• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

డీఐజీ విదేశీ పర్యటనకు ప్రభుత్వం అనుమతి

NDL: కర్నూలు రేంజ్ డీఐజీ డా.కోయ ప్రవీణ్ విదేశీ పర్యటన ఖరారైంది. మే 14 నుంచి జూన్ 7వ తేదీ వరకు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. విదేశీ యాత్రకు అనుమతి ఇవ్వాలని పెట్టుకున్న ఆయన వినతికి సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ మేరకు అనుమతి, సెలవు మంజూరు చేసింది. అనంతరం అధికారిక ఉత్తర్వులు ప్రభుత్వం ఇవాళ జారీ చేసింది.

April 29, 2026 / 09:12 AM IST

పెట్రోల్ బంకులకు షోకాజ్ నోటీసులు: జేసీ

ఏలూరులో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న 3 పెట్రోల్ బంకులకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని జేసీ అభిషేక్ గౌడ్ మంగళవారం తెలిపారు. జిల్లాలో డీజిల్‌కు ఎటువంటి కొరత లేదన్నారు. రాత్రి 7 గంటల వరకు 412 కిలో లీటర్ల పెట్రోల్, 670 కిలో లీటర్ల డీజిల్ అమ్మకం జరిగిందన్నారు. కూపన్ విధానం ద్వారా అగ్రికల్చర్, ఫిషరీస్ ఎమర్జెన్సీ సర్వీసులకు డీజిల్ సరఫరా చేశామన్నారు.

April 29, 2026 / 09:11 AM IST

అహోబిలంలో వైభవంగా తిరుచ్చి ఉత్సవం

NDL: అహోబిలంలో నరసింహ జ్యంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎగువ అహోబిలంలో మంగళవారం శ్రీ జ్వాలా నరసింహస్వామికి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తొట్టి తిరుమంజనం ముగిసిన తర్వాత స్వామివారు అశ్వ వాహనంపై కొలువుదీరారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు.

April 29, 2026 / 09:08 AM IST

రేపు పదవ తరగతి ఫలితాలు విడుదల

KRNL: ఏపీ టెన్త్ ఫలితాలు గురువారం విడుదల అయితునట్లు జిల్లా విద్యాశాఖ అధికారిక యంత్రాంగం తెలిపింది. ఉదయం 11 గంటలకు మంత్రి నారా లోకేశ్ రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తును పూర్తి చేసినట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. NOTE: ఫలితాలను వేగంగా, అందరికంటే ముందుగా మన HIT TV యాప్‌లో తెలుసుకోవచ్చు.

April 29, 2026 / 09:07 AM IST

తిరుపతి జిల్లా ప్రజలకు గమనిక

తిరుపతి జిల్లాలోని గ్రామీణులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మే 30వ తేదీ లోపు పంచాయతీలోని ప్రజలు పన్ను చెల్లిస్తే 5% రాయితీ ఇవ్వనున్నారు. జిల్లాలో 4.6 లక్షల అసెస్మెంట్లకు 2026-27కు సంబంధించిన ఇంటి పన్ను డిమాండ్ నోటీస్ ఏకకాలంలో పంపించనున్నారు. కాగా, తొలిసారి గ్రామీణ ప్రాంతంలో నివసించే ప్రజలకు అందుబాటులోకి రాయితీ అమలు చేస్తున్నారు.

April 29, 2026 / 09:02 AM IST

నేను కాకినాడకు రానున్న కేంద్రమంత్రి మురుగన్

KKD: కేంద్రమంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ బుధవారం కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు ఆయన చెన్నై నుంచి విమానంలో రాజమహేంద్రవరం చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.20 గంటలకు కాకినాడ చేరుకుని స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

April 29, 2026 / 09:00 AM IST

మేదరమెట్ల వద్ద లారీ- బైక్ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

ప్రకాశం: మేదరమెట్ల సమీపంలోని పిచ్చుకల గుడిపాడు క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం రాత్రి బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను ఓ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బల్లికురవ మండలం ముక్తేశ్వరకి చెందిన పిట్టల శ్రీకాంత్, బైలడుగు ఆంజనేయులుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వీరిని అంబులెన్స్‌లో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

April 29, 2026 / 08:54 AM IST

గిజబ గ్రామంలో ఏనుగుల గుంపు

PPM: గరుగుబిల్లి మండలం గిజబ గ్రామ పరిసరాల్లో బుధవారం ఉదయం ఏనుగుల గుంపు కనిపించింది. అరటి తోటల వైపు వెళ్లిన రైతులు వాటిని గమనించి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

April 29, 2026 / 08:48 AM IST

వల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం

KDP: వల్లూరు మండలంలోని తప్పెట్ల కొత్తపల్లెలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన లేబక విక్రాంత్ రెడ్డి (14) కడపలో 9వ తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం 6 గంటలకు రోడ్డుపై ఉన్న తన సొంత షాపునకు వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

April 29, 2026 / 08:45 AM IST

విజిబుల్ పోలీసింగ్ .. విస్తృత తనిఖీలు

KRNL: జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీసులు రాత్రి వేళల్లో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. మంగళవారం రాత్రి 11 నుంచి తెల్లవారుజాము వరకు ఒకటవ పట్టణ సీఐ మారుతి శంకర్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయం సమీపంలోని తనిఖీలు చేసినట్లు తెలిపారు. కొండారెడ్డి బురుజు వద్ద క్యూఆర్‌టీలు, బ్లూ కోల్ట్స్ సిబ్బందికి రాత్రి గస్తీ విధులపై దిశా నిర్దేశం చేశారు.

April 29, 2026 / 08:37 AM IST

సెలవుల్లో పాఠశాలలు నడిపితే చర్యలు

CTR: వేసవి సెలవుల్లో పాఠశాలలు తెరవరాదని DEO రాజేంద్రప్రసాద్ తెలిపారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు సెలవుల్లో తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోటీ పరీక్షలు శిక్షణా శిబిరాల పేరుతో పాఠశాలలు నడిపితే నోటీసులు లేకుండానే తగు చర్యలు తీసుకుంటామన్నారు. తప్పనిసరిగా జూన్ 12 వరకు సెలవులు అమలు చేయాలన్నారు.

April 29, 2026 / 08:33 AM IST

‘పారిశుధ్య కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలి’

W.G: తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు వెంటనే వేతన బకాయిలు చెల్లించాలనీ కోరుతూ బుధవారం ఉదయం ఆసుపత్రి ముందు ఈ ఆసుపత్రి కార్మికులు ధర్నా నిర్వహించారు. గత మూడునెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదనీ, కనీసం కాంట్రాక్టర్ కూడా ఫోన్‌లో అందుబాటులో లేరని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

April 29, 2026 / 08:30 AM IST

గుంతకల్లులో వైసీపీకి భారీ షాక్

ATP: గుంతకల్లు పట్టణంలోని 10, 11వ వార్డుకు చెందిన 100 వైసీపీ కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. వీరిని మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి పార్టీ కండువా చేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన పలువురు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీని వీడి టీడీపీలోకి చేరామన్నారు.

April 29, 2026 / 08:30 AM IST

తాళ్లరేవులో బాలుడు అదృశ్యం… పోలీసులు దర్యాప్తు

కాకినాడకు చెందిన చీకట్ల ధనుష్(14) తాళ్లరేవు మండలం బొడ్డువానిలంకలోని తన మేనమామ ఇంటి వద్ద ఉంటూ, ఈ నెల 27న ఆడుకోవాడానికి వెళ్లి అదృశ్యమయ్యాడు. బాలుడి కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో మేనమామ మంగళవారం కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సత్యనారాయణరెడ్డి మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

April 29, 2026 / 08:30 AM IST

మామిడి రైతులకు తిరుపతి కలెక్టర్ సూచనలు

TPT: గతేడాది కంటే ఈసారి మామిడి పంట పరిస్థితులు మెరుగ్గా ఉండే అవకాశముందని తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని, పక్వానికి వచ్చిన కాయలనే కోయాలని సూచించారు. ప్రాసెసింగ్ యూనిట్లతో ఆయన సమీక్ష చేశారు. రైతులకు న్యాయమైన ధరలు అందేలా చూస్తామన్నారు. కొనుగోలు, రవాణా, నిల్వ సదుపాయాలపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

April 29, 2026 / 08:29 AM IST