KDP: చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత కడప గ్రామంలో శనివారం రాత్రి దాడి ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామకృష్ణ తన అనుచరులతో కలిసి ఓబులేశ్ పై విచక్షణారహితంగా దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ దాడిలో ఓబులేశ్ తలకు గాయాలు కావడంతో 108 అంబులెన్స్ ద్వారా కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ELR: ద్వారకాతిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు స్వామి, అమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలుగా అలంకరించారు. ఈసారి సంప్రదాయబద్ధంగా కోలాటాలు, నృత్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ EO వేండ్ర త్రినాథరావు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు.
నంద్యాల ఎన్జీవోస్ కాలనీలో ఆదివారం శక్తి టీం హెడ్ కానిస్టేబుల్ డీఎన్ ప్రసాద్ మహిళలకు శక్తి యాప్‌పై అవగాహన కల్పించారు. ఈ యాప్ మహిళల భద్రతకు ఆయుధంలా ఉపయోగపడుతుందని తెలిపారు. సమస్యల సమయంలో వన్ స్టాప్ సెంటర్ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. మహిళల ఫోన్లలో యాప్ డౌన్లోడ్ చేయించి వినియోగంపై శిక్షణ ఇచ్చారు.
W.G: దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ) పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్‌కు లేఖ రాసింది. ఆదివారం లేఖ ప్రతులను సంఘం జిల్లా నేతలు ఆంజనేయులు, శివరావు భీమవరంలో విడుదల చేశారు. కార్మికులకు కేవలం సన్మానాలు కాకుండా, పదవీ విరమణ ప్రయోజనాలు, సెలవులు కల్పించాలని వారు కోరారు.
చిత్తూరు జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో రేపు జరగనున్న “పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్” కార్యక్రమం జిల్లా ఎస్పీ తుషార్ డూడి, IPS ఆదేశాల మేరకు పాత డీపీవో కార్యాలయం స్థానంలో పలమనేరు డీఎస్పీ కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు నిర్వహించబడుతుంది. జిల్లా ప్రజలు ఈ మార్పును గమనించి, తమ ఫిర్యాదులను నేరుగా పోలీసు అధికారులకు తెలియజేయాలని సూచించారు.
NLR: తమ ఇద్దరు కూతుళ్లు, కొడుకు మీద తమ అమ్మ 60 సెంట్లు భూమి రాసిస్తే తమ అక్క అయినా సీతారావమ్మ 60 సెంట్లు కూడా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆదిశేషమ్మ అనే మహిళ వాపోయారు. ఆమె మాట్లాడుతూ.. బుచ్చి మండల రెవెన్యూ పరిధిలో ఉన్న కావేటి పాలెం పొలంలో తాము వరి నాట్లు వేస్తే రాత్రి పూట తొక్కించేసారని వాపోయారు. వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని వాపోయారు.
PLD: వినుకొండ పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్లో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా నిర్వహించిన నవగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఇవాళ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
కర్నూలు నగర శివార్లలోని గార్గేయపురం డంప్‌యార్డులో కొనసాగుతున్న బయోమైనింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదివారం మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. పనులు ముగిసిన వెంటనే ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. నగర పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలన్నారు.
W.G: నరసాపురం పట్టణంలోని వై ఎన్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన గవర్నింగ్ బాడీ ఎన్నికల్లో ఆదివారం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. అనంతరం ఓటు హక్కు వినియోగించుకున్నారు. విద్యాసంస్థల అభివృద్ధికి గవర్నింగ్ బాడీ ఎన్నికలు ఎంతో కీలకమని తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో మంచి నాయకత్వం ఎంపిక కావడం ద్వారా కళాశాల మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు.
KDP: ఎడ్‌సెట్-27 పరీక్షలు,కౌన్సెలింగ్ జరగకముందే BED కాలేజీలు అక్రమ అడ్మిషన్లు చేస్తున్నాయని AIBSU AP అధ్యక్షుడు జగన్ రాథోడ్ ఆరోపించారు.YVU అధికారుల అవినీతికి నిరసనగా ఆదివారం కడపలోని వేమన విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి ఆందోళన చేపట్టారు. అధికారుల అండతో ఇతర రాష్ట్రాల వారికి రూ.70 వేల నుంచి లక్షకు సీట్లు అమ్ముకుంటూ జిల్లా విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారన్నారు.
KRNL: మంత్రాలయం ఆర్టీసీ బస్టాండ్‌లో వ్యాపారిపై దాడి జరిగింది. టెండర్ ద్వారా షాప్ నిర్వహిస్తున్న పూర్ణచంద్ర వద్దకు రవి అనే వ్యక్తి చేరుకుని, షాప్ తెరవవద్దని బెదిరించినట్లు పూర్ణ చంద్ర తెలిపారు. అనంతరం తనపై దాడి చేసి, షాప్‌లోని వస్తువులను ధ్వంసం చేసి తాళం వేసి వెళ్లిపోయినట్లు బాధితుడు వాపోయారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
GNTR: మంగళగిరిలో జనగణన–2027పై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో 5కే రన్ నిర్వహించారు. మంగళగిరిలోని లోన్ హలో ఇడ్లీ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు రన్ జరిగింది. కమిషనర్ అలీమ్ బాషా మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి జనగణన కీలకమని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయించుకోవాలని పిలుపునిచ్చారు.
ATP: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) సీజన్ 5 వేలంలో అనంతపురం క్రికెటర్ గిరినాథ్ రెడ్డి భారీ ధరకు అమ్ముడయ్యారు. గిరినాథ్ రెడ్డిని సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్టు 8 లక్షల రూపాయలకు దక్కించుకుంది. అనంతపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గిరినాథ్ రెడ్డి ఏపీఎల్ వేలంలో మంచి ధర పలకడంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
VSP: జీవీఎంసీ 48వ వార్డు ఇందిరానగర్-4లో దొంగతనాల నివారణకు ప్రజలు, దాతల సహకారంతో 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మాజీ కార్పొరేటర్ గంకల కవిత అప్పారావు యాదవ్ వాటిని ప్రారంభించి, నేరాల నియంత్రణకు ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. వార్డు అభివృద్ధికి, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు.
NDL: ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. క్యూ లైన్‌లోని భక్తులకు సిబ్బంది అల్పాహారం అందించారు.