• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

12న ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష

KRNL: ఆస్పరి మండలం పుటకలమర్రి ఏపీ మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశాలకు ఈనెల 12న ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు బుధవారం ప్రిన్సిపల్ ఎస్.షమీల తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని, పరీక్ష రోజు ఉదయం 9:30 గంటలకు స్కూల్‌కు హాజరుకావాలని సూచించారు.

April 9, 2026 / 07:00 AM IST

బాధిత కుటుంబాలకు రూ. 2.22 కోట్ల బీమా

NLR: నెల్లూరు జిల్లాలో ప్రమాదవశాత్తు మరణించిన ARPC రమేశ్ బాబు కుటుంబానికి రూ.1.12 కోట్లు, పీసీ శివకుమార్ కుటుంబానికి రూ.1.10 కోట్ల బీమా చెక్కులను జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల బుధవారం సాయంత్రం అందజేశారు. SBI సహకారంతో ఈ మొత్తాన్ని అందజేస్తూ బాధిత కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.

April 9, 2026 / 06:50 AM IST

ఏఐపై పట్టు సాధిస్తే ఉజ్వలమైన భవిష్యత్తు: ఎంపీ

ATP: అనంతపురం JNTU VC సుదర్శన్ రావును ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ కలిశారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఐటీ, సాంకేతిక రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు అవసరమైన శిక్షణపై చర్చించారు. బెంగళూరు నుంచి వచ్చిన ఐటీ నిపుణుల బృందాన్ని వీసీకి పరిచయం చేశారు. ఏఐపై పట్టు సాధిస్తే విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఎంపీ తెలిపారు.

April 9, 2026 / 06:49 AM IST

నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం

E.G: రాజమండ్రి మల్లయ్యపేట సబ్ స్టేషన్ పరిధిలో కండక్టర్ రీప్లేస్మెంట్ పనుల వల్ల గురువారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ శామ్యూల్ తెలిపారు. కాతేరు, తిరుమల కాలేజీ ఏరియా, దాసరి నగర్, సి.టి.ఆర్.ఐ రోడ్, గణపతి నగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ ఉండదు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలన్నారు. 

April 9, 2026 / 06:48 AM IST

సాకుర్రు స్పెషల్ ఆఫీసర్‌గా దివాకర్

కోనసీమ: అమలాపురం మండలం సాకుర్రు గ్రామ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన తహశీల్దార్ వి.ఎస్.దివాకర్‌ను పంచాయతీ కార్యదర్శి రమా శైలజ, గ్రామ పెద్దలు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో కార్య దర్శి ఆయనకు పుష్పగుచ్చం అందించి దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పొలమూరి బాలకృష్ణ, గుత్తుల చిరంజీవి పాల్గొన్నారు.

April 9, 2026 / 06:46 AM IST

పాడేరులో కూలిపోవడానికి సిద్ధంగా విద్యుత్ స్తంభాలు

ASR: పాడేరు మండలం నీకాయిపాడులో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇనుప విద్యుత్ స్తంబాలు స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. గ్రామంలో ఐదు స్తంభాలు ప్రమాదకర స్థితిలో ఉండటంతో ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశముందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులకు స్పందించి నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

April 9, 2026 / 06:41 AM IST

ఏలేరు రిజర్వాయర్‌లో మృతదేహం లభ్యం

KKD: ఏలేరు రిజర్వాయర్ పవర్ ప్లాంట్ బిట్-2 సమీపంలో బుధవారం వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మత్స్యకారుల సమాచారంతో మత్స్య శాఖ అధికారి రాజేంద్రరావు బోట్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతుడు జడ్డంగి అన్నవరం గ్రామానికి చెందిన వ్యక్తిగా ఎస్సై రామలింగేశ్వరరావు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

April 9, 2026 / 06:39 AM IST

శ్రీకాకుళం నుంచి తిరుపతికి రైలు సర్వీసు

శ్రీకాకుళం నుంచి తిరుపతికి రెగ్యులర్ రైలు సర్వీసు మంజూరైనట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బుధవారం ప్రకటనల్లో తెలిపారు. హమ్సఫర్ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 13 నుంచి ప్రారంభం కానుందని రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ రైలు ప్రతి ఆదివారం సాయంత్రం తిరుపతి నుంచి, ప్రతి సోమవారం మధ్యాహ్నం శ్రీకాకుళం రోడ్ నుంచొ ప్రయాణిస్తుందన్నారు.

April 9, 2026 / 06:28 AM IST

నేడు జిల్లాలో పర్యటించనున్న మంత్రి సుబాష్

SKLM: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. మంత్రి సుభాష్ గురువారం ఉ.10.30కు ఎచ్చెర్లలోని NACL కంపెనీలో సేఫ్టీ సెలబ్రేషన్స్‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు రెడ్డీస్ లాబరేటరీలో జరిగే మాక్ డ్రిల్‌ను సందర్శిస్తారు. అనంతరం సా. 3 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారని తెలిపారు.

April 9, 2026 / 06:25 AM IST

నేటి నుంచి యథావిధిగా మంచినీటి సరఫరా: కమిషనర్

VZM: రాజాం పట్టణంలో గురువారం నుంచి యథావిధిగా కుళాయిల ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నట్లు మునిసిపల్ కమిషనర్‌ రామచంద్రరావు బుధవారం తెలిపారు.ఆయన మాట్లాడుతూ.. రేగిడి మండలం మజ్జి రాముడు పేట వద్ద ప్రధాన పైపులైను మరమ్మతు పనులు పూర్తై నేపథ్యంలో యథావిధిగా నీటిని పునరుద్ధరణ చేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని గ్రహించవలసిందిగా ప్రజలను కోరారు.

April 9, 2026 / 06:14 AM IST

డీసెట్-2026 ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

W.G: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో డీసెట్-2026 ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమైనట్లు దూబచర్ల డైట్ కాలేజీ ప్రిన్సిపల్ కమలకుమారి తెలిపారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 15 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ కోర్సులో చేరాలనుకునే వారు 7995869743 నంబరులో సంప్రదించాలని కోరారు.

April 9, 2026 / 06:12 AM IST

నాయుడుపేటలో అక్రమంగా కలప తరలింపు

TPT: నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాసపురం సోషల్ ఫారెస్ట్ భూముల్లో నీలగిరి తైలం చెట్లను కొందరు వ్యక్తులు అక్రమంగా నరికి తరలిస్తున్నారు. టన్నుల పరిమాణంలో కలపను తరలిస్తున్నప్పటికీ, రెవెన్యూ, ఫారెస్ట్, మున్సిపాలిటీ అధికారులు ఈ అక్రమాన్ని పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

April 9, 2026 / 06:11 AM IST

మూల్యాంకనంలో తప్పులు దొర్లితే కఠిన చర్యలు: కలెక్టర్

EG: బాల విజ్ఞాన్ మందిర్ పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం పరిశీలించారు. సీసీ కెమెరాల నిఘా, అధికారులకు అందుతున్న వసతులపై డీఈవో వాసుదేవరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్పాట్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. 

April 9, 2026 / 06:11 AM IST

మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలి: ఎమ్మెల్యే

ATP: పుట్లూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక అధికారుల సమావేశంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ స్థానిక సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సూచించారు. వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.

April 9, 2026 / 06:10 AM IST

తాగునీటి కష్టాలు.. ఇబ్బందుల్లో ప్రజలు

CTR: వేసవి ప్రారంభమవ్వడంతో పల్లెల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. పలమనేరు రూరల్ జరావారి పల్లి, పకీరుపల్లి, పి. వడ్డూరులో బోరు మోటార్లు పనిచేయక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరం నుంచి నీరు తెచ్చుకుంటున్నామన్నారు. ఆరు నెలల నుంచి చెబుతున్నా ఏ నాయకుడు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

April 9, 2026 / 06:10 AM IST