• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

చేనేతలకు అండగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే

ATP: కూటమి ప్రభుత్వం చేనేత రంగానికి పూర్వవైభవం తెస్తోందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అనంతపురంలో జరిగిన కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడుతూ.. చేనేత భరోసా కింద రూ.25 వేలు అందిస్తామని ప్రకటించారు. మగ్గాలకు ఉచిత విద్యుత్ ఇస్తూ ప్రభుత్వం నేతన్నలకు భరోసా కల్పిస్తోందని చెప్పారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల కార్మికులు ఇబ్బందులు పడ్డారని విమర్శించారు.

April 7, 2026 / 02:35 PM IST

గుండేరు వంతెనకు నిధులు కోరుతూ మంత్రికి విజ్ఞప్తి

కృష్ణా: చల్లపల్లి మండలం కొత్త మాజేరు గ్రామంలో గుండేరు మేజర్ డ్రైనేజీపై నూతన వంతెన మంజూరు చేయాలని గ్రామస్థులు రాష్ట్ర మంత్రి బీ.సీ.జనార్దన రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గుండేరుపై వంతెన దాదాపు పదేళ్ల నుంచి శిథిలావస్థకు చేరి ఉందని తెలిపారు. ఇటీవల గుర్రపు డెక్క పట్టేసి వంతెన ప్రమాదకర స్థితికి చేరుకుందని, నూతన వంతెనకు నిధులు కేటాయించాలని కోరారు.

April 7, 2026 / 02:32 PM IST

చెరువులు పూడికతీతకు రంగం సిద్ధం

E.G: సీతానగరం ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం భారతి ఆధ్వర్యంలో ‘నీటి భద్రత’పై సమీక్ష జరిగింది. ఏప్రిల్ 6 నుంచి 100 రోజుల పాటు చెరువుల పునరుద్ధరణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా పనులు చేపట్టాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకంతో కాలువల పూడికతీత, కట్టల బలోపేతం చేయాలన్నారు. నీటిమట్టం 3-6 మీటర్లకు పెంచడమే లక్ష్యమని, సాగునీటి సంఘాలు భాగస్వాములు కావాలని కోరారు.

April 7, 2026 / 02:30 PM IST

పోలేరమ్మ తల్లి తిరునాళ్లకు ఎమ్మెల్యే హాజరు

GNTR: కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలోని శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సుమారు 400 ఏళ్ల క్రితం స్వయంభూదేవిగా వెలసిన అమ్మవారిని ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు సతీసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు స్థాపించారు.

April 7, 2026 / 02:30 PM IST

కర్మాగారాల్లో భద్రతా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

KRNL: కర్మాగారాల్లో భద్రతా చర్యలు ఖచ్చితంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.సిరి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఫ్యాక్టరీస్ శాఖ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని కర్మాగారాల్లో ప్రమాదాలు జరగకుండా నిర్దేశిత ప్రమాణాల మేరకు భద్రత ఉండాలని ఆమె పేర్కొన్నారు. కార్మికుల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

April 7, 2026 / 02:17 PM IST

‘గ్రామ స్థాయి నుంచే పార్టీ బలోపేతం కావాలి’

SKLM: గ్రామ స్థాయిలో టీడీపీ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే శిరీష అన్నారు. మంగళవారం టీడీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల క్యాడర్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీ క్రమశిక్షణ, విధి విధానాలు, నాయకుల బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఈ మేరకు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

April 7, 2026 / 02:13 PM IST

మే 1 నుంచి హౌసింగ్ సెన్సస్

PPM: మే 1 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా హౌసింగ్ సెన్సస్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు ఈ నెల 16 నుంచి 30 వరకు ‘స్వీయ గణన’ (Self Enumeration) అవకాశం కల్పించారు. ప్రజలు తమ ఇంటి వివరాలను స్వయంగా se.census.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చన్నారు.

April 7, 2026 / 02:12 PM IST

‘అబద్ధాల ప్రచారమే మీడియా స్వేచ్ఛా..?’

BPT: మీడియా స్వేచ్ఛ ముసుగులో వైసీపీ నాయకుల కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా ఆడవాళ్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని అద్దంకి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి, ఒక పార్టీకి తొత్తుగా మారి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం దురదృష్టకరమని అన్నారు.

April 7, 2026 / 02:12 PM IST

‘తాగునీటి సమస్యను పరిష్కరించాలి’

AKP: రాంబిల్లి మండలం మూలజంప ఎస్సీ కాలనీ, గొల్ల వీధిలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని మండల టీడీపీ యూనిట్ ఇంఛార్జ్ అందుకూరి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అనకాపల్లి క్యాంపు కార్యాలయంలో ఎంపీ సీఎం రమేష్‌ను మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు ఒక బోరు, వాటర్ ట్యాంకు మంజూరు చేయాలని కోరారు.

April 7, 2026 / 02:11 PM IST

బస్టాండ్‌లో ప్రయాణికుల అవస్థలు

PLD: చిలకలూరిపేట RTC బస్టాండ్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లుగా వాడుకలో ఉన్న నడక దారిని మూసివేశారు. దీంతో వృద్ధులు, మహిళలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. బస్టాండ్ లోపల అదనంగా బైక్ స్టాండ్లు ఏర్పాటు చేయడంతో బస్సుల రాకపోకలకు ఆటంకం ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై డీఎం వేణుబాబు స్పందిస్తూ సమస్యను త్వరలో పరిష్కరిస్తామన్నారు.

April 7, 2026 / 02:03 PM IST

వరల్డ్ హెల్త్ డే సందర్భంగా అవగాహన ర్యాలీ

కృష్ణా: మచిలీపట్నంలో మంగళవారం వరల్డ్ హెల్త్ డే సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ వో యుగంధర్ మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆరోగ్యానికి మించిన సంపద లేదని, ఇంటి వంట ఆరోగ్యానికి మంచిదని, ప్రతిరోజు వ్యాయామం చేయాలని పిలుపునిచ్చారు.

April 7, 2026 / 02:00 PM IST

వికలాంగురాలికి రాంప్, వీల్‌చైర్‌తో సహాయం

GNTR: మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో గుడివాడ, కోపల్లెలో పింఛన్ కార్యక్రమంలో గుర్తించిన సమస్యకు పరిష్కారం చూపారు. నేనావత్ మంగా బాయి ఇంటి వద్ద రాంప్ ఏర్పాటు చేసి, రోటరీ క్లబ్ ద్వారా వీల్‌చైర్ అందించారు. సర్పంచ్ యడ్లపాటి రాకేష్ సహకారంతో జరిగిన ఈ సేవా కార్యక్రమం లబ్ధిదారురాలి జీవితంలో పెద్ద మార్పు తీసుకొచ్చింది.

April 7, 2026 / 02:00 PM IST

వారపు సంత వేలంతో భారీ ఆదాయం

CTR: ఎస్ఆర్ పురం (M) 49. కొత్తపల్లి మిట్టలో వారపు సంతకు మంగళవారం వేళం జరిగింది. సీఐ హనుమంతప్ప, Dy. ఎంపీడీవో నాగరత్నమ్మ ఆధ్వర్యంలో వారపు సంత, షాపింగ్ కాంప్లెక్స్ మొదలైన ఆస్థులకు బహిరంగ వేలం నిర్వహించారు. 49. కొత్తపల్లి మిట్టకు చెందిన సీనియర్ నేత సూరి రెడ్డి రూ.16.20 లక్షలు హెచ్చుగా వేలం పాడి వారపు సంతను దక్కించుకున్నారు.

April 7, 2026 / 01:33 PM IST

ఎస్సీ కమిషన్ సభ్యులకు ఘన స్వాగతం

TPT: నాయుడుపేటకు విచ్చేసిన ఎస్సీ కమిషన్ సభ్యులు డాక్టర్ పాకాటి గౌతమ్, డాక్టర్ శ్రీపతి బాబుకు మంగళవారం ఘన స్వాగతం లభించింది. ఏఎంసీ ఛైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ జనసేన నాయకులతో కలిసి ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో పూల బొకేలు అందజేసి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు అట్ల కృష్ణరావు, బాలు శెట్టి తదితరులు పాల్గొన్నారు.

April 7, 2026 / 01:31 PM IST

CPI నాయకుల ఆధ్వర్యంలో పాదయాత్ర కరపత్రాల ఆవిష్కరణ

ATP: గుత్తిలో CPI నాయకులు ఈనెల 10వ తేదీ నుంచి చేసే పాదయాత్ర కరపత్రాలను ఆవిష్కరించారు. CPI జిల్లా కార్యవర్గ సభ్యులు వీరభద్రస్వామి మాట్లాడుతూ.. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మాదిరిగా ఏపీ రాష్ట్రానికి ఉపాధి హామీ నిధులు 90 శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతపురం నుంచి బండ్లపల్లి వరకు జరిగే పాదయాత్రను విజయవంతం చేయాలన్నారు.

April 7, 2026 / 01:30 PM IST