• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నరసాపురం కాలువకు నీటి విడుదల..!

WG: నరసాపురం ప్రధాన కాలువలోకి ఆదివారం నీటిపారుదలశాఖ అధికారులు నీరు విడుదల చేశారు. వేసవిలో కాలువ పనుల నిమిత్తం నిలిపివేసిన నీటిని తిరిగి వదలడంతో ఖరీఫ్ సీజన్ పంటలకు సమృద్ధిగా సాగునీరు అందుతుందని డిఈఈ సిహెచ్. వెంకటనారాయణ తెలిపారు. అలాగే ఈ నీటి విడుదలతో పాలకొల్లులో గత కొన్ని రోజులుగా వేధిస్తున్న తాగునీటి సమస్య కూడా పూర్తిగా తీరుతుందని ఆయన పేర్కొన్నారు.

May 31, 2026 / 12:26 PM IST

SGS కళాశాల అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

NTR: జగ్గయ్యపేటఎస్‌జీఎస్ కళాశాలను ఆదివారం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ మున్సిపల్ ఛైర్మన్ రాఘవేంద్ర సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇటీవల ఈదురు గాలులు, వర్షాలతో జరిగిన నష్టాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, పూర్తి అంచనా నివేదికను కలెక్టర్‌కు పంపాలని ఎంఆర్ఓను ఆదేశించారు. ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని కళాశాల యాజమాన్యానికి హామీ ఇచ్చారు.

May 31, 2026 / 12:23 PM IST

నీళ్ల వాసన.. పట్టణ ప్రజలకు ఇబ్బందులు

KDP: నీళ్లు వాసన వస్తున్నాయని పులివెందుల పట్టణంలోని లక్ష్మీ హాల్ ఏరియా సరస్వతీ వీధికి చెందిన ప్రజలు ఆదివారం మున్సిపల్ కమిషనర్ ముని కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. నీళ్లు కూడా 3 రోజులకు ఒకసారి వస్తున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ తెలియజేశారు.మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

May 31, 2026 / 12:22 PM IST

రుచికి మారు పేరు అడవి తేనె

అల్లూరి: ఏజెన్సీ అడవుల్లో లభించే స్వచ్ఛమైన తేనెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కొండలు, లోయలు, అటవీ ప్రాంతాల్లో గిరిజనులు సంప్రదాయ పద్ధతుల్లో తేనెను సేకరిస్తున్నారు. ఔషధ గుణాలు, సహజ రుచితో ఈ తేనె వినియోగదారులను ఆకట్టుకుంటోంది. విక్రయ వేదికలు కల్పిస్తే గిరిజనులకు మరింత ఆదాయం లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

May 31, 2026 / 12:21 PM IST

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ లోని 18వ డివిజన్, హరినాధపురంలో ప్రజా బాట కార్యక్రమాన్ని ఆదివారం TDP పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నిర్వహించారు. స్థానిక సమస్యలను ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 18వ డివిజన్ అభివృద్ధికి 7.50 కోట్ల రూపాయల నిధులు కేటాయించామన్నారు. ఏ సమస్య ఉన్నా పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

May 31, 2026 / 12:20 PM IST

నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు: ఎమ్మెల్యే

NTR: రూరల్ మండలం గొల్లపూడిలోని వాటర్ ఫిల్టర్ బెడ్‌ను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ఆదివారం పరిశీలించారు. గొల్లపూడి నుంచి జక్కంపూడి వద్ద నిర్మించిన టిడ్కో గృహాలకు సురక్షిత కృష్ణా జలాలను సరఫరవేసవిలో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిల్టర్ బెడ్‌ను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.

May 31, 2026 / 12:11 PM IST

అమ్మ వారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

NTR: పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తెల్లవారుజాము నుంచే శ్రీ కనకదుర్గమ్మ దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ దృష్ట్యా రూ. 500 దర్శన టికెట్ల విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేసి, బంగారు వాకిలి ద్వారా దర్శనం కల్పిస్తున్నారు. ఘాట్ రోడ్, కనకదుర్గానగర్ వైపు వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

May 31, 2026 / 12:10 PM IST

గణపవరంలో పొగాకు వ్యతిరేక దినోత్సవం..!

ELR: పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన ర్యాలీ గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆదివారం నిర్వహించారు. దూమపానం వద్దు, ఆరోగ్యమే ముద్దు అంటూ నినాదాలు చేశారు. గ్రామాలలోని ప్రజలు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని వైద్యాధికారి డా. ఓంకార్ నాథ్ అన్నారు. తద్వారా ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో విల్సన్ బాబు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

May 31, 2026 / 12:10 PM IST

గండి దేవస్థానం ఈవోగా విశ్వనాథ్

కడప జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం గండి వీరాంజనేయ స్వామి దేవాలయం ఈవోగా విశ్వనాథ్ నియమితులయ్యారు. అన్నమయ్య జిల్లా ఎండోమెంట్ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్న విశ్వనాథ్కు గండి ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం గండి ఈవోగా బాధ్యతలు చూస్తున్న కర్నూల్ ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ గురు ప్రసాద్ నేడు రిటైడ్ అవుతున్నారు.

May 31, 2026 / 12:10 PM IST

MLA రవికుమార్ రేపటి పర్యటన వివరాలు

SKLM: ఆమదాలవలస MLA రవికుమార్ సోమవారం ఉ.7 గంటలకు ఆమదాలవలస మండలం 12వ వార్డులో లబ్దిదారులు ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉ 8 గంటలకు సరుబుజ్జిలి మండలం గోనెపాడులో NTR భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొంటారు. మ.3 గంటలకు MLA క్రికెట్ కప్ ఫైనల్స్ విజేతలకు బహుమతులు అందజేస్తారు అని MLA కార్యాలయం ఆదివారం ప్రకటనలో తెలిపారు.

May 31, 2026 / 12:09 PM IST

ఏడుగురిపై కేసు నమోదు

అన్నమయ్య: పత్తివాండ్లపల్లెకు చెందిన ఒంటేరు సంతోష్‌పై రాయచోటికి చెందిన కొందరు యువకులు దాడి చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. చాకలిపల్లె సమీపంలోని మామిడి తోటలో నిద్రిస్తున్న సమయంలో గుంపుగా వచ్చిన యువకులు కట్టెలు, రాళ్లు, చేతులు, కాళ్లతో దాడి చేసి గాయపరిచినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు శనివారం ఎస్సై హుషన్ తెలిపారు.

May 31, 2026 / 12:08 PM IST

నందిగామలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

NTR: నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో చెడు నడత కలిగి, వివిధ కేసులలో ఎదుటివారిపై ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్న వారందరికీ ఈరోజు పోలీసు వారు కౌన్సిలింగ్ చేశారు. ఈ క్రమంలో వారందరూ కూడా ఇకపై ఎటువంటి వివాదాలకు పోకుండా మంచిగా ఉంటామని ప్రమాణం చేశారు. అసాంఘిక కార్యక్రమాలకు తావు లేదని అటువంటి చర్యలు చేసే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీను తెలిపారు.

May 31, 2026 / 12:07 PM IST

నీటి కొరతతో అల్లాడుతున్న గ్రామాలు

మన్యం: గుమ్మలక్ష్మీపురం మండలం స్తంభంగూడ గ్రామంలో తాగునీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి నీరు అందిస్తున్న సోలార్ వాటర్ ట్యాంక్ సామర్థ్యం తక్కువగా ఉండటంతో సరిపడా నీటి సరఫరా జరగడం లేదని స్థానికులు వాపోతున్నారు. పరిసర గ్రామాల ప్రజలు కూడా ఇదే ట్యాంక్‌పై ఆధారపడటంతో సమస్య మరింత తీవ్రమైందని, దీంతో బోర్లు, బావులపై ఆధారపడుతున్నాం అని వాపోతున్నారు.

May 31, 2026 / 12:07 PM IST

బైక్‌ను ఢీ కొట్టిన కారు.. తీవ్ర గాయాలు

TPT: పెళ్లకూరు మండలం చెంబడపాలెం వద్ద ఆదివారం ఉదయం 7.20 గంటలకు శ్రీ కాళహస్తి నుంచి నాయుడుపేట వైపు వెళ్లే బైక్‌ను వెనుక నుంచి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా.. వారిని హైవే అంబులెన్స్ సిబ్బంది కాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

May 31, 2026 / 12:05 PM IST

పొగాకును పూర్తిగా నిర్మూలించాలి: ఉప్పుగంటి

కోనసీమ: ప్రస్తుతం సమాజంలో సిగరెట్ల వినియోగం తగ్గినప్పటికీ పొగాకును ఇంకా అనేక విధాలుగా వినియోగిస్తున్నారని, పొగాకును పూర్తిగా నిర్మూలించాలని అమలాపురం వాకర్స్ హెల్త్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఉప్పుగంటి భాస్కరరావు అన్నారు. అమలాపురం గడియార స్తంభం వద్ద పొగాకు వినియోగ వ్యతిరేక దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. పొగాకు వలన వివిధ రకాలు క్యాన్సర్‌లు వస్తున్నాయన్నారు.

May 31, 2026 / 12:00 PM IST