KDP: కమలాపురం పరిధి దాదిరెడ్డిపల్లిలో వేరుశనగ పంటలను ADA నరసింహారెడ్డి సోమవారం పరిశీలించారు. పంటకు పొగాకు లద్దె పురుగు, ఆకు ముడత ఆశిస్తున్నట్లు గుర్తించారు. నివారణకు పారాజైడ్ లేదా వయగోతో పాటు 13-0-45 ఎరువును కలిపి పిచికారీ చేయాలన్నారు. మువ్వకుళ్లు తెగులుకు దోమల మందు వాడాలన్నారు. రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుని, APAIMS యాప్ సేవలు వినియోగించుకోవాలన్నారు.
CTR: చిత్తూరు మండలం తిమ్మసముద్రంలో 2021లో జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. మరో వ్యక్తిపై హత్యాయత్నం కేసులో 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.3000 జరిమానా విధించారు. 8వ అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి సుంకర శ్రీదేవి ఈ మేరకు నిన్న తీర్పు వెలువరించారు.
TPT: పుత్తూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు ప్రతి మంగళవారం కూరగాయల వారాంతపు సంత జరుగుతుందని మార్కెట్ యార్డ్ కమిటీ తెలిపింది. మార్కెట్ యార్డ్‌లో విశాల ప్రదేశం అనుకూలంగా ఉందని చెప్పారు. మండల పరిధిలోని రైతులు, వ్యాపారులు కూరగాయలు తీసుకువచ్చి క్రయ విక్రయాలు చేసుకోవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
PPM: వీరఘట్టం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో ప్రస్తుతం అన్ని రకాల సాధారణ, అత్యవసర మందులు తగినంత స్థాయిలో అందుబాటులో ఉన్నాయని DMHO డా.భాస్కరరావు సోమవారం తెలిపారు. అరకొర సౌకర్యాలు, రోగులు ఇక్కట్లు అనే కథనానికి ఆయన పై విధంగా స్పందించారు. ఇతర ప్రాంతాల నుంచి రోగులు అధిక సంఖ్యలో వచ్చిన మందులను సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు.
VZM: నెలిమర్ల ఎస్సై గణేష్ నిన్న రాత్రి మండలంలోని పెద బూరాడ పేటలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా గ్రామస్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. IPL క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో యువత ఆన్‌లైన్ బెట్టింగులకు దూరంగా ఉండాలని సూచించారు. ఆన్‌లైన్ బెట్టింగులతో యువత జీవితాలు నాశనం చేసుకుంటున్నారన్నారు.
SKLM: పలాసకు చెందిన ఓ ట్రేడర్స్ యజమాని పి .వైకుంఠ రావు ప్రభుత్వ ధనం దుర్వినియోగం కేసులో జైలు శిక్ష విధించబడింది. 2017లో నమోదైన ఈ కేసులో భారీగా ధాన్యం దుర్వినియోగం చేసి రూ.3.19 కోట్ల ప్రభుత్వ నిధులను అపహరిం చినట్లు నిర్ధారణ కావడంతో సోమవారం స్థానిక సివిల్ జడ్జి మాధురి అతడికి 5 ఏళ్ల జైలు, రూ.20,000 జరిమానా విధించినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు.
AKP: ఎస్ రాయవరం మండలంలో 28 పంచాయతీలకు 8 మంది ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఎంపీడీవో మీనా కుమారి తెలిపారు. ఒక్కొక్కరికి మూడు నుంచి నాలుగు పంచాయతీలను కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక అధికారులుగా నియమించిన వారిలో తనతో పాటు తహసీల్దారు రమేష్ బాబు, ఇరిగేషన్ ఏఈ భాను, మండల పరిషత్ ఏవో రమేష్ బాబు, డిప్యూటీ తహసీల్దార్ నీరజను నియమించారు.
KDP: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జిల్లా వ్యాప్తంగా సోమవారం పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 251 మందిపై కేసులు నమోదు చేసి, రూ. 54,340 జరిమానా విధించారు. ప్రతి ఒక్క వాహనదారుడు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం తాగి వాహనాలు నడపరాదన్నారు.
ASR: భూగర్భ జలాలు పెంచేందుకు నీటి భద్రత కార్యక్రమం చేపడుతున్నామని DWRO రామచంద్రరావు తెలిపారు. నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత 100రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా సోమవారం తమ శాఖ ఇంజనీర్లతో కలిసి కొయ్యూరు మండలంలో పలు సాగునీటి వనరులు పరిశీలించారు. అనంతరం ములకలపాడు చెక్ డ్యామ్‌ను పరిశీలించారు. గేట్లు మరమ్మతులకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు.
VSP: నగర పోలీస్ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)కు సోమవారం 92 ఫిర్యాదులు వచ్చాయి. సీపీ డా. శంఖబ్రత భాగ్చి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించి, ఫిర్యాదుదారులతో మాట్లాడారు. కుటుంబ, భూ వివాదాలు, మోసం, సివిల్ కేసులు ఎక్కువగా వచ్చాయని తెలిపారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు.
సత్యసాయి: పెనుకొండ వైసీపీ కార్యాలయంలో సోమందేపల్లికి చెందిన బండి శివప్రసాద్, బీరే చిన్న తదితరులు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలతో చేనేత వ్యవస్థ సంక్షోభంలో పడిందని, దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
KDP: పులివెందుల మండలంలోని పలు గ్రామాల్లో ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ రూరల్ ఏఈ కె.రమేష్ తెలిపారు. రోడ్డు విస్తరణ పనుల కారణంగా ఆర్.తుమ్మలపల్లె, రాయలాపురం, రచ్చుమర్రిపల్లె గ్రామాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తారు. వినియోగదారులు, రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 7 మంది, నంద్యాల జిల్లాలో 12 మంది డిప్యూటీ తహసీల్దార్లకు అదహాక్ పద్ధతిలో మండల తహసీల్దార్లుగా పదోన్నతులు లభించాయి. ఈ మేరకు కలెక్టర్ ఏ.సిరి గత రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమోషన్ పొందిన అధికారుల్లో బత్తుల నారాయణ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, బి.నాగరాజు, పి.రవిచంద్ర, ఎస్.మురళీమోహన్, తదితరులు ఉన్నారు.
ASR: గిరిజన మహిళా ఉద్యోగిని వేధించిన దేవరాపల్లి హెల్త్ సూపర్‌వైజర్ పుష్పరాజును అరెస్టు చేయాలని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ మహిళా విభాగం నేత చిన్ని, గిరిజన ప్రాంత వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి నాగరాజు సోమవారం పాడేరులో కోరారు. గర్సింగి సచివాలయంలో పనిచేస్తున్న ఆరోగ్యకార్యకర్త రాజ్యలక్ష్మిని అక్కడ పనిచేస్తున్న హెల్త్ సూపర్‌వైజర్ వేధించారన్నారు.
SS: హిందూపురంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా స్థాయి వైసీపీ మహిళా విభాగం ఆత్మీయ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి హాజరుకానున్నారు. మహిళా ప్రజాప్రతినిధులు, కమిటీ సభ్యులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక కోరారు.