కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ వద్ద ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. గాయపడిన వారిని ఎమ్మిగనూరు నుంచి కర్నూలు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
ప్రకాశం: కంభంలోని స్థానిక ఆదిఅంధ్ర ప్రాధమిక పాఠశాలలో నిర్వహిస్తున్న ఫౌండేషనల్ లర్నింగ్ & స్టడీ మదింపు ప్రక్రియను గురువారం ఎంఈవోలు అబ్దుల్ సత్తార్, శ్రీనివాసులు పరిశీలించారు. 3వ తరగతి విద్యార్థుల అభ్యసన స్థాయిలపై ప్రత్యక్ష అవగాహన పొందడమే లక్ష్యంగా ఉపాధ్యాయులతో మదింపు చేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
NDL: బనగానపల్లె పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఇంటి వద్ద ఇవాళ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఎస్ఆర్‌బీసీ కాలనీలోని కూలిపోయిన దర్గా వద్దకు వెళ్తుండగా బనగానపల్లె పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేశారు.
గుంటూరు నగరంలో ఓ జువెలర్స్ షోరూమ్ ఘనంగా ప్రారంభమైంది. సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆయనతో హీరోయిన్ డింపుల్ హయాతి పాల్గొనగా అభిమానులు భారీగా తరలి వచ్చారు. పలువురు ప్రజాప్రతినిధులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
ATP: జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా MLA కాలవ శ్రీనివాసులు స్వీయ గణన ప్రక్రియలో పాల్గొన్నారు. ఖచ్చితమైన సమాచారం అందిస్తేనే ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హుడికి చేరుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి ప్రణాళికలకు ఈ గణాంకాలే బలమైన పునాది అని వివరించారు. దేశాభివృద్ధికి కీలకమైన ఈ జాతీయ కార్యక్రమంలో ప్రతి కుటుంబం పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
తూ.గో జిల్లాలో సెన్సస్–2027లో భాగంగా స్వీయ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని, వివరాలతో పాటుగా కుటుంబ సభ్యులు వివరాలు కూడా నమోదు చేసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా https://se.census.gov.in పోర్టల్ ద్వారా ఏప్రిల్ 16 నుంచి 30 వరకు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చన్నారు.
NLR: పొదలకూరులో అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా గురువారం మారుతీ నగర్ అగ్నిమాపక సిబ్బంది స్థానిక ప్రజలకు ఎలక్ట్రికల్, గ్యాస్, వల్ల ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా సురక్షితంగా రక్షించుకోవాలి అనే అంశంపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఎండాకాలం చిన్న పిల్లలు బావులు, చెరువుల వద్దకు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
KDP: మైదుకూరు పట్టణ ప్రాంతానికి చెందిన పలువురు యువత వన్యప్రాణుల సంరక్షణ కోసం కృషి చేస్తున్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన యువత అటవీ ప్రాంతానికి వెళ్లి తొట్లను ఏర్పాటు చేసి ద్విచక్ర వాహనాలతో బిందెల ద్వారా నీటిని తెచ్చి మూగజీవాల దాహార్తి తీరుస్తున్నారు. అటవీ అధికారులు చేపట్టాల్సిన పనిని స్వచ్ఛంద సేవకులు చేస్తూ ఉండడం పట్ల పలువురు యువతను అభినందిస్తున్నారు.
ELR: చింతలపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ విభాగంలో 979 మార్కులతో జిల్లాలో రెండవ స్థానంలో నిలిచిన మారుమూడి చరిష్మాను ఎమ్మెల్యే రోషన్ కుమార్ అభినందించారు. ఇవాళ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యార్థిని అభినందించారు. నారా లోకేష్ విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ కళాశాలలు , పాఠశాలలో పెను మార్పులు తీసుకొచ్చారని వివరించారు.
TPT: తిరుపతిలో తెలుగు నాటక రంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి కళాకారులు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం ఛైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. కందుకూరి వీరేశలింగం తన రచనలు, నాటకాల ద్వారా ఆంధ్రులను ప్రగతి పథంలో నడిపించారని కొనియాడారు.
అన్నమయ్య: మదనపల్లె ప్రభుత్వ సర్వ బోధన ఆసుపత్రిలో రోగిని పట్టించుకోలేదనే ఆరోపణలు ఇవాళ చర్చనీయాంశంగా మారాయి. అత్యవసర పరిస్థితిలో రోగిని స్ట్రెచర్‌పై తీసుకువచ్చినా, వైద్య సిబ్బంది స్పందన ఆలస్యమైందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఆసుపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
VZM: ఈనెల 17న విజయనగరంలోని MR కాలేజ్‌లో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీదా ఇవాళ తెలిపారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మేళాలో టాటా ఎలక్ట్రానిక్స్, మెడ్‌ప్లస్, క్వెస్ కార్ప్, అపోలో ఫార్మసీలు సంస్థలు పాల్గొంటాయని వెల్లడించారు. 10వ తరగతి, డిగ్రీ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణులై, 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వాళ్ళు అర్హులని పేర్కొన్నారు.
SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే, PUC ఛైర్మన్ కూన రవికుమార్ అధ్యక్షతన గురువారం వెలగపూడి సచివాలయంలో పీయూసీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన ప్రజా రంగ సంస్థల పనితీరుపై చర్చించారు. అలాగే, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని తెలిపారు.
PPM: సీతానగరం మండలంలోని 35 గ్రామపంచాయతీల నాయకులతో స్థానిక మండల కేంద్రంలో గురువారం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీని తెలుగు గౌరవం కోసం, తెలుగు వారి ఆత్మ అభిమానం కోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. టీడీపీ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమని అన్నారు.
విశాఖలోని శ్రీహరిపురం మార్కెట్ సముదాయం వాకర్స్ జోన్ వద్ద గాలివానకు తాటి చెట్టు నేలకూలింది. చెట్టు ముందు భాగం విరిగి పార్కింగ్‌లో ఉన్న కారుపై పడటంతో వాహనం స్వల్పంగా దెబ్బతింది. ఈ ఘటన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే స్థానికులు స్పందించి చెట్టును తొలగించారు.