 / 07:35 PM IST

SPMVV విద్యార్థిని జ్యోతికి డాక్టరేట్

TPT: SPMVV పరిశోధన విద్యార్థిని పీ.జ్యోతికి డాక్టరేట్ ప్రదానం చేసినట్లు విశ్వవిద్యాలయం తెలిపింది. ఎస్. జోష్న రాణి మార్గదర్శకత్వంలో, టైప్-2 మధుమేహం ఉన్న ప్రీమెనోపాజల్, పోస్టుమెనోపాజల్ మహిళల్లో నిద్ర సమస్యలపై ఆమె పరిశోధన చేశారు. ఆమెకు డాక్టరేట్ లభించడంతో పలువురు అభినందనలు తెలిపారు.

April 7, 2026 / 07:34 PM IST

మాజీ సీఎంతో వైసీపీ నేతలు భేటీ

KDP: జమ్మలమడుగులో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై మాజీ సీఎం YS జగన్‌తో వైసీపీ నేతలు చర్చించారు. మంగళవారం తాడేపల్లిలోని YS జగన్ స్వగృహం నందు మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షుడు వల్లంబాయి హృషికేశవ రెడ్డి, సీనియర్ నాయకులు సింగంరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మోహన్ రెడ్డి కలిశారు. వైసీపీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని జగన్ సూచించినట్లు హృషికేశవ రెడ్డి తెలిపారు.

April 7, 2026 / 07:29 PM IST

‘ఇళ్లు ఖాళీగా ఉంచేటప్పుడు భద్రతా చర్యలు తప్పనిసరి’

అన్నమయ్య: వేసవి సెలవుల్లో ఇళ్లు ఖాళీగా ఉంచేటప్పుడు భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సూచించారు. సోషల్ మీడియాలో పర్యటన వివరాలు పంచుకోవద్దని హెచ్చరించారు. పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా ఉంచాలని, చెరువులు, బావులు వంటి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

April 7, 2026 / 07:27 PM IST

‘ రైతులకు సాంకేతిక సమస్యలు శాపంగా మారాయి’

W.G: సాంకేతిక సమస్యలు రైతుల పాలిట శాపంగా మారాయని రైతు నాయకుడు కూనపరెడ్డి రంగారావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నరసాపురంలో ఆయన మాట్లాడుతూ.. ఈ- పాస్ పుస్తకాలు అందక రైతులు సచివాలయాలు, మీసేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదన్నారు. సైట్ ఓపెన్ కావడం లేదనే సాకుతో సిబ్బంది కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.

April 7, 2026 / 07:25 PM IST

‘ప్రతి ఒక్కరూ హెల్మెట్ విధిగా ధరించాలి’

ELR: రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా భీమడోలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నేషనల్ హైవే 216 A పై హెల్మెట్లు లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. 30 మంది వాహనదారులతో హెల్మెట్లు కొనుగోళు చేయించారు. ప్రయాణంలో హెల్మెట్ ధరిస్తే ప్రమాదం సమయంలో కాపాడుతున్నారు.

April 7, 2026 / 07:22 PM IST

డైరీ యూనిట్‌తో మహిళ ఆర్థికాభివృద్ధి: కలెక్టర్

సత్యసాయి: గుడిబండ మండలం కరికెర గ్రామంలో లక్ష్మమ్మ నిర్వహిస్తున్న డైరీ యూనిట్‌ను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మంగళవారం సందర్శించారు. డైరీ ద్వారా రోజుకు 30 లీటర్ల పాలు విక్రయిస్తూ… నెలకు రూ. 50 వేల ఆదాయం పొందుతున్నట్లు లక్ష్మమ్మ వివరించారు. మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో రాణించడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు.

April 7, 2026 / 07:20 PM IST

జగన్ ప్రతిపాదనపై ప్రజలు నవ్వుకుంటున్నారు: మంత్రి

KRNL: మాజీ సీఎం జగన్‌పై మంగళవారం మంత్రి సవిత సెటైర్లు వేశారు. జగన్ ‘మావిగన్’ ప్రతిపాదనపై ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. అంబులెన్స్‌కే సైడ్ ఇవ్వని జగన్ ప్రజలకు ఏం సందేశం ఇస్తారు..? అని ప్రశ్నించారు. పూటకో మాట.. గంటకో వేషం వేయడం జగన్ నైజం అని మండిపడ్డారు. లోటస్ పాండ్‌ను కూడా రాజధాని అంటారేమో అని ఎద్దేవా చేశారు.

April 7, 2026 / 07:18 PM IST

వైసీపీ నేత మృతి

ASR: డుంబ్రిగూడ మండలం కితలంగి పంచాయతీ పాడి గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు వయబారికి రౌతు అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య హుటాహుటిన గ్రామానికి చేరుకుని పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

April 7, 2026 / 07:14 PM IST

పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం

KDP: దువ్వూరు మండలంలోని పెద్ద జొన్నవరం రైతు సేవా కేంద్రంలో జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం వాతావరణ మార్పుల వలన కలిగే ప్రతికూల పరిస్థితులను తట్టుకునే విధంగా సాగు పద్దతులపై శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఆర్సీ ఏవో స్వాతి మాట్లాడుతూ.. రైతులకు పంట సాగు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయన్నారు.

April 7, 2026 / 07:12 PM IST

రేపు కోర్టు విధులను బహిష్కరిస్తున్నాం: విజయ్ కుమార్

CTR: ఈనెల 8వ తేదీ బుధవారం పుంగనూరులో న్యాయవాదులు విధులను బహిష్కరిస్తున్నట్లు సంఘ అధ్యక్షులు విజయ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. పీలేరులో న్యాయవాది పి.యల్లను దారుణంగా హత్య చేశారు. దీనిని ఖండిస్తూ స్థానిక న్యాయవాదులు రేపు కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు తెలిపారు.

April 7, 2026 / 07:12 PM IST

వంద రోజులు యాక్షన్ ప్లాన్ పై ఎమ్మెల్యే సమీక్ష

W.G: రాష్ట్రంలో నీటి భద్రత కోసం చేపట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ జలధార కార్యక్రమంపై తణుకులో ప్రభుత్వ అధికారులు, వాటర్ బాడీ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించటం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాల్వల పూడికతీత, మరమ్మతులు, భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

April 7, 2026 / 07:04 PM IST

‘విశాఖను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలి’

విశాఖ జిల్లాను దేశానికి ఆదర్శంగా నిలిపేలా వినూత్న అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యలకు వేగంగా స్పందించాలని ఆదేశించారు.

April 7, 2026 / 07:04 PM IST