• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మెనూ పాటించకపోతే చర్యలు: కలెక్టర్

PPM: మధ్యాహ్న భోజన పథకంలో ప్రభుత్వం నిర్ణయించిన మెనూను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి హెచ్చరించారు. సాలూరు మున్సిపల్ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, ఆహార నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించారు. లోపాలు ఉంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

April 7, 2026 / 05:14 PM IST

వేతనాలు వెంటనే విడుదల చేయాలి: జిల్లా కమిటీ

W.G: VRAలకు ఏడవ తేదీ వచ్చినా మార్చి నెల వేతనాలు చెల్లించకపోవడంపై జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం. ఆంజనేయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో బతుకులీడుస్తున్న VRAల కుటుంబాలు జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిలిచిపోయిన వేతనాలను విడుదల చేయాలని, రెవెన్యూ సిబ్బందిని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.

April 7, 2026 / 05:14 PM IST

అగ్నిమాపక శాఖ బలోపేతానికి చర్యలు

AKP: అగ్నిమాపక శాఖను మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మంగళవారం అమరావతి సచివాలయంలో అగ్నిమాపక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్త అగ్నిమాపక వాహనాలు సీఎం చంద్రబాబుతో ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై సమీక్షించారు. తొలి దశలో రూ.18 కోట్లతో 25 అత్యధిక ఫైర్ ఇంజన్లు అందజేస్తామన్నారు.

April 7, 2026 / 05:12 PM IST

క్రీడాకారిణి శైలజకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం

సత్యసాయి: నేషనల్ గోల్ షాట్ బాల్ పోటీలకు ఎంపికైన క్రీడాకారిణి శైలజకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆర్థిక సాయం అందజేశారు. ఆమె క్రీడల్లో రాణించేందుకు ప్రోత్సాహకంగా రూ.35,000 నగదును అందజేశారు. కదిరి రూరల్ నాయకులు భార్గవ, కదిరప్ప, ఆది, నరేష్, అంజి తదితరుల సమక్షంలో ఈ సాయం అందించారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

April 7, 2026 / 04:51 PM IST

‘ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవడమే జలధార’

E.G: ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవడమే జలధార యొక్క ముఖ్య ఉద్దేశమని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. మంగళవారం రాజమండ్రి రూరల్ మండలం రాజవోలులో జలధార కార్యక్రమంలో భాగంగా చెరువు వద్ద చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

April 7, 2026 / 04:50 PM IST

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

NLR: పని ప్రదేశాలలో మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక వేధింపులకు పాల్పడిన వారు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని, ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తామని కలెక్టర్ హిమాన్షు శుక్లా స్పష్టం చేశారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ARD స్వచ్ఛంద సంస్థ, ICDS ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

April 7, 2026 / 04:50 PM IST

‘సైబర్ నేరాలపై ప్రజల అప్రమత్తంగా ఉండాలి’

SKLM: సైబర్ నేరాలపై ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఆమదాలవలస స్టేషన్ ASI ఝాన్సీ అన్నారు. మంగళవారం ఆమదాలవలస పోలీస్ స్టేషన్ పరిధిలో తిమ్మాపురం జంక్షన్ వద్ద సంకల్పం కార్యక్రమం నిర్వహించారు. మహిళలకు శక్తి యాప్ వలన భద్రత, రక్షణ ఉంటుందని వివరించారు. డ్రగ్స్ వలన కలిగే అనర్ధాలు పై గుడ్ టచ్ బ్యాడ్ టచ్, మహిళ చట్టాలపై అవగాహన కల్పించారు.

April 7, 2026 / 04:41 PM IST

జలధార విజయం.. రాష్ట్రానికి ఆదర్శం

అన్నమయ్య: జిల్లాలో అమలు చేసిన ‘జలధార’ ప్రాజెక్టు రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కృషిని ఆయన ప్రశంసించారు. కేవలం 5 నెలల్లో భూగర్భ జలాలు 8.59 మీటర్లు పెరగడం, 962 చెరువుల పునరుద్ధరణ జలధార విజయాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ మోడల్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు.

April 7, 2026 / 04:41 PM IST

రేపు విశాఖకు కేంద్ర కార్యదర్శి రాక

VSP: రేపు కేంద్ర గణాంక, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి డా. సౌరభ్ గార్గ్ విశాఖకు రానున్నారు. ఈ సందర్భంగా జాతీయ గణాంక ఉప ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించి, ఏప్రిల్ 2026లో ప్రారంభమయ్యే నేషనల్ హౌస్‌హోల్డ్ ఇన్‌కమ్ సర్వే ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనున్నారు. ఆయనతో జేడీ రజత్, ఏడీ రాజశేఖర్ తదితరులు పాల్గొంటారని ఒక ప్రకటనలో తెలిపారు.

April 7, 2026 / 04:38 PM IST

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పేదలకు వరం: MLA

ELR: మంగళవారం ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద 50 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే ధర్మరాజు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పేదలకు వరములాంటిదిని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

April 7, 2026 / 04:34 PM IST

మున్సిపల్ గెస్ట్ హౌస్‌లో అధికారులతో సమీక్ష

PLD: నరసరావుపేట మున్సిపల్ గెస్ట్ హౌస్‌లో నియోజకవర్గంలోని అన్ని విభాగాల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను సమగ్రంగా పరిశీలించి, అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయంతో అమలు చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

April 7, 2026 / 04:30 PM IST

సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కిలో వెండి బహుకరణ

కృష్ణా: మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానానికి భక్తులు వెండి బిస్కెట్లు అందచేశారు. మంగళవారం ఉయ్యూరు మండలం ఆకునూరుకు చెందిన వెలగపూడి లక్ష్మీప్రసాద్ రూ.3,25,000 విలువ కలిగిన కిలో బరువు కలిగిన 5 వెండి బిస్కెట్లను స్వామివారికి కానుకగా సమర్పించారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావుకు అందజేశారు.

April 7, 2026 / 04:30 PM IST

బీజేపీ ఎమ్మెల్యేతో భేటీ అయిన మాజీ ఎమ్మెల్యే

KDP: MLA ఆదినారాయణ రెడ్డితో మంగళవారం కమలాపురం మాజీ MLA వీర శివారెడ్డి భేటీ అయ్యారు. ఆదినారాయణ రెడ్డి స్వగ్రామమైన దేవగుడికి వెళ్లి ఆయనతో భేటీ కావడం జిల్లాలో సంచలనంగా మారింది. నిన్నటి వరకు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, MP రమేశ్ నాయుడు మద్దతుతో బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈయన చేరికకు ఎమ్మెల్యే ఆది అడ్డుపడుతున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి.

April 7, 2026 / 04:30 PM IST

ఏబీఎన్ కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన మంత్రి

ప్రకాశం: ఏబీఎన్ కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడిని మంత్రిస్వామి మంగళవారం ఖండించారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన మీడియాపై ఇలాంటి దాడులు చేయడం అత్యంత గర్హనీయమని ఆయన మండిపడ్డారు. నిజాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకు వస్తున్న ఏబీఎన్ ఛానల్ గొంతు నొక్కాలని చూడడం జగన్ అరాచక పాలనకు నిదర్శమని విమర్శించారు.

April 7, 2026 / 04:30 PM IST

మంత్రుల సమావేశం నిర్వహించిన సీఎం

NDL: అమరావతిలోని సచివాలయంలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రుల సమావేశం నిర్వహించారు. సహచర మంత్రులతో పాటు బనగానపల్లె ఎమ్మెల్యే, రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. 16వ పెట్టుబడుల ప్రోత్సాహక సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో పలు కీలక విషయాలు చర్చించారు.

April 7, 2026 / 04:27 PM IST