• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఓటు హక్కు పరిరక్షణకు అప్రమత్తంగా ఉండాలి: భూమన

CTR: ప్రతి ఓటు విలువైందని, దాని ప్రాధాన్యతను గుర్తించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఎల్ఏల అవగాహన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వైసీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

May 31, 2026 / 10:08 AM IST

డ్రైవర్లకు పోలీసులు అప్రమత్తత చిట్కాలు

KDP: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు చేపట్టిన స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు అర్ధరాత్రి సమయంలో లారీలు, బస్సులు, కార్లు, వ్యాన్ల డ్రైవర్లను ఆపి ముఖం కడిగించి అప్రమత్తంగా ప్రయాణం కొనసాగించేలా చర్యలు చేపడుతున్నారు. నిద్రమత్తుతో డ్రైవింగ్ చేయొద్దని పోలీసులు హెచ్చరించారు.

May 31, 2026 / 10:05 AM IST

అలర్ట్.. వేసవి సెలవులు పొడగింపు

కోనసీమ: జూనియర్ కళాశాలకు వేసవి సెలవులు తొలగించినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి(DIEO) చంద్రశేఖర్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ విద్యా మండల కార్యదర్శి రంజిత్ భాషా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, ముందస్తు షెడ్యూల్ ప్రకారం జూన్ ఒకటి నుంచి కళాశాలలు తెరవాల్సి ఉండగా, తీవ్ర ఎండల దృష్ట్యా ఆరో తేదీకి మార్చినట్లు తెలిపారు.

May 31, 2026 / 10:00 AM IST

బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

ATP: గూగూడు కుళ్ళాయి స్వామి దేవస్థాన శతాబ్ది బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే బండారు శ్రావణి సమీక్షించారు. జూన్ 17 నుంచి 29 వరకు జరిగే ఈ ఉత్సవాలకు 5 లక్షల మంది భక్తులు వస్తారని పేర్కొన్నారు. భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్యం, రవాణా, భద్రత ఏర్పాట్లలో లోపాలు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు.

May 31, 2026 / 09:50 AM IST

గంజాయి మత్తులో యువకుల పరస్పరం దాడి

కృష్ణా: జిల్లా గన్నవరం మండలం అల్లాపురంలో పాత కక్షలు ఘర్షణకు దారితీశాయి. గంజాయి, మద్యం మత్తులో ఉన్న యువకులు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో హేమకుమార్ అనే యువకుడిపై జయంత్ కత్తితో దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ.. హేమకుమార్ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

May 31, 2026 / 09:42 AM IST

GGHలో జిల్లా వాసి ఆత్మహత్య..!

WG: ఉండి గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ శ్రీనివాస్(50) గుంటూరు జీజీహెచ్ భవనం పై నుంచి దూకి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈనెల 23న చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. కాలకృత్యాలకని వెళ్లి వార్డు కిటికీలోంచి కిందకు దూకేశారు. అవుట్ పోస్ట్ పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కొత్తపేట పోలీసులకు సమాచారం అందించారు.

May 31, 2026 / 09:41 AM IST

శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాలు

KDP: పులివెందుల శిల్పారామంలో ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పరిపాలన అధికారి విశ్వనాథ రెడ్డి తెలిపారు. మాస్టర్ కిషోర్ ఆధ్వర్యంలోని యువ రాజా డాన్సింగ్ స్కూల్‌కు చెందిన చిన్నారులు శాస్త్రీయ, జానపద నృత్యాలను ప్రదర్శించనున్నారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రత్యేక నృత్య ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు.

May 31, 2026 / 09:40 AM IST

మహిళలకు శక్తి యాప్ రక్షణ పై అవగాహన

ATP: శక్తి యాప్ మహిళలకు రక్షణగా ఉంటుందని గుంతకల్ రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, మహిళా పోలీస్ స్టేషన్ CI వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మండలంలోని తిమ్మాపురం సమీపంలోని ఆయుష్ కళాశాలలో మహిళలు, బాల బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. శక్తి సేవలు, హెల్ప్ లైన్లు తదితర విషయాలపై మహిళలకు అవగాహన కల్పించారు.

May 31, 2026 / 09:30 AM IST

వాడపల్లి వెంకన్న అన్నదాన పథకానికి రూ. 50,120 విరాళం

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో అమలు చేస్తున్న నిత్య అన్నదానం ట్రస్ట్‌కు ఆదివారం అయినవిల్లి మండలం చింతనలంక వాస్తవ్యులు విల్లా మణికంఠ, జ్యోతి వారి కుటుంబ సభ్యులు  రూ.50,116 విరాళం అందజేశారు. ఈ విరాళాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావుకు అందజేశారు. ఆయన దాత కుటుంబానికి స్వామివారి చిత్రపటం అందజేశారు.

May 31, 2026 / 09:30 AM IST

వీరులపాడులో ముగిసిన క్రీడా పోటీలు

NTR: ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా వీరులపాడులో నిర్వహించిన ఉమ్మడి కృష్ణా- ఖమ్మం జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ఘనంగా ముగిశాయి. పోటీల్లో ఖమ్మం సాగర్ జట్టు ప్రథమ స్థానం సాధించి రూ. 20,116 నగదు బహుమతి అందుకుంది. విజయవాడ స్వామి జట్టు ద్వితీయ స్థానం సాధించి రూ.10,116, వీరులపాడు గణేష్ జట్టు తృతీయ స్థానం సాధించి రూ. 7,116 బహుమతులు పొందాయి.

May 31, 2026 / 09:27 AM IST

చిత్తూరు DEO సేవలు ప్రశంసనీయం

CTR: చిత్తూరు డీఈవోగా పనిచేసిన రాజేంద్రప్రసాద్ సేవలు ప్రశంసనీయమని డీఆర్వో మోహన్ కుమార్ తెలిపారు. జడ్పీ సమావేశ మందిరంలో డీఈవో పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఆయనను పలువురు విద్యాశాఖ అధికారులు, టీచర్లు ఘనంగా సన్మానించారు. విద్యారంగంలో నిస్వార్థమైన సేవలు అందించడంతోపాటు, పరిపాలనాపరంగా తనదైన ముద్రను చూపారని కొనియాడారు.

May 31, 2026 / 09:24 AM IST

పలాసలో ఆపరేషన్ ‘క్లీన్ స్వీప్’

SKLM: పలాసలోని ఉదయపురం ప్రాంతంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని కమిషనర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని అన్నారు. కాలువల్లో చెత్త వేయడం వల్ల దోమలు, అంటువ్యాధులు పెరిగే అవకాశముందని అధికారులు వివరించారు.

May 31, 2026 / 09:21 AM IST

ఘనంగా జ్యేష్ట పౌర్ణమి వేడుకలు

TPT: చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీలో శ్రీ గౌరీ సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయంలో (పురాతన శివాలయం )శనివారం జ్యేష్ట పౌర్ణమి సందర్భంగా వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయ అర్చకులు స్వామివారికి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గుడి ఆవరణ నందు భక్తి శ్రద్ధలతో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించరు.

May 31, 2026 / 09:17 AM IST

జిల్లా కొత్త రిజిస్ట్రార్‌గా రత్న కుమార్ బాధ్యతలు స్వీకరణ

అనకాపల్లి జిల్లా కొత్త రిజిస్ట్రార్‌గా పి. రత్నకుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. విశాఖ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆడిట్ విభాగంలో పనిచేస్తున్న ఆయన పదోన్నతపై అనకాపల్లి జిల్లా రిజిస్ట్రార్‌గా బదిలీ అయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన మన్మధరావు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు.

May 31, 2026 / 09:15 AM IST

ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు

విజయనగరం: కొత్తవలస మండలం అప్పన్నదొరపాలెం గ్రామం రెల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 21/11,13,15 విస్తీర్ణం 1.50 సెంట్లు భూమిలో మండల తహసీల్దార్ రమాలక్ష్మి ఆదేశాల మేరకు స్థానిక వీఆర్వో సుధీర్, సర్వేయర్ చంద్రశేఖర్‌తో కలిసి ప్రభుత్వ హెచ్చరిక బోర్డును పెట్టారు. మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఉపేక్షించబోమని ఆమె తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

May 31, 2026 / 09:14 AM IST