• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కొడమంచిలిలో ప్రత్యేక అధికారికి ఫిర్యాదు..!

W.G: ఆచంట మండలం కొడమంచిలి పంచాయతీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన సోమేశ్వరరావును మంగళవారం కూటమి నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను ఆయనకు వివరించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపాలని నాయకులు కోరారు. స్పందించిన అధికారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

April 7, 2026 / 03:41 PM IST

ఆలయ పనుల పురోగతిపై సమీక్షించిన ఎమ్మెల్యే

CTR: పలమనేరు శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ పునరుద్ధరణ పనుల పురోగతిపై ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి మంగళవారం అధికారులు, అర్చకులతో పాటు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ గోపుర పనులు ఎంతవరకు వచ్చాయని ఈవో రమణారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. శివాలయ గర్భగుడి పునర్నిర్మాణానికి చేపడుతున్న చర్యలపై క్షుణ్ణంగా పరిశీలించారు.

April 7, 2026 / 03:38 PM IST

‘ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు అమలు చేయాలి’

అన్నమయ్య: రాష్ట్రంలో పెరుగుతున్న బస్సు ప్రమాదాలపై హోంమంత్రి వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సమగ్ర సమీక్ష జరిగింది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రమాదాల కారణాలు, రోడ్డు భద్రతా చర్యలపై ఉన్నతాధికారులతో చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు అమలు చేయాలని నిర్ణయించారు.

April 7, 2026 / 03:37 PM IST

రేషన్ దుకాణాలు పరిశీలించిన తాహసీల్దార్

ELR: లింగపాలెం మండల MRO నజిముల్లషా మంగళవారం ఒకటవ నెంబర్ రేషన్ షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ రేషన్ షాపులో ఇచ్చే బియ్యాన్ని గర్భిణీ స్త్రీలు కూడా తినవచ్చని దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయన్నారు. కార్డుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని డీలర్లకు వివరించారు. అనంతరం స్టాక్ రిజిస్టర్లు పరిశీలించి పలు సూచనలు చేశారు.

April 7, 2026 / 03:34 PM IST

గంగమ్మ జాతరల ఏర్పాట్లపై కలెక్టర్‌తో సమావేశం

TPT: గంగమ్మ జాతరల నెల ప్రారంభం కానుండటంతో తిరుపతి తాతయ్య గంగమ్మ ఆలయ బోర్డు ఛైర్మన్, అర్చకులు, అధికారులు జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జాతరల నిర్వహణ, భక్తులకు సౌకర్యాల ఏర్పాటుపై చర్చించారు. జాతరల సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

April 7, 2026 / 03:31 PM IST

సిరివెళ్లలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

NDL: సిరివెళ్ల PHC మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించినట్లు డాక్టర్ ముఖేష్ కుమార్ తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, మనిషికి ఎన్ని సిరి సంపదలు ఉన్నా వాటిని అనుభవించడానికి ఆరోగ్యం లేకపోతే అవన్నీ వృథా అని పేర్కొన్నారు. చేతులను శుభ్రంగా కడుక్కోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల అంటువ్యాధులు దరి చేరవని స్పష్టం చేశారు.

April 7, 2026 / 03:23 PM IST

పేద ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలి: ఎమ్మెల్యే

సత్యసాయి: కదిరి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, వసతులపై అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వహించకూడదని అధికారులను ఆదేశించారు. పేద ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

April 7, 2026 / 03:20 PM IST

కార్యకర్త భౌతిక కాయానికి ఎమ్మెల్యే నివాళులు

CTR: గుడిపాల మండలం దాయంవారి పల్లెలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త చల్లా గురుస్వామి నాయుడు ఇవాళ మృతి చెందాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, జీజేఎం ఫౌండేషన్ డైరెక్టర్ గురజాల చెన్నకేశవుల నాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

April 7, 2026 / 03:17 PM IST

మిగులు సీట్లకు దరఖాస్తులు ఆహ్వానం

PPM: గుమ్మలక్ష్మీపురం ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలో మిగులు సీట్లకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీవీర్ సింగ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను 7వ తరగతికి ఒక సీటు (బాలిక), 8, 9వ తరగతులకు ఒక్కో సీటు (బాలురు) ఎస్టీ విద్యార్థుల నుంచి కోరుతున్నామన్నారు. దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో ఈనెల 5 నుంచి 10వ తేదీ వరకు స్వీకరిస్తున్నామన్నారు.

April 7, 2026 / 03:15 PM IST

గ్రంథాలయాల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి

ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయాల స్థితిగతులు, బకాయిల పరిష్కారం కోసం ఛైర్మన్ వన్నెం రెడ్డి సతీష్ కుమార్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ను మంగళవారం కలిశారు. గ్రంథాలయాల అభివృద్ధికి అవసరమైన చర్యలపై వినతి పత్రం అందజేశారు. ప్రైవేట్ భవనాల్లో ఉన్న గ్రంథాలయాలకు శాశ్వత భవనాలు, డిజిటల్ సదుపాయాలు కల్పించాలని కోరారు.

April 7, 2026 / 03:13 PM IST

పశువైద్యశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏడి

NDL: బండి ఆత్మకూరు మండలంలోని ఏ.కోడూరు, పార్నపల్లె, బండి ఆత్మకూరు పశు వైద్యశాలలను వెలుగోడు సబ్ డివిజన్ పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్. వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ చేశారు. పశువైద్యశాలలో రిజిస్టర్లను, మందులను పరిశీలించారు. గాలికుంటు వ్యాధి టీకాల ప్రగతిని సమీక్షించారు. వైద్యులకు పలు సూచనలు చేశారు. వారితో పాటు మండల పశు వైద్యులు పాల్గొన్నారు.

April 7, 2026 / 03:13 PM IST

‘తక్షణమే జీవోను రద్దు చేయాలి’

VZM: పంచాయతీ కార్యదర్శుల పే స్కేల్‌ను తగ్గించే జీవో 60ను తక్షణమే ప్రభుత్వం రద్దు చేయాలని పంచాయతీ అభివృద్ధి అధికారుల సంఘం అధ్యక్షులు మంత్రి రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం గజపతినగరం మండల పరిషత్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అధిక పని ఒత్తిడితో విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఈ విధమైన జీవో తమకు తీవ్ర నిరాశను కలిగిస్తుందన్నారు.

April 7, 2026 / 03:11 PM IST

అన్న క్యాంటీన్‌ను సందర్శించిన టీడీపీ నేత

AKP: ఎలమంచిలి పట్టణం అన్న క్యాంటీన్‌ను మంగళవారం నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా భోజన సౌకర్యంపై ఆరా తీశారు. ఎలమంచిలి నియోజకవర్గంలో మరో అన్న క్యాంటీన్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఐదు రూపాయలకే పేద ప్రజలకు భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

April 7, 2026 / 03:11 PM IST

‘అమరావతి ఐదు కోట్ల ఆంధ్రుల ఊపిరి’

KRNL: రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దోచుకున్నారని కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. మంగళవారం కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రధాని మోదీ అమరావతికి పూర్తి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. అమరావతి ఐదు కోట్ల ఆంధ్రుల ఊపిరి అన్నారు.

April 7, 2026 / 03:11 PM IST

గుంతకల్లు మీదుగా పలు రైళ్లు రద్దు

ATP: హైదరాబాద్ డివిజన్ పరిధిలో జరుగుతున్న డబ్లింగ్ పనుల వల్ల గుంతకల్లు నుంచి నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 10 నుంచి 19 వరకు గుంతకల్లు – బోధన్ (57411), కాచిగూడ – గుంతకల్లు (57412) రైళ్లు నిలిచిపోనున్నాయి. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.

April 7, 2026 / 03:10 PM IST