• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘ఇంధన కొరతతో రైతులకు ఇబ్బంది పడుతున్నారు’

BPT: ఆంధ్రప్రదేశ్‌లో గత మూడు రోజులుగా తీవ్రమైన డీజిల్ కొరత నెలకొందని, దీనివల్ల అంబులెన్స్‌లు, రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అద్దంకి వైసీపీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి డీజిల్ కొరతను తీర్చాలని డిమాండ్ చేశారు లేదంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారన్నారు.

April 28, 2026 / 07:14 AM IST

కానిస్టేబుల్ కుటుంబానికి పోలీసు శాఖ ఆర్థిక సాయం

తూ.గో: మరణించిన కానిస్టేబుల్ వెల్లా ప్రసాద్ కుటుంబానికి జిల్లా పోలీసులు అండగా నిలిచారు. ఎస్పీ డి. నరసింహ కిషోర్ రూ. లక్ష అంత్యక్రియల కోసం, వెల్ఫేర్ ఫండ్ నుండి రూ. 25 వేలు అందజేశారు. 2012 బ్యాచ్ కానిస్టేబుళ్లు రూ. 4.04 లక్షలు సేకరించి కుటుంబానికి అందించారు. క్లిష్ట సమయంలో సహచర సిబ్బంది చూపిన ఈ మానవత్వం ఆ కుటుంబానికి కొండంత భరోసాను ఇచ్చింది.

April 28, 2026 / 07:14 AM IST

షటిల్ బ్యాట్మెంటన్‌లో శిక్షణ తరగతులు

SKLM: పాతపట్నంలో షటిల్ బ్యాడ్మింటన్‌లో బుధవారం నుండి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక ఇండోర్ స్టేడియంలో శిక్షణ ఇస్తామని ఆసక్తి ఉన్న వారు హాజరు కావాలని నిర్వాహకుడు మడ్డు ప్రకాశ్ తెలిపారు. వివరాలకు 9603306440, 95154 51440 నంబర్లను సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

April 28, 2026 / 07:12 AM IST

రైతులకు ఊరట.. రైతుకి 70 లీటర్లు డీజిల్ పంపిణీ

కాకినాడ: సామర్లకోట రైల్వే స్టేషన్ సెంటర్ వద్ద గల భారత్ పెట్రోలియం బంకులో సోమవారం సాయంత్రం రైతులకు ప్రత్యేకంగా డీజిల్ పంపిణీ చేశారు. ఆటోలకు, రైతులకు టోకెన్లు ఇచ్చి క్యూ పద్ధతిలో ఇంధనం అందజేశారు. ప్రతి రైతుకు 70 లీటర్ల డీజిల్ పరిమితి విధించారు. పెట్రోల్ స్టాక్ రావాల్సి ఉందని నిర్వాహకులు తెలిపారు. పంపిణీ సజావుగా సాగేందుకు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

April 28, 2026 / 07:10 AM IST

డీజిల్, పెట్రోల్ పై వదంతులు నమ్మవద్దు: కలెక్టర్

VZM: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉన్నట్లుగా వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సోమవారం తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరం పీజీఆర్ఎస్ సమీక్షా సమావేశంలో భాగంగా జిల్లాలో ఇంధన సరఫరా పరిస్థితిపై ఆయన సమీక్షించారు. జిల్లాలో మొత్తం 134 పెట్రోల్ బంకులు ఉండగా, అందులో నాలుగు బంకులు తాత్కాలికంగా మూసివేసినట్లు చెప్పారు.

April 28, 2026 / 07:09 AM IST

సింధు విజయ్‌ను పరిశీలించిన నాగాలాండ్‌ సీఎం

VSP: నాగాలాండ్ ముఖ్యమంత్రి నేయిఫియు రియూ తన విశాఖపట్నం పర్యటనలో భాగంగా నావల్ డాక్ యార్డ్‌ను సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన భారత నౌకాదళానికి చెందిన ప్రతిష్టాత్మక జలాంతర్గామి ఐఎన్‌ఎస్ సింధు విజయ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా జలాంతర్గామి కమాండింగ్ ఆఫీసర్ నిశాంత్ చతుర్వేది ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికారు.

April 28, 2026 / 07:08 AM IST

టీడీపీతోనే బీసీలకు రాజకీయ గుర్తింపు: ఎంపీ అంబికా

ATP: టీడీపీ పార్టీ ఆవిర్భావంతోనే బీసీలకు రాజకీయంగా నిజమైన న్యాయం జరిగిందని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ హయాం నుంచి నేటి చంద్రబాబు ప్రభుత్వం వరకు బీసీలకు చట్టసభల్లో, పదవుల్లో పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీ నాయకులను అక్రమ కేసులతో వేధించిందని విమర్శించారు.

April 28, 2026 / 07:08 AM IST

మే 1 నుండి వేసవి క్రీడా శిక్షణ తరగతులు

PPM: మే 1 నుండి నెలరోజుల పాటు వేసవి క్రీడా శిక్షణా తరగతులను నిర్వహించడం జరుగుతుందని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి డా,శ్రీధరరావు సోమవారం తెలిపారు. ఏపి క్రీడా పాధికారి సంస్థ, కలెక్టర్ డా,ప్రభాకరరెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న 65 కేంద్రాలలో 21 నిష్ణాతులు, సీనియర్ క్రీడాకారులు, జాతీయస్థాయి క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులచే శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.

April 28, 2026 / 07:06 AM IST

ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపుకు గడువు పెంపు

AKP: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపుకు గడువు ఈనెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ఇంటర్ అధికారి వినోద్ బాబు సోమవారం ఓ ప్రకటనలో పెర్కొన్నారు. ఇప్పటివరకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

April 28, 2026 / 07:06 AM IST

కదిరి ప్రజలకు ముఖ్య గమనిక

సత్యసాయి: కదిరిలో ఇవాళ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాధ హోటల్ ముందు ఉన్న మున్సిపల్ పాత హైస్కూల్ భవనం కూల్చివేత చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ వాహనాలను బైపాస్ మార్గంలో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. చిన్న వాహనాలకు కోనేరు-శివాలయం, తేరు-హిందూపురం క్రాస్ మార్గంలో అనుమతి ఇచ్చారు. ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు.

April 28, 2026 / 07:04 AM IST

రేపు ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశం

ASR: అనంతగిరి మండల పరిషత్తు కార్యాలయంలో సర్వసభ్య సమావేశం బుధవారం జరగనున్నట్లు మండల పరిషత్ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీపీ మిత్తుల అధ్యక్షతన జరిగే సమావేశానికి ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, ఆయా శాఖల అధికారులు హాజరుకావాలని ఎంపీడీవో కోరారు. అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలని సూచించారు.

April 28, 2026 / 07:01 AM IST

జిల్లాలో తొమ్మిది రోజులకు సరిపడా ఇంధనం: కలెక్టర్

KRNL: జిల్లాలో తొమ్మిది రోజులకు సరిపడా పెట్రోల్, ఆరు రోజులకు అవసరమైన డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి వెల్లడించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌తో కలిసి సోమవారం సాయంత్రం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. వాహనాల ఇంధన వినియోగంపై కొన్ని పరిమితులు విధించినట్లు స్పష్టం చేశారు.

April 28, 2026 / 06:57 AM IST

చెరువులకు కృష్ణా జలాల విడుదల

సత్యసాయి: రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పుట్టపర్తి MLA పల్లె సింధూర రెడ్డి తెలిపారు. ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ విజ్ఞప్తి మేరకు సోమవారం మారాల రిజర్వాయర్ నుంచి జిల్లేడుబండ, గుంజేపల్లి చెరువులకు నీటిని విడుదల చేశారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వేసవిలోనూ సాగునీరు అందించడం తమ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.

April 28, 2026 / 06:52 AM IST

GVRను అభినందించిన కూటమి నాయకులు

NTR: విస్సన్నపేట మండలం పుట్రేల శివారు వీరరాఘవపురం గ్రామ వాస్తవ్యులు గాదే వెంకటేశ్వరరావు (GVR) సామాజిక సేవ అంశంలో తమిళనాడు ఆసియా ఇంటర్నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అవార్డును పొందారు. ఈ సందర్భంగా విస్సన్నపేటలో కూటమి నాయకులు ఆయనను శాలువాతో అభినందించి సత్కరించారు. అనంతరం సామాజిక సేవలో మరింత ముందుకు కొనసాగాలని ఆకాంక్షించారు.

April 28, 2026 / 06:49 AM IST

ప్రమాణస్వీకార మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ELR: కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కైకలూరులోని మార్కెర్ యార్డు కమిటీ ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ఈ ప్రమాణస్వీకారోత్సవంలో ముఖ్య అతిధులుగా ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు బడేటి చంటి పాల్గొన్నారు. అనంతరం మార్కెట్ యార్డు నూతన పాలకవర్గంగా ప్రమాణస్వీకారం చేసిన ఛైర్మన్‌‌కి, డైరెక్టర్లందరికీ అభినందనలు తెలిపారు.

April 28, 2026 / 06:45 AM IST