KDP: పులివెందులలోని తన నివాసంలో మాజీ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డిని కోదండ రామాలయానికి చెందిన వేదపండితులు కలిసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీతారాముల కల్యాణానికి సంబంధించిన ముత్యాల తలంబ్రాలు, పవిత్ర ప్రసాదాన్ని ఆయనకు అందజేశారు. వేదమంత్రాల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని పండితులు ఆకాంక్షించారు.
అన్నమయ్య: రామాపురం మండల కేంద్రమైన రామాపురంలో బుధవారం నుంచి 15 రోజుల పాటు మహాభారత యజ్ఞం నిర్వహించనున్నట్లు నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. ఈ యజ్ఞాన్ని హరికథ రూపంలో ప్రతి రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. రాత్రి వేళల్లో మహాభారతాన్ని నాటక రూపంలో వేషధారణలతో ప్రదర్శిస్తారని పేర్కొన్నారు.
VSP: సింగల్ యూజ్ ప్లాస్టిక్ ప్రకృతిని, మానవ జీవనశైలిని కలుషిత పరుస్తోందని GVMC కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. సింగల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పక్షులు, జీవరాశులు, జలరాశులు రోగాల బారిన పడుతున్నాయన్నారు. ప్రజలు దీనికి బదులుగా ప్రత్యామ్నాయ వస్తువులను వాడాలని, సముద్రపు జీవ రాశులను కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
GNTR: మంగళగిరిలో నిషేధిత ప్లాస్టిక్ కవర్ల వాడకం ఆగడం లేదు. 120 మైక్రాన్ల లోపు కవర్లు వాడొద్దన్న నిబంధనలు అమలుకావడం లేదు. వీటిని అమ్మితే రూ.2 వేల జరిమానా విధిస్తున్నా మార్పు లేదు. ప్రత్యామ్నాయంగా మార్కెట్లలో రూ.10కే జ్యూట్ బ్యాగ్ వచ్చే ‘ఎనీ టైం బ్యాగ్’ యంత్రాలను ఏర్పాటు చేశారు. అయితే సరైన ప్రచారం లేకపోవడంతో జనం ప్లాస్టిక్‌నే వాడుతున్నారు.
KDP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం పులివెందులకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున నాయకులు, కార్య కర్తలు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. ఇదే సందర్భంలో ఓ చిన్నారి YS జగన్‌ను చూసేందుకు కుటుంబ సభ్యులతో రావడం, దీనిని జగన్ గమనించి తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా చిన్నారిని పిలిపించుకొని ఆప్యాయంగా ముద్దాడారు.
AKP: నువ్వు పంట సాగు లాభదాయకంగా ఉంటుందని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీహరిరావు రైతులకు సూచించారు. మంగళవారం కసింకోట మండలం వెదురుపర్తిలో సాగులో ఉన్న నువ్వు పంటను పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చునన్నారు. నువ్వు పంట కోత అనంతరం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
KDP: జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో ‘స్టాప్,ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని పోలీసులు అమలు చేస్తున్నారు. రాత్రి వేళల్లో రహదారులపై పర్యటిస్తూ, లారీలు, బస్సులు, కార్లు, వ్యాన్ల డ్రైవర్లను ఆపి అలసట నివారణ కోసం నీళ్లతో ముఖం కడిగించి పంపిస్తున్నారు. డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.
ప్రకాశం: సింగరాయకొండ 16 నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం ప్రైవేట్ అంబులెన్స్ డివైడర్ని ఢీ కొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న ఒకరికి గాయాలయ్యాయి. నిద్రమత్తుతో అంబులెన్స్ డ్రైవరు వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. గాయపడ్డ వారిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ASR: డుంబ్రిగూడ మండల పరిధిలో లైసెన్సులు లేని నాటు తుపాకులు కలిగిన వారు తక్షణమే వాటిని పోలీస్ స్టేషన్‌కు వచ్చి స్వచ్ఛందంగా అప్పగించాలని ఎస్సై ఎల్. సురేష్ సూచించారు. లేనిపక్షంలో దర్యాప్తులో బయటపడితే కేసులు నమోదు చేసి అరెస్టులు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయాన్ని గమనించి ఎవరైనా నాటు తుపాకులు కలిగి ఉంటే స్వచ్ఛందంగా అప్పగించాలని తెలిపారు.
VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబి నాయన రామభద్రాపురం మండలం నాయుడు వలసలో ఇవాళ నిర్వహించవలసిన ప్రజాదర్భార్ రద్దు చేసారు. ఆయన తీవ్రమైన త్రోట్ ఇన్ఫెక్షన్తో బాధ పడుతుండటంతో ఇవాళ జరగాల్సిన ఈ కార్యక్రమం రద్దు చేసినట్లు ప్రకటించారు. ఆయన ఆరోగ్యం కుదుటపడే వరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని MLA PRO కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
SKLM: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. విజయావకాశాలపై చర్చించారు. యువత, మహిళలు ఎన్డీఏ వైపు ఉన్నారని ఎంపీ వివరించారు. తమిళనాడులోని తెలుగు ప్రజల్లో చంద్రబాబుకున్న ఆదరణ, బ్రాండ్ ఇమేజ్ చూసి గర్వపడుతున్నట్లు ఎంపీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
CTR: చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బందిలు సామాజిక భద్రతా కార్యకర్తలతో (WMSKs) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, గృహ హింస సమస్యలపై అవగాహన కల్పించారు. కమ్యూనిటీ పోలీసింగ్ ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. క్షేత్రస్థాయిలో ఏదైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలను వెంటనే నివేదించాలని సామాజిక భద్రతా కార్యకర్తలను కోరారు.
CTR: పుంగనూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఈనెల 25న కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి తెలిపారు. ఆరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. కంటి జబ్బులు కలిగిన వారు శిబిరంలో పాల్గొని చికిత్స చేయించుకోవాలని కోరారు.
GNTR: రాజధాని రెండో దఫా భూసమీకరణ కొనసాగుతోంది. అమరావతి పరిధిలోని నాలుగు గ్రామాల రైతులు 1529 ఎకరాలను సీఆర్డీఏకు అప్పగించారు. ఎండ్రాయిలో 580, కర్లపూడిలో 592, పెదమద్దూరులో 342, వైకుంఠపురంలో 15 ఎకరాలు పూలింగ్‌కు వచ్చాయి. ఈ గ్రామాల్లో మొత్తం 7,562 ఎకరాలు సేకరించాల్సి ఉండగా, ప్రస్తుతానికి 1529 ఎకరాలే వచ్చినట్లు సీఆర్డీఏ అధికారులు మంగళవారం వెల్లడించారు.