• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘రూ. 490 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి’

PPM: సాలూరు నియోజకవర్గాన్ని రూ. 490 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బడ్జెట్‌లో నిధులు కేటాయించారని ఆమె గుర్తుచేశారు. ఆ నిధులతో నియోజకవర్గంలోని మొత్తం పనులను చేసుకుంటూ ముందుకు వెళతామని పేర్కొన్నారు.

April 7, 2026 / 08:13 PM IST

జర్నలిస్టులకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్

KDP: జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఏప్రిల్ 08, 09 తేదీలలో కడప సర్వజన ఆసుపత్రి ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రక్త పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షల కోసం ఖాళీ కడుపుతో రావాలని, గత వైద్య పరీక్షల నివేదికలు ఉంటే తీసుకురావాలని సూచించారు.

April 7, 2026 / 08:12 PM IST

నెట్ జీరో హెల్త్ క్యాంపస్ కార్యక్రమాలు

AKP: ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్‌లో ప్రభుత్వం నెట్ జీరో హెల్త్ క్యాంపస్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి కేజీబీవీ ప్రిన్సిపల్స్, అధికారులతో సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల్లో వ్యర్ధాల నిర్వహణను మెరుగుపరచడం వ్యర్ధాలు లేకుండా చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశించారు.

April 7, 2026 / 08:10 PM IST

ప్రత్యేక అలంకరణలో పైడితల్లి అమ్మవారు

VZM: ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం అర్చకులు విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

April 7, 2026 / 08:00 PM IST

కరికెరలో జిల్లాలోనే తొలి ‘భర్తన్ బ్యాంక్’ ప్రారంభం

సత్యసాయి: జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మంగళవారం గుడిబండ మండలం కరికెర గ్రామంలో పర్యటించారు. గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో జిల్లాలోనే మొదటిసారిగా ఏర్పాటు చేసిన ‘భర్తన్ బ్యాంక్’ (స్టీల్ సామాన్ల బ్యాంకు)ను ఆయన ప్రారంభించారు. కరికెర మహిళల ఐక్యత, పనితీరు జిల్లాకే ఆదర్శమని కలెక్టర్ కొనియాడారు. DRDA పీడీ నరసయ్య, DPO సమత పాల్గొన్నారు.

April 7, 2026 / 07:50 PM IST

నీటి భద్రతపై రైతులకు అవగాహన కార్యక్రమం

KRNL: ఏపీ ప్రభుత్వం చేపట్టిన ‘నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంపై పెద్దకడబూరు మండలంలోని జాలవాడి గ్రామంలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇరిగేషన్ శాఖ జేఈ సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘం అధ్యక్షుడు సత్యన్న గౌడ్, టీడీపీ నాయకులు ముక్కన్న, మునెప్ప, గ్రామ అధ్యక్షుడు బోయ యంకన్న తదితరులు పాల్గొన్నారు.

April 7, 2026 / 07:42 PM IST

జేసీబీ గుంతలో పడి చిన్నారి మృతి

TPT: ఏర్పేడు మండలం చిందేపల్లి ఎస్టీ కాలనీ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. తోటి పిల్లలతో ఆడుకుంటూ కాలుజారి చెరువులోని జేసీబీ గుంతలో పడి ఎండ్ల సుస్మిత(6) మృతి చెందింది. సమాచారం అందుకున్న స్థానికులు మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

April 7, 2026 / 07:42 PM IST

ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడిని ఖండించిన ఎమ్మెల్యే

VZM: హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ శ్రేణులు చేసిన దాడిని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన తీవ్రంగా ఖండించారు. అమరావతిపై వారి అధినాయకుని నిర్ణయాన్ని ఎత్తిచూపినందుకు మీడియాపై వైసీపీ దాడి చేయడం సబబు కాదని హితవు పలికారు. ఆంధ్రజ్యోతికథనంపై అభ్యంతరం ఉంటే ఖండన ఇవ్వాలి తప్ప, ఇలా భౌతిక దాడులు సరికాదన్నారు.

April 7, 2026 / 07:35 PM IST

రాప్తాడులో పండమేరు వాగు వంతెన పనులు ప్రారంభం

ATP: రాప్తాడు నియోజకవర్గ కేంద్రం నుంచి చిన్మయ నగర్, జేఎన్టీయూ రహదారిలోని పండమేరు వాగుపై లో-లెవెల్ కాజ్ వే నిర్మాణానికి ఎమ్మెల్యే పరిటాల సునీత మంగళవారం భూమిపూజ చేశారు. రూ.4 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పనులకు తొలి దశలో రూ.2 కోట్ల డీ.ఎం.ఎఫ్ నిధులు మంజూరయ్యాయి. అధికారులు, కూటమి నాయకులతో కలిసి ఆమె పనులు ప్రారంభించారు.

April 7, 2026 / 07:35 PM IST

SPMVV విద్యార్థిని జ్యోతికి డాక్టరేట్

TPT: SPMVV పరిశోధన విద్యార్థిని పీ.జ్యోతికి డాక్టరేట్ ప్రదానం చేసినట్లు విశ్వవిద్యాలయం తెలిపింది. ఎస్. జోష్న రాణి మార్గదర్శకత్వంలో, టైప్-2 మధుమేహం ఉన్న ప్రీమెనోపాజల్, పోస్టుమెనోపాజల్ మహిళల్లో నిద్ర సమస్యలపై ఆమె పరిశోధన చేశారు. ఆమెకు డాక్టరేట్ లభించడంతో పలువురు అభినందనలు తెలిపారు.

April 7, 2026 / 07:34 PM IST

మాజీ సీఎంతో వైసీపీ నేతలు భేటీ

KDP: జమ్మలమడుగులో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై మాజీ సీఎం YS జగన్‌తో వైసీపీ నేతలు చర్చించారు. మంగళవారం తాడేపల్లిలోని YS జగన్ స్వగృహం నందు మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షుడు వల్లంబాయి హృషికేశవ రెడ్డి, సీనియర్ నాయకులు సింగంరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మోహన్ రెడ్డి కలిశారు. వైసీపీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని జగన్ సూచించినట్లు హృషికేశవ రెడ్డి తెలిపారు.

April 7, 2026 / 07:29 PM IST

రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

VSP: ఆనందపురం మండలం మామిడిలోవలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నవీకరించిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. క్యూఆర్ కోడ్ ద్వారా భూమి పూర్తి వివరాలు తెలుసుకునే విధంగా పాస్ బుక్స్ అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆయన, ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి పనులు వేగంగా చేపడుతోందన్నారు.

April 7, 2026 / 07:28 PM IST

‘ఇళ్లు ఖాళీగా ఉంచేటప్పుడు భద్రతా చర్యలు తప్పనిసరి’

అన్నమయ్య: వేసవి సెలవుల్లో ఇళ్లు ఖాళీగా ఉంచేటప్పుడు భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సూచించారు. సోషల్ మీడియాలో పర్యటన వివరాలు పంచుకోవద్దని హెచ్చరించారు. పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా ఉంచాలని, చెరువులు, బావులు వంటి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

April 7, 2026 / 07:27 PM IST

‘ రైతులకు సాంకేతిక సమస్యలు శాపంగా మారాయి’

W.G: సాంకేతిక సమస్యలు రైతుల పాలిట శాపంగా మారాయని రైతు నాయకుడు కూనపరెడ్డి రంగారావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నరసాపురంలో ఆయన మాట్లాడుతూ.. ఈ- పాస్ పుస్తకాలు అందక రైతులు సచివాలయాలు, మీసేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదన్నారు. సైట్ ఓపెన్ కావడం లేదనే సాకుతో సిబ్బంది కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.

April 7, 2026 / 07:25 PM IST

‘ప్రతి ఒక్కరూ హెల్మెట్ విధిగా ధరించాలి’

ELR: రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా భీమడోలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నేషనల్ హైవే 216 A పై హెల్మెట్లు లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. 30 మంది వాహనదారులతో హెల్మెట్లు కొనుగోళు చేయించారు. ప్రయాణంలో హెల్మెట్ ధరిస్తే ప్రమాదం సమయంలో కాపాడుతున్నారు.

April 7, 2026 / 07:22 PM IST