W.G: ద్వారకాతిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా పెంటపాడుకు చెందిన జనసేన నాయకురాలు కసిరెడ్డి మధులత నియమితులయ్యారు. స్వామివారి సేవ చేసుకునే భాగ్యం కలగడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. తన నియమాకానికి సహకరించిన ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, మద్దిపాటి వెంకట్రాజులకు మంగళవారం కృతజ్ఞతలు తెలిపారు.
KDP: నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర బండి కనుమ పంప్ హౌస్, స్టోరేజ్ ట్యాంకులను పరిశీలించారు. తాగునీటి సరఫరా వ్యవస్థ పనితీరును అధికారులతో సమీక్షిస్తూ.. నీటి నాణ్యతపై ప్రత్యక్షంగా పరీక్షలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. నగర ప్రజలకు శుద్ధమైన మరియు సమృద్ధిగా తాగునీటి సరఫరా అందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా: మతోన్మాద ట్రంప్ చర్యలను ఖండిస్తూ, క్యూబాకు అండగా నిలబడాలని గుడివాడలో సీపీఎం నేతలు మంగళవారం పిలుపునిచ్చారు. సోషలిస్ట్ దేశమైన అయినా క్యూబాపై గతి అనేక సంవత్సరాలుగా అమెరికా ఆర్థిక ఆంక్షలు విధిస్తూ, ఆ దేశాన్ని ఇబ్బందులకు గురిచేస్తుందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఆర్.సీపీ రెడ్డి అన్నారు. క్యూబాకు మనమంతా స్వచ్ఛందంగా ఆర్థిక సాయం అందించాలని తెలిపారు.
ప్రకాశం: పెద్దచెర్లోపల్లి (M) తుర్కపల్లి గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం మార్కాపురం మైనింగ్ అధికారులు దాడి చేసి నిల్వ ఉంచిన తెల్ల రాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మైనింగ్ చేస్తున్న జేసీబీని స్వాధీనం చేసుకొని రెవిన్యూ అధికారులకు అప్పగించినట్లు సమాచారం.
GNTR: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను నిరాకరిస్తున్న1950 రాష్ట్రపతి ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఇతర మతాల్లోని వర్గాలకు రిజర్వేషన్లు ఉన్నప్పుడు దళితులకే ఎందుకు ఈ వివక్ష అని ప్రశ్నించారు. కుల వ్యవస్థ వల్లనే దేశంలో అసమానతలు పెరిగాయని, దీనికి కారణమైన శక్తులపై ఉద్యమిస్తామని హెచ్చరించారు.
W.G: తాడేపల్లిగూడెం వ్యాపారపరంగా అత్యంత చైతన్యవంతమైన ప్రాంతమని కలెక్టర్ నాగరాణి కొనియాడారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కృషి చేస్తున్నారని, గూగుల్ డేటా సెంటర్ స్థాపనే అందుకు నిదర్శనమని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ పరిశ్రమల అభివృద్ధికి పూర్తి తోడ్పాటు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ పాల్గొన్నారు.
KRNL: కర్నూలు మండలం పంచలింగాల గ్రామంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు పర్యటించి అభివృద్ధి పనులను ఇవాళ పరిశీలించారు. ఎంపీ నిధులు, NREGS ద్వారా జరుగుతున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను తనిఖీ చేశారు. గ్రామ సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇస్తూ, కొత్త పశు వైద్యశాల నిర్మాణం చేపడతామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
SKLM: మీడియా సంస్థలపై భౌతిక దాడులు చేయడం ద్వారా వైసీపీ తన అరాచక స్వభావాన్ని బహిర్గతం చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. హైదరాబాద్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ చేసిన దారుణ దాడిని ఆయన ఖండించారు. ప్రశ్నలు చేస్తే దాడులు చేస్తారా? దౌర్జన్యాలకు దిగుతారా? అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు.
ATP: జిల్లాలో ఆర్డీఎస్ఎస్ పథకం పనులు వంద శాతం పూర్తి చేయాలని మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. వేసవిలో తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. వ్యవసాయ కనెక్షన్లను వెంటనే మంజూరు చేయాలని అధికారులకు సూచించారు.
TPT: వేసవి తీవ్రత దృష్ట్యా హీట్ వేవ్స్ నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. వడదెబ్బ కేసులకు వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
KRNL: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ తన ‘కొత్త పలుకు’ లో YCP నేతల కుటుంబాలు, మహిళలపై చేసిన వ్యాఖ్యలు ఖండనీయమని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి అన్నారు. మహిళల గురించి అవమానకరంగా మాట్లాడటం తగదని ఆయన మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ కారిడార్ వల్ల కొందరి అవినీతి కోటలు కూలిపోతున్నాయన్నారు.
PPM: సాలూరు నియోజకవర్గాన్ని రూ. 490 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బడ్జెట్లో నిధులు కేటాయించారని ఆమె గుర్తుచేశారు. ఆ నిధులతో నియోజకవర్గంలోని మొత్తం పనులను చేసుకుంటూ ముందుకు వెళతామని పేర్కొన్నారు.
KDP: జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఏప్రిల్ 08, 09 తేదీలలో కడప సర్వజన ఆసుపత్రి ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రక్త పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షల కోసం ఖాళీ కడుపుతో రావాలని, గత వైద్య పరీక్షల నివేదికలు ఉంటే తీసుకురావాలని సూచించారు.
AKP: ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్లో ప్రభుత్వం నెట్ జీరో హెల్త్ క్యాంపస్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి కేజీబీవీ ప్రిన్సిపల్స్, అధికారులతో సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల్లో వ్యర్ధాల నిర్వహణను మెరుగుపరచడం వ్యర్ధాలు లేకుండా చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశించారు.
సత్యసాయి: పుట్టపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పల్లె సింధూరను ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కలిసి తమ సమస్యలను వివరించారు. కొన్ని ఏళ్లుగా పని చేస్తున్న ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. తమ సేవలకు గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే వారి సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.