• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘వైసీపీ ఉనికి కోసమే ఆరోపణలు’

సత్యసాయి: మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఉనికి కోసం మంత్రి సవితపై ఆరోపణలు చేస్తున్నారని సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, టీడీపీ పట్టణ కన్వీనర్ శ్రీరాముల విమర్శించారు. మంగళవారం పెనుకొండలో వారు మాట్లాడుతూ.. పెనుకొండలో అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలకు దిగుతున్నారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సమస్యలు పట్టించుకోలేదని, ఇప్పుడు విమర్శలు చేయడం తగదని అన్నారు.

April 28, 2026 / 03:40 PM IST

ప్రమాదాల నివారణపై ఎస్పీ దృష్టి

GNTR: మంగళగిరి, తుళ్లూరు మండలాల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ వకుల్ జిందాల్ చర్యలు చేపట్టారు. మంగళవారం జాతీయ రహదారులపై ఉన్న బ్లాక్‌స్పాట్లను పరిశీలించారు. కాజా, వెంకటాయపాలెం టోల్ ప్లాజాలు, బైపాస్ రోడ్లను పర్యవేక్షించారు. వేగ నియంత్రణకు స్పీడ్ బ్రేకర్లు, సైన్ బోర్డులు, లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

April 28, 2026 / 03:26 PM IST

డీజిల్ కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్

ELR: డీజిల్ కృతిమ కొరత సృష్టించే బంక్ యజమానులపై కేసులు నమోదు చేయాలనీ కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. పట్టణంలో పలు పెట్రోల్ బంక్‌లను ఇవాళ అధికారులతో కలిసి పరిశీలించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కారణంగా ప్రజలు అధికంగా కొనుగోలు చేస్తున్నారని దీని కారణంగా కొంతమంది కృత్రిమ సృష్టిస్తున్నారని వివరించారు.

April 28, 2026 / 03:25 PM IST

జర్నలిస్టులపై దాడులు క్షమించరాని నేరం: సామకోటి

సత్యసాయి: ఏబీఎన్ రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సామకోటి ఆదినారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పుట్టపర్తిలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులపై దాడులు చేయడం క్షమించరాని నేరమని మండిపడ్డారు. వార్తలు రాసినందుకు హత్య చేయడం సభ్య సమాజం తలదించుకునే చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు.

April 28, 2026 / 03:20 PM IST

‘జిల్లాలో సమృద్ధిగా పెట్రోల్ నిల్వలు’

AKP: జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మూర్తి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 164 పెట్రోల్ బంకులు ఉన్నాయన్నారు. వాటిలో మొత్తం పెట్రోల్ 6.74 లక్షల లీటర్లు, డీజిల్ 10.90 లక్షల లీటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ సరఫరా సజావుగా జరుగుతున్నట్లు చెప్పారు.

April 28, 2026 / 03:20 PM IST

అనుమానస్పదంగా ట్రాన్స్ జెండర్ మృతి

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని కాశిరెడ్డి కాలనీకి చెందిన రావూరు పేరయ్య ట్రాన్స్ జెండర్ అనుమానాస్పదంగా మృతి చెందింది. కందుకూరుకు చెందిన పొట్లూరు అంజయ్యతో రిలేషన్‌లో ఉండగా, నిన్న సోమవారం కందుకూరు వెళ్ళింది. మంగళవారం చనిపోయిందని చెప్పి అంజయ్య మృతదేహాన్ని కనిగిరి తీసుకువచ్చాడు. అంజయ్యపై పోలీస్ స్టేషన్‌లో పేరమ్మ సన్నిహితులు ఫిర్యాదు చేశారు.

April 28, 2026 / 03:20 PM IST

నీటి ఎద్దడి సమస్య రాకుండా చర్యలు: MPDO

CTR: గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో అప్పాజీ తెలిపారు. మంగళవారం స్థానికులు ఆయనను కలిసి సమస్యలను వివరించారు. మొరంపల్లి, సుగాలిమిట్ట, ఏడూరు, రంగోలిమిట్ట, మీర్జేపల్లిలో కొత్త బోర్లు వేయాలని, లక్ష్మీనాయక్ తాండ, చదల్లలో బోరు డీప్నింగ్ చేయాలని కోరారు. స్పందించిన ఎంపీడీవో, నీటి సమస్య పరిష్కారానికి తక్షణమే కృషి చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు.

April 28, 2026 / 03:14 PM IST

ఎమ్మెల్యేను కలిసిన నూతన వైద్యాధికారులు

కృష్ణా: చల్లపల్లి మండలం పురిటిగడ్డలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నూతన వైద్యాధికారులుగా డాక్టర్ జే.సాయితేజ్, డాక్టర్ వై.హైందవి నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారు మంగళవారం అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాదును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రోగులకు ఉత్తమ సేవలు అందించి మంచిపేరు తెచ్చుకోవాలని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ వారికి సూచించారు.

April 28, 2026 / 03:12 PM IST

చాపాడు మండలంలో చలివేంద్ర ప్రారంభం

KDP: మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ చాపాడులో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి దృష్ట్యా మజ్జిగ, శుద్ధ నీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. KC కాలువ కింద రైతులు మంచి దిగుబడులు సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు. అలగనూరు బాలెన్సింగ్ రిజర్వాయర్ మరమ్మతులకు నిధులు సమీకరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

April 28, 2026 / 03:03 PM IST

డ్వాక్రా సభ్యురాలికి ఎగ్ కార్ట్ యూనిట్ పంపిణీ

CTR: నగరి రూరల్ మండలం బుగ్గ అగ్రహారం గ్రామానికి చెందిన డ్వాక్రా సభ్యురాలు కుప్పమ్మకు రూ.50 వేల విలువైన ఎగ్ కార్ట్ యూనిట్‌ను ఉచితంగా మంజూరు చేశారు. ఈ యూనిట్‌ను నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ప్రారంభించి లబ్ధిదారురాలికి అందజేశారు. ఈ సందర్భంగా మహిళల ఆర్థికాభివృద్ధికి ఇలాంటి స్వయం ఉపాధి పథకాలు ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యే అన్నారు.

April 28, 2026 / 03:03 PM IST

వేసవి శిక్షణ తరగతులు ప్రారంభం

W.G: నరసాపురం ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయంలో మంగళవారం వేసవి శిక్షణ తరగతుల ప్రారంభమయ్యాయి. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు, శాస్త్రవేత్త సుబ్బారావు స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా ఎంఈవో పుష్పరాజ్యం పాల్గొని రిబ్బన్ కట్ చేసి తరగతులను ప్రారంభించారు. అనంతరం గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

April 28, 2026 / 03:00 PM IST

ఎమ్మెల్యే సోమిరెడ్డిపై కాకాణి పరోక్ష ఆరోపణలు

NLR: కళ్లున్నా చూడలేని కబోధులు, చెవులున్న వినపడని వారికి ఏం చెప్పినా ఫలితం ఉండదని పరోక్షంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డిని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన మనుబోలులోని జగనన్న కాలనీలో పర్యటించారు. పేదలకు ఇల్లులు నిర్మించిన ఘనత తమ ప్రభుత్వం అని అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం కనీసం నిధులు మంజూరు కూడా చేయడం లేదన్నారు.

April 28, 2026 / 03:00 PM IST

నిందితులకు శిక్ష పడేలా చేస్తాం: ఎమ్మెల్యే

NDL: ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామంలో ఈ నెల 23న వడ్డే మనోజ్ హత్యకు గురైన ఘటన నేపథ్యంలో ఇవాళ పాణ్యం ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి గ్రామానికి వెళ్లి మనోజ్ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబీకులకు ధైర్యం చెప్పారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీస్ అధికారులను MLA ఆదేశించారు.

April 28, 2026 / 03:00 PM IST

జర్నలిస్టు హత్యపై కఠిన చర్యలకు డిమాండ్

ATP: చిత్తూరు జిల్లా వి.కోటలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యను ఖండిస్తూ జర్నలిస్ట్ సంఘాల నేతలు అనంతపురం కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్‌కు వినతిపత్రం అందజేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టులపై దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే తమకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

April 28, 2026 / 03:00 PM IST

అంగన్వాడీల్లో అవకతవకలు.. బీజేపీ ఫిర్యాదు

KRNL: పత్తికొండ మండల అంగన్వాడీ కేంద్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయని బీజేపీ నాయకులు ఎమ్మార్వోకు వినతిపత్రం ఇచ్చారు. కేంద్రాలు సమయానికి తెరుచుకోవడం లేదని, టీచర్లు హాజరు కాక ఆయాలే నిర్వహిస్తున్నారని ఆరోపించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందడం లేదన్నారు. విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

April 28, 2026 / 03:00 PM IST