• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నకిలీ అధికారిని అరెస్ట్ చేసిన మాచవరం పోలీసులు

NTR: ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఏసీబీ అధికారినంటూ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ అధికారిని మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురానికి చెందిన జయకృష్ణ పలువురు అధికారులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

May 30, 2026 / 08:12 AM IST

నేటితో ముగియున్న జన గణన తొలి దశ

అల్లూరి: జనాభా గణన-2027లో భాగంగా జరుగుతున్న మొదటి దశ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుందని కలెక్టర్ నిశాంతి తెలిపారు. “ఇళ్ల జాబితా, ఇళ్ల గణన” ప్రక్రియ జూన్ నెలతో ముగుస్తుందన్నారు. దీనికి సంబంధించిన ఎన్యుమరేటర్ల క్షేత్ర పర్యటన నేటితో ముగుస్తుందన్నారు. ఇప్పటి వరకు తమ ఇంటి వివరాలు నమోదు చేయించుకోని వారు ఇవాళ్టిలోగా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు.

May 30, 2026 / 08:06 AM IST

పీడీవోను సస్పెండ్ చేసిన కలెక్టర్

CTR: వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లె పంచాయతీ అభివృద్ధి అధికారి బాలసుబ్రహ్మణ్యంను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రిమినల్ కేసు నమోదు చేయాలని అందులో పేర్కొన్నారు. బొమ్మయ్యపల్లె గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారిగా ఉపాధి హామీ పథకంలో రూ.2.75 లక్షలు డ్రా చేసి లబ్దిదారులకు ఇవ్వకుండా దుర్వినియోగం చేయడంతో సస్పెండ్ చేశారు.

May 30, 2026 / 08:04 AM IST

బాధ్యతగా పనిచేస్తే గుర్తింపు ఉంటుంది: ఎమ్మెల్యే

SKLM: ప్రతి ఉద్యోగి బాధ్యతగా పనిచేసినప్పుడు గుర్తింపు తప్పదని ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ అన్నారు. జిల్లా గణంకాల అధికారి H.నాగ భూషణ్ పదవి విరమణ కార్యక్రమంలో శుక్రవారం ఆయన MLA రవికుమార్ పాల్గొన్నారు. ప్రతి ఉద్యోగి పదవిలో ఉన్నంతకాలం ప్రజలకు మంచి సేవలు అందిస్తే ఆ వ్యక్తిని సమాజం ఎప్పుడు గుర్తిస్తుందని తెలిపారు.

May 30, 2026 / 08:03 AM IST

పూడికతీత పనులపై కమిషనర్ కీలక ఆదేశాలు

KRNL: కర్నూలు నగరంలో చేపడుతున్న పూడికతీత పనులను నాణ్యంగా, గడువులోపు పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. ఏ.క్యాంపు, బి.క్యాంపు, గణేష్‌నగర్ ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం డ్రైన్లు, పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. డ్రైన్ల కింది భాగం వరకు పూడికలు తొలగించకపోతే బిల్లులు మంజూరు చేయొద్దని అధికారులకు స్పష్టం చేశారు.

May 30, 2026 / 08:00 AM IST

బెదిరించి నగదు కాజేసిన దుండగులు

ప్రకాశం: ఒంగోలు(M)పెళ్లూరు సమీపంలో శనివారం తెల్లవారుజామున ఓ లారీ డ్రైవర్‌ని గుర్తు తెలియని ఇద్దరు అగాంతకులు బెదిరించారు. చెన్నైకి వెళ్తున్న సమయంలో మూత్రం పోసేందుకు లారీని డ్రైవర్ సెల్వరాజ్ రోడ్డు పక్కన ఆపాడు. అదే సమయంలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు బెదిరించి రూ.2000 నగదుని మొబైల్ ఫోన్‌ను డ్రైవర్ వద్ద తీసుకొని పరారయ్యారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసారు.

May 30, 2026 / 08:00 AM IST

ఏపీటీడీసీ అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలి

NTR: విజయవాడ బెరమ్ పార్క్‌లో ఏపీటీడీసీ ఛైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసి, పర్యాటకులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు. పెండింగ్ ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సంస్థ ఎండీ పద్మావతి, ఈడీ మేక శేషగిరి, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

May 30, 2026 / 07:59 AM IST

ప్రభుత్వ బడుల్లో మెరుగైన విద్య: డీఈవో

ELR: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన అందుతోందని డీఈవో ఎం. వెంకటలక్ష్మమ్మ అన్నారు. నిడమర్రులో శుక్రవారం మన పాఠశాల-మన అందరి బాధ్యత ఎన్రోల్మెంట్ డ్రైవ్లో ఆమె పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చిన నలుగురు విద్యార్థులను ప్రభుత్వ బడిలో చేర్పించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లోని వసతులను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

May 30, 2026 / 07:54 AM IST

మహిళల భద్రత కోసం ‘ఆపరేషన్ దండాయన’: ఎస్పీ

NDL: జిల్లాలో మహిళల భద్రత కోసం ‘ఆపరేషన్ దండాయన’ కార్యక్రమం ప్రారంభించినట్లు శుక్రవారం ఎస్పీ సునీల్ తెలిపారు. నేరస్థులకు త్వరితగతిన శిక్షలు, 60 రోజుల్లో ఛార్జిషీట్ల దాఖలు, జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు దీనిలో భాగమని వెల్లడించారు. మహిళలపై నేరాలకు జీరో టాలెరెన్స్ పాలసీ తీసుకొస్తామని, స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ సిస్టమ్‌తో పర్యవేక్షిస్తామన్నారు.

May 30, 2026 / 07:43 AM IST

సబ్‌జూనియర్ ఫుట్‌బాల్ జట్ల ఎంపిక

SS: ఈనెల 31న హిందూపురం ఎంజీఎం క్రీడా మైదానంలో జిల్లా ఫుట్‌బాల్ సబ్‌జూనియర్ జట్ల ఎంపిక జరుగుతుందని జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జేవీ అనిల్‌కుమార్ తెలిపారు. ఈ ఎంపికలకు వచ్చే క్రీడాకారులు తమ అన్ని ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని సూచించారు. ఇతర పూర్తి వివరాల కోసం క్రీడాకారులు 8099598958 నంబరును సంప్రదించాలని కోరారు.

May 30, 2026 / 07:35 AM IST

‘శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేశారు’

PPM: జిల్లాలోని పార్వతీపురం మండలం మడకవాని వలస గ్రామానికి చెందిన శ్మాశాన వాటిక ఆక్రమణపై అధికారులు విచారణ చేపట్టాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జి బత్తిన మోహన రావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్ వద్ద ఫిర్యాదు దస్త్రాన్ని ప్రదర్శించారు. మరుభూమి విస్తీర్ణం ఏటా తగ్గుతోందని, అటు వైపు వెళ్లే రహదారిని కూడా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.

May 30, 2026 / 07:34 AM IST

మహిళల భద్రతకు ‘ఆపరేషన్ దండయాన’: ఎస్పీ

PLD: మహిళలు, చిన్నారులపై నేరాల అదుపునకు జిల్లాలో ‘ఆపరేషన్ దండయాన’ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కృష్ణారావు తెలిపారు. ఇందులో భాగంగా వేలాది అవగాహన సదస్సులు నిర్వహించామని, గల్లంతైన 190 మంది బాలికలను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించామని చెప్పారు. పాత నేరస్థులపై నిఘా ఉంచామన్న ఎస్పీ.. ఆపదలో ఉన్నవారు 112, 181, 1098 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని కోరారు.

May 30, 2026 / 07:30 AM IST

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

కర్నూలు-దూపాడు రైలుమార్గంలో కార్‌బైడ్ ఫ్యాక్టరీ సమీపంలో ఇవాళ ఒక గుర్తుతెలియని వ్యక్తి వందేభారత్ ఎక్స్ ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రమాదంలో మృతదేహం తీవ్రంగా ఛిద్రమై గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. మృతుడి వయసు సుమారు 45 ఏళ్లు ఉండవచ్చని, తెలుపు గీతల షర్టు, నీలం రంగు లోయర్, తెలుపు కట్ బనియన్, నలుపు కట్ డ్రాయర్ ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు.

May 30, 2026 / 07:29 AM IST

ఈ రైళ్లు తాత్కాలిక రద్దు

ATP: గుంతకల్లు డివిజన్ పరిధిలో పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గుంతకల్లు-బోధన్ రైలు ఈ నెల 30, 31 తేదీల్లో రద్దయింది. అలాగే గుంతకల్లు-మార్కాపురం రైలును ఈ నెల 31, జూన్ 1 తేదీల్లో నిలిపివేశారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని కోరారు.

May 30, 2026 / 07:26 AM IST

‘స్కాన్ చేసిన ప్రతి కేసును ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో పొందుపరచాలి’

విజయనగరం: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు స్కాన్ కేంద్రాలు నడుపుతున్న వారు స్కాన్ చేసిన ప్రతి కేసును ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో పొందుపరచాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఈ నెలలో స్కాన్ చేయని నిల్ రిపోర్టును డీఎంహెచ్ఓ కార్యాలయానికి పంపాలని అన్నారు. కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టం అమలుపై సమీక్షించారు.

May 30, 2026 / 07:22 AM IST