• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోండి: ఏఐఎస్ఎఫ్

KRNL: కౌతాళం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో నిర్వహించిన విచారణ తూతూ మంత్రంగానే జరిగిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు యస్. ఈరేష్ ఇవాళ విమర్శించారు. విచారణ పూర్తై రోజులు గడిచినా నివేదికను బయటపెట్టకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే నివేదికను వెల్లడించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

April 8, 2026 / 02:40 PM IST

నరసరావుపేటలో YCP నేతలు నిరసన

PLD: ABN ఆంధ్రజ్యోతి ఛానల్‌లో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నరసరావుపేటలో బుధవారం YCP నేతలు ఆందోళన చేపట్టాయి. ఆంధ్రజ్యోతి తీరును నిరసిస్తూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజల మద్దతుతో ఈ ఉధ్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

April 8, 2026 / 02:30 PM IST

మంత్రి లోకేష్ ప్రజాదర్బార్‌కు వెల్లువెత్తిన వినతులు

GNTR: సమస్యలతో వచ్చిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన 87వ రోజు ప్రజాదర్బార్‌లో ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి భారీగా వినతులు స్వీకరించారు. అందిన వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.

April 8, 2026 / 02:30 PM IST

బాపట్లలో వంతెన పనుల పరిశీలన

BPT: ముత్తాయపాలెం-కప్పలవారిపాలెం మధ్య నూతన వంతెన పనులను ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు బుధవారం పరిశీలించారు. నాగరాజు కాలువపై రూ.14 కోట్లతో దీన్ని నిర్మిస్తున్నారు. పనుల నాణ్యతను ఆయన పరిశీలించారు. వంతెన పూర్తయితే ప్రజల దశాబ్దాల కష్టాలు తీరతాయన్నారు. ప్రయాణ దూరం తగ్గి, ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడతాయని తెలిపారు. గడువులోగా పనులను పూర్తి చేయాలన్నారు.

April 8, 2026 / 02:30 PM IST

‘Operation Mobi Track’ సక్సెస్.. మొబైల్స్ రికవరీ

KDP: ‘Operation Mobi Track’లో భాగంగా కడప పోలీసులు 8వ విడతలో రూ.70 లక్షల విలువైన 505 మొబైల్ ఫోన్‌లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. CEIR పోర్టల్, IMEI ట్రాకింగ్ ద్వారా ఈ ఫోన్‌లను గుర్తించినట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 5877 ఫోన్‌లు రికవరీ చేశారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

April 8, 2026 / 02:26 PM IST

సచివాలయంలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

ATP: అనంతపురం 34వ డివిజన్‌లోని 74వ సచివాలయాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో పది మంది సిబ్బందికి ముగ్గురే ఉండటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీల్డ్ విజిట్‌లో ఉన్న వారికి స్వయంగా ఫోన్ చేసి ఆరా తీశారు. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని, సమయపాలన పాటించాలని సిబ్బందిని ఆదేశించారు.

April 8, 2026 / 02:20 PM IST

అభివృద్ధి పనులను నెల్లూరు కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 23వ డివిజన్ బాబు జగ్జీవన్ రామ్ నగర్ ప్రాంతంలో అధికారులతో కలిసి బుధవారం పర్యటించారు. ఈ మేరకు ఆయన డివిజన్ పరిధిలో నూతనంగా చేపడుతున్న ఇంజనీరింగ్ సివిల్ వర్క్స్ సీసీ రోడ్లు, డ్రైన్ కాలువల నిర్మాణ పనులను పర్యవేక్షించారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

April 8, 2026 / 02:20 PM IST

‘విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు’

VZM: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని బొబ్బిలి ఎంపీడీవో రవికుమార్ హెచ్చరించారు. బుధవారం స్దానిక బుర్జావలస సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మూవ్మెంట్‌ రిజిస్టర్‌ నిర్వహణ చేయాలని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి సూచించారు.

April 8, 2026 / 02:19 PM IST

భవన నిర్మాణ పనులను తనిఖీ చేసిన మంత్రి

VSP: ఎండాడ, సాగర్‌నగర్ ప్రాంతాల్లో జరుగుతున్న భవన నిర్మాణ పనులను మంత్రి వాసంశెట్టి సుభాష్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్మికులతో మాట్లాడి యజమానులు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అలాగే, భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

April 8, 2026 / 02:16 PM IST

ఆంజనేయస్వామి ఆలయ ప్రతిష్ఠ

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి గ్రామంలో నిర్వహించిన ఆంజనేయస్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేకి తీర్థ ప్రసాదలను అందజేశారు.

April 8, 2026 / 02:16 PM IST

‘గాలికుంటు వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి’

SKLM: గాలి కుంటు వ్యాధి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు ఎస్. సూర్యనారాయణ మూర్తి అన్నారు. ఆమదాలవలస మండలం తురకపేట గ్రామాన్ని బుధవారం ఆయన సందర్శించారు. అనంతరం సూర్యనారాయణ మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం నిర్వహిస్తున్న టీకా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

April 8, 2026 / 02:13 PM IST

‘ముగ్గురు డైరెక్టర్లను నియమించాలి’

AKP: ఎలమంచిలిలో బుధవారం తూర్పు కాపు జిల్లా కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాకు ముగ్గురు తూర్పు కాపు డైరెక్టర్లను నియమించాలని సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కరణం శ్రీహరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే, తూర్పు కాపుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు.

April 8, 2026 / 02:11 PM IST

టీడీపీ కార్యకర్త పాడె మోసిన ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్

GNTR: ఫిరంగిపురం మండలం గుండాలపాడు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ మొహమ్మద్ యాకోబ్ మృతిచెందడంతో బుధవారం తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ వారి నివాసానికి వెళ్లి పార్ధివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే పాడె మోసి అంతిమయాత్రలో పాల్గొని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

April 8, 2026 / 02:00 PM IST

పులివెందుల: టీడీపీలోకి చేరికలు

KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం వేముల మండలం పెండ్లూరుకు చెందిన 10 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు రఘునాథరెడ్డి వారికి పార్టీ జెండాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. పులివెందుల నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం బీటెక్ రవి చేస్తున్న కృషికి ఆకర్షితులై పార్టీలో చేరామన్నారు.

April 8, 2026 / 01:54 PM IST

టీడీపీలోకి భారీ చేరికలు

KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం వేముల మండలం పెండ్లూరుకు చెందిన 10 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు రఘునాథరెడ్డి వారికి పార్టీ జెండాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. పులివెందుల నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం బీటెక్ రవి చేస్తున్న కృషికి ఆకర్షితులై పార్టీలో చేరామన్నారు.

April 8, 2026 / 01:54 PM IST