ELR: TDP రాష్ట్ర అధికార ప్రతినిధిగా దాసరి శ్యాంచంద్ర శేషు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన శేషు క్రమంగా తన కృషి, పట్టుదలతో ఎదుగుతూ పార్టీలో కీలక స్థాయికి చేరుకున్నారు.పేద కుటుంబం నుంచి వచ్చి ఈరోజు రాష్ట్ర స్థాయి పదవిని అందుకోవడం ఆనందంగా ఉందని ఆయన అభిమానులు పేర్కొన్నారు.
ELR: గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ రథం’ కార్యక్రమాన్ని ఫాతిమాపురం గ్రామంలో బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువత, మహిళా సంఘాల సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
అన్నమయ్య: పీలేరులో అక్సా మసీదులో గురువారం ఉదయం 6 గంటల నుంచి ఉచిత ఖత్నా శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పిల్లలకు మందులు, పౌష్టిక ఆహారం ఉచితంగా అందజేస్తారు. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో శిబిరం నిర్వహించబడుతుందని తెలిపారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
NDL: వి.కోటలో ABN ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డి హత్యపై బుధవారం జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. బాధిత కుటుంబానికి పరిహారం, ఒకరికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
W.G: నరసాపురం మండలం సీతారాంపురంలో బుధవారం తెల్లవారుజామున రొయ్యల సీడ్ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. కాకినాడ నుంచి మొగల్తూరు వెళ్తున్న వ్యాన్.. సీతారాంపురం శివారులో రోడ్డు పక్కకు దూసుకెళ్లి పల్టీ కొట్టిందని గ్రామస్థులు తెలిపారు. ఈ ప్రమాదంలో లక్షలాది రూపాయల విలువైన రొయ్యల పిల్లలు నేలపాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది
SKLM: కంచిలి (M) కొక్కిలి పుట్టుగలో సుమారు 142 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ కంచిలి మండలం అధ్యక్షులు మాదిన రామారావు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఐటీడీపీ మండల అధ్యక్షులు వి.రమేష్ రెడ్డి ఉన్నారు
NDL: పట్టణంలోని 39వ వార్డు భైర్మల్ స్ట్రీట్లో ఇవాళ ఉదయం పాత భవనం మరమ్మతుల సమయంలో స్లాబ్ కూలి ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు కార్మికులు గాయపడగా, ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ సంఘటన స్థలాన్ని సందర్శించి, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
ELR: గ్రంధాలయాలు వేసవిలో విద్యార్థులకు మంచి వినోదాన్ని విజ్ఞానాన్ని అందించే విడిది కేంద్రాలని ఎంఈఓ- 2 రాములు అన్నారు. బుధవారం సాయంత్రం గ్రంథాలయంలో పశ్చిమాసియా యుద్ధాలు, భారతదేశం అనుసరిస్తున్న తీరుపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామన్నారు. వేసవికాలంలో విద్యార్థులు గ్రంథాలయాలను ఉపయోగించుకుని వాటి ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
VSP: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆర్ఎస్డీపీ అప్పల నరసింహరాజు పార్థీవ దేహానికి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బుధవారం ఉదయం పద్మనాభం మండలం పాండ్రంగిలో నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడుతూ నిజాయతీ రాజకీయాలకు ప్రతీకగా నిలిచారని అన్నారు. కుమారుడు పృధ్వీతో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.
ATP: జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వడ్డే వెంకట్ బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొన్న ఆయనకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, అందరికీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు లభించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
SS: ధర్మవరం అగ్నిమాపక కేంద్రానికి అందిన నూతన అడ్వాన్స్ వాటర్ టెండర్ వాహనాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. సుమారు రూ.74.75 లక్షల వ్యయంతో ఏర్పాటైన ఈ వాహనం 5,000 లీటర్ల నీటి సామర్థ్యం కలిగి ఉంది. అత్యాధునిక రెస్క్యూ, భద్రత పరికరాలతో ఇది అందుబాటులోకి వచ్చింది. అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ఈ వాహనం ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు.
ప్రకాశం: ఒంగోలులోని పెర్నమిట్టలో ఘరానా చోరీ జరిగింది. మంగళవారం అర్ధరాత్రి శ్రీనివాసులు ఇంటిలో దొంగలు ప్రవేశించి 4 గ్రాముల బంగారం రూ.10 వేలు నగదుతో పాటు ఇంటి ముందు ఉన్న నీటి మోటార్నీ దొంగలు అపహరించి తీసుకువెళ్లారు. పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్లిన శ్రీనివాసులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
BPT: కారంచేడు పెట్రోల్ బంకులను తహసీల్దార్ నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిల్వలు పరిశీలించి సరఫరా అంతరాయం లేకుండా చూడాలని సిబ్బందికి ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న అపోహలను నమ్మవద్దని, అవసరమైనంత మాత్రమే ఇంధనం తీసుకోవాలని వాహనదారులకు సూచించారు. ఈ తనిఖీలలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
TPT: వెంకటగిరి పట్టణంలోని రాజా ప్యాలెస్లో ఉన్న యువరాజు సర్వజ్ఞ కుమార కృష్ణ యాచేంద్రకు హనుమాన్ శోభాయాత్ర ఆహ్వాన పత్రికను హిందూ పరిషత్ సభ్యులు రామకృష్ణ అందించారు. హనుమాన్ శోభాయాత్రపై పలు విషయాలను వివరించారు. అనంతరం హనుమాన్ శాశ్వత ఉత్సవ విగ్రహాన్ని ఇస్తానని యువరాజు హామీ ఇవ్వడంతో పాటు హనుమాన్ స్వామి కృప ప్రజలందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నానన్నారు.
CTR: వీ.కోటలో హత్యకు గురైన జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సతీమణి రేణుకా రెడ్డి పరామర్శించారు. కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఘటనలో గాయపడిన మరో విలేఖరి మణిని కూడా ఆమె పరామర్శించారు. ఈ సంతాప కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు రాంబాబు, రంగనాథ్, ధీరజ్, నారాయణ స్వామి, మురుగేష్, శభరీష్, హరి తదితరులు పాల్గొన్నారు.