• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కొండపి నూతన ఎస్సైగా త్యాగరాజు బాధ్యతలు

ప్రకాశం: కొండపి పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా గురువారం త్యాగరాజు బాధ్యతలుచేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతలకు విగాతం కలగకుండా చూస్తానన్నారు. ప్రధానంగా మత్తు పదార్థాలు, పేకాటపై దృష్టి సారిస్తానన్నారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

April 9, 2026 / 01:10 PM IST

రోడ్లు, డ్రైనేజీలు పాడైపోవడంతో మంత్రి ఆగ్రహం

కృష్ణా: మచిలీపట్నం మండలం లక్ష్మీపురం గ్రామంలో మంత్రి కొల్లు రవీంద్ర గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు పాడైపోవడంతో మంత్రి ఆసహనం వ్యక్తం చేశారు. శానిటేషన్ విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. గ్రామంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

April 9, 2026 / 01:10 PM IST

రాధాకృష్ణపై ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే

KRNL: ఏబీఎన్ రాధాకృష్ణపై మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి పత్తికొండ పోలీస్ స్టేషన్‌లో ఇవాళ ఫిర్యాదు చేశారు. వైసీపీ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఆయనపై కేసు నమోదు చేయాలని సీఐ జయన్నను కోరారు. కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే చర్యలను సహించబోమని హెచ్చరించారు.

April 9, 2026 / 01:00 PM IST

ఎస్సీ, ఎస్టీల వారికి ఉచితంగా సోలార్ యూనిట్లు..!

KDP: మైదుకూరు విద్యుత్ డివిజన్ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ఉచితంగా సోలార్ యూనిట్లు ప్రభుత్వ మంజూరు చేస్తుంది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం తీసుకొని, విద్యుత్ బిల్లుల భారమును తగ్గించుకోవాలని ఏపీ ఎస్పీ డీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లక్ష్మీపతి తెలిపారు. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి మాత్రమే ఈ అవకాశం ఉందన్నారు.

April 9, 2026 / 01:00 PM IST

డిప్యూటీ సీఎం‌ను కలిసిన వన్నెంరెడ్డి

VSP: ఉమ్మడి విశాఖ జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి, నిధుల విడుదలపై జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు వన్నెంరెడ్డి సతీశ్ కుమార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిశారు. గురువారం వినతిపత్రం సమర్పిస్తూ రూ.30 కోట్ల గ్రాంట్లు, స్థానిక సంస్థల నుంచి బకాయిలు విడుదల చేయాలని కోరారు. అనంతరం ఆయనకు సిబ్బంది కొరత, అద్దె భవన సమస్యలపై వివరించారు.

April 9, 2026 / 12:45 PM IST

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలసిన ఎస్వీ దంపతులు

KRNL: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. జిల్లాలో పార్టీ కార్యకలాపాలను మరింత చురుకుగా నిర్వహించాలని జగన్ సూచించినట్లు తెలిపారు.

April 9, 2026 / 12:45 PM IST

గుమ్మలక్ష్మిపురంలో నిరసన చేపట్టిన ఎస్ఎఫ్ఐ

గుమ్మలక్ష్మిపురంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని స్మార్ట్ కిచెన్ పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించవద్దని ఎస్ఎఫ్ఐ నిరసన తెలిపింది. స్థానిక పోస్టుమెట్రిక్ బాలుర వసతి గృహంలో జరిగిన కార్యక్రమంలో మండల కార్యదర్శి గంగారావు మాట్లాడుతూ.. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులకు వేడి ఆహారం అందకపోవడంతో పాటు వంట కార్మికులు ఉపాధి కోల్పోతారని అన్నారు.

April 9, 2026 / 12:43 PM IST

సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత: ఎస్పీ

BPT: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామంలో ఇవాళ పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ గురువారం భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగేందుకు సిద్ధం చేసిన హెలిప్యాడ్ ప్రాంతాన్ని, అలాగే సీఎం కాన్వాయ్ ప్రయాణించే మార్గాన్ని ఎస్పీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

April 9, 2026 / 12:40 PM IST

వెల్దుర్తి కానిస్టేబుల్‌కు ఎమ్మెల్యే నివాళులు

PLD: వెల్దుర్తి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సభావత్ వెంకట్ నాయక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సందర్భంగా మాచర్ల మండలం అచ్చమ్మకుంట తండాలో ఆయన భౌతిక కాయాన్ని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

April 9, 2026 / 12:37 PM IST

చందనోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

విశాఖలో జరగనున్న చందనోత్సవానికి సంబంధించి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ పరిశీలించారు. గురువారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సమీక్షలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. భద్రత, తాగునీరు, రవాణా, పారిశుధ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

April 9, 2026 / 12:34 PM IST

విశాఖలో ABN రాధాకృష్ణపై ఫిర్యాదు

VSP: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై అభ్యంతరకర వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో విశాఖలో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం 4వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో సీఐకి ఫిర్యాదు అందజేశారు. విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె రాజు ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.

April 9, 2026 / 12:30 PM IST

ఎల్.ఎల్.సీ కాలువలో చెత్తాచెదారం తొలగింపు

KRNL: పెద్దకడబూరు మండలంలోని మేకడోణ, నౌలేకల్ గ్రామ శివారుల్లో ఎల్.ఎల్.సీ కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ఇరిగేషన్ శాఖ జేఈ సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం జేసీబీ ద్వారా తొలగించారు. కాలువలో ఆకులు, చెత్తాచెదారంతో నిండుకొనిపోయి అపరిశుభ్రంగా మారడంతో స్పందించిన ఇరిగేషన్ శాఖ ఎల్.ఎల్.సీ పరిశుభ్రతకు శ్రీకారం చుట్టింది.

April 9, 2026 / 12:30 PM IST

ఆకివీడు పెదపేటలో పోలీస్ పికెట్

W.G: ఆకివీడు పెదపేటలో గురువారం పోలీస్ పికెట్ కొనసాగుతోంది. SI హనుమంతు నాగరాజు పర్యవేక్షణలో రామాలయం వద్ద 12 మంది Slలు, ASIలు, కానిస్టేబుళ్లతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆకివీడులో 144 సెక్షన్ అమలులో ఉందని, పరిస్థితి ప్రశాంతంగా ఉన్నందున ఎవరూ ఆందోళన చెందవద్దని SI తెలిపారు. ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

April 9, 2026 / 12:30 PM IST

‘అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి’

VSP: భారతీయ జనతా పార్టీ 46సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు అధ్యక్షతన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఆర్కేబీచ్ వద్ద జరిగింది. విశాఖలో ప్రతి వార్డులోనూ బీజేపీ జెండా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు.

April 9, 2026 / 12:24 PM IST

పుంగనూరు పోలీసులకు YCP నాయకుల ఫిర్యాదు

CTR: మహిళలను కించపరిచేలా వార్తలు రాయడం సరికాదని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. పుంగనూరు సీఐ సుబ్బారాయుడుకు గురువారం ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులు మాట్లాడుతూ.. మహిళల పట్ల ఓ పత్రికాధినేత చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించే వారిపై చట్ట ప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

April 9, 2026 / 12:17 PM IST