• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

చెరువుల అభివృద్ధిపై రైతులతో సమావేశం

AKP: ఎస్ రాయవరం మండలం పెదగుమ్ములూరులో చెరువుల అభివృద్ధిపై రైతులతో శనివారం ఏషియన్ పెయింట్స్ ప్రాజెక్ట్ ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. హోం మంత్రి అనిత సూచన మేరకు సీఎస్ఆర్ నిధులతో చెరువులను అభివృద్ధి చేయడానికి కంపెనీ ముందుకు వచ్చినట్లు ప్రతినిధులు కిరణ్ కుమార్, వెంకటరావు తెలిపారు. పొలాలకు సాగునీరు వెళ్లే మార్గాలు, కాలువల అభివృద్ధి చేస్తామన్నారు.

May 31, 2026 / 07:49 AM IST

శ్రీశైలంలో రాష్ట్ర RTI కమిషనర్ ప్రత్యేక పూజలు

NDL: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ సింహాచలం నాయుడు శనివారం సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ రాజగోపురం వద్ద ఆయనకు అధికారులు, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేద ఆశీర్వచనలు అందించి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాలు, చిత్రపటంతో సత్కరించారు.

May 31, 2026 / 07:43 AM IST

ఆటోపై విరిగి పడ్డ విద్యుత్ స్తంభం.. తప్పిన ప్రమాదం

NDL: చాగలమర్రి మండల కేంద్రంలో శనివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. కేరళ హాస్పిటల్ ఎదురుగా నిలిపి ఉన్న ఓ ఆటోపై అకస్మాత్తుగా విద్యుత్ స్తంభం విరిగి పడింది. ఘటన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్తంభం పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు వెంటనే స్పందించి విరిగిన స్తంభాన్ని తొలగించాలన్నారు.

May 31, 2026 / 07:41 AM IST

హత్య కేసు నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష

BPT: అడవులదీవి పీఎస్ పరిధిలోని ఒక పాత హత్య కేసులో నిందితుడికి గుంటూరు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.1,500 జరిమానా విధించినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మహమ్మాదియపాలెంకు చెందిన 21 మంది నిందితులపై నమోదైన ఈ కేసులో ఇప్పటికే 13 మందికి యావజ్జీవ శిక్ష పడింది. తాజాగా మరో నిందితుడిపై విచారణ పూర్తికావడంతో కోర్టు శనివారం ఈ తీర్పు వెల్లడించిందని ఆయన వివరించారు.

May 31, 2026 / 07:41 AM IST

రోడ్డు ప్రమాదం.. డ్రైవర్లకు గాయాలు

ప్రకాశం జిల్లా ఒంగోలులోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున చెన్నై నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ కంటైనర్ లారీ అదుపుతప్పి డివైడర్‌ని ఢీ కొట్టింది. అదే సమయంలో మినీ కంటైనర్ లారీ ఐచర్ వాహనాలు ఢీకొని రెండు వాహనాలకు చెందిన డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

May 31, 2026 / 07:40 AM IST

రఘురామ వ్యాఖ్యలు అవాస్తవం: సీపీఎం

W.G: ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్ల కూల్చివేతలపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలని CPM జిల్లా కార్యదర్శి గోపాలన్ మండిపడ్డారు. శనివారం విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం ఆయన స్పందిస్తూ, అభివృద్ధి పేరుతో కాకుండా బడాబాబులు, భూస్వాములు, ఆక్వా చెరువుల యజమానులకు స్థలాలు కట్టబెట్టడానికే పేదల ఇళ్లను కూల్చివేశారని ఆరోపించారు.

May 31, 2026 / 07:36 AM IST

నేడు విద్యుత్ బిల్లులు చెల్లించొచ్చు

KDP: విద్యుత్ బిల్లులను సెలవురోజు అయినా నేడు చెల్లించుకోవచ్చని APSPDCL ఎస్ఈ శ్రీనివాసులు ప్రకటనలో తెలిపారు. ఇవాళ జిల్లావ్యాప్తంగా అన్ని విద్యుత్ బిల్లు వసూలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

May 31, 2026 / 07:33 AM IST

13 మంది జెడ్పీ ఉద్యోగులకు ప్రమోషన్

GNTR: గుంటూరు జిల్లా పరిషత్‌లో పనిచేస్తున్న 13 మంది జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. శనివారం జెడ్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో, ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ కత్తెర హెని క్రిష్టినా ఉద్యోగులకు ప్రమోషన్ ఆర్డర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ జ్యోతిబసు పాల్గొన్నారు.

May 31, 2026 / 07:30 AM IST

బాడంగి నూతన ఎస్ఐ బాధ్యతలు స్వీకరణ

VZM: బాడంగి పోలీసు స్టేషను నూతన సబ్ ఇన్‌స్పెక్టర్‌గా సూర్యకుమారి శనివారం బాధ్యతలు స్వీకరించారు. భోగాపురం నుంచి బదిలీపై ఆమె ఇక్కడకు వచ్చారు. ప్రస్తుతం ఇక్కడ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న తారకేశ్వరరావు విజయనగరం క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నూతన SI మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

May 31, 2026 / 07:28 AM IST

రెండో పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య

BPT: యద్దనపూడి మండలం అనంతవరంలో కుంచాల వీరకుమారి (27) అనే యువతి శనివారం ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. విడాకులు తీసుకున్న తర్వాత తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. అయితే కుటుంబ సభ్యులు మరో పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తుండటాన్ని తట్టుకోలేకపోయింది. తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై ఎస్సై రత్నకుమారి కేసు నమోదు చేశారు.

May 31, 2026 / 07:27 AM IST

సమస్యల పరిష్కారంలో పాత్రికేయుల చొరవ అభినందనీయం

ASR: జిల్లాలో సమస్యల వెలికితీత, పరిష్కార మార్గం చూపే విషయంలో పాత్రికేయులు చూపుతున్న చొరవ అభినందనీయమని కలెక్టర్ నిశాంతి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు, పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. జిల్లాలోని సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని కోరారు.

May 31, 2026 / 07:26 AM IST

నేడు పాతపట్నంలో కరెంట్ కట్

SKLM: పాతపట్నం యశోధనగర్‌లో పాత విద్యుత్ లైన్ల స్థానంలో కొత్త లైన్లు వేస్తున్నందున ఇవాళ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు కరెంట్ నిలిచిపోతుందని ఈఈ నరసింహ కుమార్ తెలిపారు. ఎగువ కండర వీధి, దిగువ కండర వీధి, గణేష్ నగర్, ప్రశాంతి నగర్, దుర్గమ్మ కాలనీ 1,2,3, యశోధనగర్, సంపంగి నగర్, విద్యానగర్, నరసింహ నగర్ 1,2 ప్రాంతాల్లో సరఫరా ఉండదని తెలిపారు.

May 31, 2026 / 07:25 AM IST

రేపటి నుంచి పింఛన్లు పంపిణీ: కలెక్టర్

ELR: జిల్లాలో జూన్ 1న ఉదయం 7 గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2.55 లక్షల మంది లబ్ధిదారులకు రూ.113.29 కోట్లను 4,959 మంది సిబ్బంది ద్వారా అందజేస్తామన్నారు. తొలిరోజే వందశాతం పంపిణీ లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన వారికి రెండో తేదీన ఇస్తామన్నారు.

May 31, 2026 / 07:21 AM IST

ఇది కుట్రలు చేసే కూటమి ప్రభుత్వం: నిస్సార్ అహమ్మద్

అన్నమయ్య: ఓటర్ల జాబితా పునఃపరిశీలన (SIR) ప్రక్రియపై బూత్ లెవెల్ ఏజెంట్లు (BLA) అప్రమత్తంగా ఉండాలని YCP సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పిలుపునిచ్చారు. శనివారం మదనపల్లెలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం ఓట్ల తొలగింపు కుట్రలతో ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఆరోపించారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నష్టం జరుగుతుందన్నారు.

May 31, 2026 / 07:17 AM IST

ఒంటిమిట్టలో కోదండ రామయ్య కళ్యాణం

KDP: పౌర్ణమి సందర్భంగా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఆదివారం సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహిస్తామని తితిదే అధికారులు శనివారం తెలిపారు. రాములోరి పెళ్లి ఘట్టాన్ని కనులారా వీక్షించడానికి తరలిరానున్న భక్తులకు అసౌకర్యం కలగకుండా అవసరమైనట్లు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.

May 31, 2026 / 07:15 AM IST