SKLM: ఏబీఎన్ రాధాకృష్ణపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా నాయకులతో కలిసి ఎస్పీ కార్యాలయంలో సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈనెల తొమ్మిదవ తేదీన రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశామని, ఇంతవరకు చర్యలు తీసుకోకూడదు మరోసారి ఫిర్యాదు చేస్తున్నామని పేర్కొన్నారు.
కృష్ణా: పెనమలూరు మండలం పోరంకిలో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు MLA బోడె ప్రసాద్ మంగళవారం అందజేశారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని MLA సూచించారు. వయస్సుకు అనుగుణంగా జీవనశైలి, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని, స్తోమత ఉన్నవారు ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
సత్యసాయి జిల్లా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళిక (పీఎల్పీ) పుస్తకాన్ని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ఆవిష్కరించారు. జిల్లాలో మొత్తం ప్రాధాన్యతా రంగాల రుణ సామర్థ్యాన్ని రూ. 13,833.66 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా వ్యవసాయ రంగానికి రూ. 9,365.64 కోట్లు, ఎంఎస్ఎంఈ రంగానికి రూ. 3,457.65 కోట్లు కేటాయించారు.
KRNL: జనగణనలో భాగంగా ప్రతి కుటుంబం స్వీయ గణన నమోదు చేసుకోవాలని ఆదోని MLA పార్థసారథి కోరారు. ఆన్లైన్ ద్వారా వివరాలు నమోదు చేయవచ్చని, సమాచారం గోప్యంగా ఉంటుందని తెలిపారు. 10–15 నిమిషాల్లో ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. ఏప్రిల్ 30లోపు నమోదు పూర్తి చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో MRO శేషఫణి, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, వీఆర్వో రాజశేఖర్ ఉన్నారు.
TPT: శ్రీసిటీలో మహిళ భద్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎస్సై ప్రియాంక మహిళలకు ధైర్యం నింపారు. “భయపడొద్దు పోలీస్ మీతోనే ఉంది” అంటూ ఆమె భరోసా కల్పించారు. KGI కంపెనీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళల రక్షణకు సంబంధించిన పలు సూచనలు చేశారు. పోలీసులు ఎప్పుడూ మహిళల భద్రత కోసం సిద్ధంగా ఉంటారని తెలిపారు.
CTR: పలమనేరు మున్సిపల్ పరిధిలో రెండు రోజులపాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్య నీటి వనరు అయిన కాలువ పల్లె రిజర్వాయర్ నీటి సరఫరా పైప్ లైన్ లీకేజీల మరమ్మత్తుల కారణంగా ఈ అంతరాయం ఉంటుందన్నారు. ప్రజలు దీనిని గుర్తించి సహకరించాలని కోరారు.
KDP: టెక్స్టైల్ ఎగుమతుల విజన్–2030 అమలుపై కలెక్టర్ శ్రీధర్ సమీక్ష నిర్వహించారు. జౌళి రంగాన్ని బలోపేతం చేసి, చేనేత ఉత్పత్తుల ఎగుమతులను పెంచాలని అధికారులకు సూచించారు. కొత్త యూనిట్ల స్థాపనకు ప్రోత్సాహం ఇవ్వాలని, జిల్లాలో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని అన్నారు. 2030కి రు.100 బిలియన్ లక్ష్యంలో జిల్లాల భాగస్వామ్యం అవసరమన్నారు.
TPT: జిల్లాలో మామిడి పంట పరిస్థితులపై జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సమీక్ష నిర్వహించారు. గతేడాదికంటే ఈ ఏడాది దిగుబడి మెరుగ్గా ఉండే అవకాశముందని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పక్వానికి వచ్చిన కాయలనే కోయాలని సూచించారు. ప్రాసెసింగ్ యూనిట్లు రైతులతో సమన్వయం చేసుకుని న్యాయమైన ధరలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
VSP: జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రతినిధి బృందం ఆంధ్ర యూనివర్సిటీను సందర్శించింది. ఈ సందర్భంగా జపాన్ కంపెనీల్లో విద్యార్థుల నియామకాలు, ఫ్యాకల్టీ-స్టూడెంట్ ఎక్స్చేంజ్పై చర్చలు జరిపింది. జపాన్ విద్యార్థులకు ఏయూలో ప్రవేశాలు, భాషా తరగతులు, సంయుక్త సదస్సులపై ప్రతిపాదనలు వెల్లువెత్తాయి.
GNTR: నగరంలో పెండింగ్లో ఉన్న రోడ్డు విస్తరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కమిషనర్ కే. మయూర్ అశోక్ ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశించారు. రెడ్డిపాలెం–నందివెలుగు రోడ్, ఏటీ అగ్రహారం ప్రాంతాల్లో పనులను పరిశీలించారు. వాసవి నగర్లో లేఅవుట్ అప్లికేషన్ను సమీక్షించి, పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులపై అధికారులకు సూచనలు ఇచ్చారు.
NTR: నందిగామ మండలం మునగచర్ల గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న తాగునీటి సమస్య పరిష్కారానికి కీలక అడుగు పడింది. ఎంపీ నిధుల రూ.40 లక్షలతో కృష్ణా నది నుంచి గ్రామానికి మంచినీటి పైప్లైన్ పనులకు మంగళవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని), ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, నెట్టెం రఘురాం, చలసాని ఆంజనేయులు పాల్గొన్నారు.
BPT: గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయమని బాపట్ల జిల్లా కలెక్టర్ వీ. వినోద్ కుమార్ అన్నారు. నిజాంపట్నం మండలం బొర్రవారిపాలెంలో ఆయన మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ భవనం, మంచినీటి ప్రాజెక్టులను ఆయన పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
VZM: అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకోవద్దని జేసీ సేధు మాధవన్ సూచించారు. ఈ మేరకు విజయనగరం, చీపురుపల్లి, గుర్ల ప్రాంతాల్లోని బంకులను ఇవాళ సందర్శించి ఇంధన నిల్వలు, సరఫరా పరిస్థితిని పరిశీలించారు. జిల్లాలో సరఫరా సాధారణంగా కొనసాగుతోందని, కొన్నిచోట్ల తాత్కాలిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వెంటనే పరిష్కరిస్తున్నామని తెలిపారు.
ASR: డుంబ్రిగుడ మండలం కండ్రం పంచాయతీ జాకరగూడ గ్రామంలో వి.బి.జి రామ్ గ్రామీణ పథకంలో భాగంగా జలధార జలవిహారి అనే కార్యక్రమం మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పంచాయతీ ప్రత్యేక పరిపాలన అధికారి ఎస్. సుందర్రావు కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ ఎస్. ఆనందరావు, అధికారులు పాల్గొన్నారు.