VZM: అకాల వర్షాలు, ఈదురు గాలులు కారణంగా చేతివరకు వచ్చిన పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన అధికారులను అప్రమత్తం చేశారు. ఈ సందర్బంగా బొబ్బిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనా వేయాలని ఆదేశించారు. నివేదికను సత్వరమే తయారుచేయాలని కోరారు.
PLD: సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిని ఏఐటీయూసీ నాయకులు అంజిరెడ్డి, కంబాల శ్రీనివాసరావు, ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ పూదోట సందర్శించారు. కూటమి ప్రభుత్వం ప్యానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందికి రూ.18,600 జీతాలు ఆదేశించినా, కాంట్రాక్టు ఏజెన్సీలు తక్కువ మొత్తంలో మాత్రమే చెల్లిస్తూ దోపిడీ చేస్తున్నాయని వారు ఆరోపించారు.
ప్రకాశం: కనిగిరి ఏపీ మోడల్ స్కూల్లో ఈనెల 12న ఆరో తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ పద్మావతి తులసి తెలిపారు. పరీక్ష రాయనున్న విద్యార్థులు అరగంట ముందుగానే పాఠశాలకు చేరుకుని తమకు కేటాయించిన గదులను చూసుకోవాలని సూచించారు. హాల్ టికెట్లు ఈనెల 3వ తేదీ నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని, వాటిని డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
GNTR: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ నెల 8న నిర్వహించనున్న మెగా కల్చరల్ ఫెస్ట్ వేడుకలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు యూనివర్సిటీ అధికారులు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కల్చరల్ ఫెస్ట్ కార్యక్రమాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు విశ్వవిద్యాలయం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.
కోనసీమ: మండపేట మండలం ద్వారపూడిలో పంగిడి చెరువు వద్ద ‘జలధార’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఏపీఐడీసీ ఛైర్మన్ లీలా కృష్ణతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ప్రకటించిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 6 నుంచి జులై 14 వరకు జలవనరుల సంరక్షణ పనులు చేపడతామని తెలిపారు.
ELR: తడికపూడి పోలీస్ స్టేషన్‌కు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై వల్లి పద్మ సోమవారం చింతలపూడిలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తడికలపూడి పోలీస్ స్టేషన్ చరిత్రలో ఒక మహిళ ఎస్సైగా రావడం విశేషమని అన్నారు. మండలంలో శాంతి భద్రతలు కాపాడేందుకు కృషి చేయాలని, అసాంఘిక కార్యక్రమాలపై దృష్టి సారించి వాటిని నిలువరించేందుకు కృషి చేయాలన్నారు.
CTR: బీజేపీ పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా “మన ఊరు- మన జెండా” కార్యక్రమం భాగంగా ఎస్ఆర్ పురం మండలంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు జల్లా జ్యోతి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సత్యసాయి: రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా చేపట్టిన ‘జలధార – జలహారతి’ కార్యక్రమంపై CM చంద్రబాబు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, JC మౌర్య భరద్వాజ్ ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
NTR: గంపలగూడెం మండలం అనుములంక గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. అమ్మమ్మ ఇంటికి శుభకార్యానికి వచ్చి, చెరువులో ఈతకు వెళ్లి మిరియాల రమేష్(19) అనే యువకుడు మునిగిపోయాడని స్థానికులు తెలిపారు. కాగా చెరువులో గాలింపు చర్యలు గ్రామస్తులు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
PLD: వెల్దుర్తి మండలం మిట్టమీదపల్లెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఫీల్డ్ ఆఫీసర్, యూనిట్ ఇంఛార్జ్‌గా పనిచేస్తున్న మడతల శ్రీనివాసరెడ్డి ప్రమాదవశాత్తు పిడుగుపాటుకు గురయ్యారు. ఈ దుర్ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శ్రీనివాసరెడ్డి అకాల మరణంతో ఆయన కుటుంబంతో పాటు స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రకాశం: కొండపి మండలంలో గత సంవత్సరం కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తికి ఒంగోలు పోక్సో కోర్టు 20 సంవత్సరాలు జైలు శిక్ష సోమవారం విధించింది. నిందితుడు అత్యాచారానికి పాల్పడి కూతుర్ని బెదిరించాడు. కూతురు జరిగిన విషయాన్ని తల్లికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి సాక్షాదారాలను పరిశీలించిన న్యాయమూర్తి శైలజ రూ.7 వేల జరిమన జైలు శిక్ష వింధించారు.
అన్నమయ్య: గాలివీడు మండలంలో అధిక వడ్డీ వేధింపుల కారణంగా దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సీపీఐ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం, చిన్నారుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని సీపీఐ నేత సిద్దిగాళ్ల శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వడ్డీ వ్యాపారుల అక్రమాలను అరికట్టాలని ఆయన కోరారు.
VZM: IPL సీజన్ నేపథ్యంలో విద్యార్థులు బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని సీఐ షణ్ముఖరావు సోమవారం హెచ్చరించారు. ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బెట్టింగ్‌లు యువత జీవితాలను నాశనం చేస్తాయని పేర్కొన్నారు. ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడినా లేదా ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తప్పవని, వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
W.G: నరసాపురం పట్టణంలో సోమవారం భారీ దొంగతనం వెలుగుచూసింది. గంగులకుర్తి శ్రీనివాస్ అనే వ్యక్తి పది రోజుల క్రితం కుటుంబంతో కలిసి షిరిడీ వెళ్లగా, గుర్తు తెలియని దుండగులు ఆయన ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువాలో ఉన్న రూ.2.5లక్షల నగదు, 16 కాసుల బంగారం, 2 కేజీల వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ELR: జిల్లాలో నీటి సంరక్షణ పనులు పూర్తిచేసేందుకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ కే. వెట్రిసెల్వి చెప్పారు. దెందులూరు మండలం సోమవరప్పాడులో సోమవారం స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో కలిసి నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యతపై సమీక్షించారు. నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెత్తను తొలగించేందుకి చర్యలు తీసుకుంటామన్నారు.