SKLM: గ్రామ స్థాయిలో టీడీపీ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే శిరీష అన్నారు. మంగళవారం టీడీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల క్యాడర్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీ క్రమశిక్షణ, విధి విధానాలు, నాయకుల బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఈ మేరకు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
CTR: ఎస్ఆర్ పురం (M) 49. కొత్తపల్లి మిట్టలో వారపు సంతకు మంగళవారం వేళం జరిగింది. సీఐ హనుమంతప్ప, Dy. ఎంపీడీవో నాగరత్నమ్మ ఆధ్వర్యంలో వారపు సంత, షాపింగ్ కాంప్లెక్స్ మొదలైన ఆస్థులకు బహిరంగ వేలం నిర్వహించారు. 49. కొత్తపల్లి మిట్టకు చెందిన సీనియర్ నేత సూరి రెడ్డి రూ.16.20 లక్షలు హెచ్చుగా వేలం పాడి వారపు సంతను దక్కించుకున్నారు.
TPT: నాయుడుపేటకు విచ్చేసిన ఎస్సీ కమిషన్ సభ్యులు డాక్టర్ పాకాటి గౌతమ్, డాక్టర్ శ్రీపతి బాబుకు మంగళవారం ఘన స్వాగతం లభించింది. ఏఎంసీ ఛైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ జనసేన నాయకులతో కలిసి ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో పూల బొకేలు అందజేసి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు అట్ల కృష్ణరావు, బాలు శెట్టి తదితరులు పాల్గొన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై పోరాడుతున్న కార్మికులు, కమ్యూనిస్టులపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను సీపీఎం తీవ్రంగా ఖండించింది. మంగళవారం ఏచూరి భవన్లో జరిగిన సమావేశంలో సీసీ సభ్యుడు లోకనాథం మాట్లాడారు. ఈ సందర్భంగా వీర్రాజు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
PPM: శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారిని ఇవాళ బొబ్బిలి ఎమ్మెల్యే R.V.S.K.K.రంగారావు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పీసపాటి శ్రీనివాసాచార్యులు , ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు సాదర స్వాగతం పలికారు. దేవాలయమలో విశ్వశాంతి, లోకకళ్యాణార్థం నిర్వహిస్తున్న నవ నారసింహ యాగంలో పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
VSP: గాజువాకలోని షీలానగర్ వద్ద 6.45 ఎకరాల్లో 400 మంది వైద్య సదుపాయం అందించే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని విశాఖ ఎంపీ భరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మంగళవారం ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణ పనులు పరిశీలించి మాట్లాడారు. రెండు నెలలు పూర్తిస్థాయిలో పనులు జరిగి ఆసుపత్రి ఉద్యోగ నియమకాలు చేస్తామన్నారు.
VZM: పేద కుటుంబాల విద్యుత్ కష్టాలను తీర్చి వారి ఇళ్లలో వెలుగులు నింపే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజన’ పథకాన్ని నెల్లిమర్ల MLA లోకం నాగ మాధవి డెంకాడ గ్రామంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సోలార్ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు విద్యుత్ బిల్లుల భారం పూర్తిగా తగ్గుతుంది అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
TPT: ఏపీ సచివాలయం నుంచి 22ఏ, రిసర్వే, రెవెన్యూ, పీపీబీ పంపిణీ అంశాలపై చీఫ్ సెక్రటరీ జి. జయలక్ష్మి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, డీఆర్వో జి. నరసింహులు, అధికారులు పాల్గొన్నారు.
అన్నమయ్య: రైల్వేకోడూరులోని విజడమ్ సెంట్రల్ స్కూల్ 5వ తరగతి విద్యార్థిని కే.లిఫిత మార్చి 19-20 తేదీలలో కేరళలోని తిరువనంతపురంలో జరిగిన భరతనాట్య పోటీలలో పాల్గొని అవార్డు గెలుచుకుంది. ఈ విషయాన్ని విజడమ్ విద్యా సంస్థల ఛైర్మన్ డా. టీ.ప్రదీప్ తెలిపారు. ఈ సందర్భంగా ఛైర్మన్, అడ్మిన్ డైరెక్టర్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం లిఫితకు శుభాకాంక్షలు తెలిపారు.
CTR: రాష్ట్ర షెడ్యూల్ కులాల ఛైర్మన్ జవహర్ బుధవారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చిత్తూరులోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఫిర్యాదులను స్వీకరిస్తారన్నారు. మధ్యాహ్నం కలెక్టరేట్లో జిల్లా అధికారులు, పోలీసు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.
W.G: కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ 1వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ కొర్రపాటి వెంకటేశ్వరరావు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ వడ్డే రఘురాం పాల్గొన్నారు. అనంతరం పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.
ఉయ్యాలవాడలో ఈనెల 25 నుంచి జరగనున్న గంగాభవాని తిరుణాల నిర్వహణకు అధికారులు సహకరించాలని నిర్వాహకులు కోరారు. ఎంపీడీవో ఉమామహేశ్వరరావును గ్రామ పెద్దలు కలిసి వినతిపత్రం ఇవాళ అందజేశారు. తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, పోలీస్ బందోబస్తు, రవాణా సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వేసవి నేపథ్యంలో భక్తులకు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.
KKD: గొల్లప్రోలు పట్టణంలో జనసేన నాయకులు కడారి తమ్మయ్య నాయుడు సొంత నిధులతో వాటర్ ట్యాంకర్ సమకూర్చారు. దీనిని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రారంభించారు. వేసవిలో తాగునీటి కొరతను ముందుగానే గుర్తించి, ప్రభుత్వ సహాయం కోసం వేచి చూడకుండా స్వయంగా ముందుకు వచ్చిన తమ్మయ్య నాయుడు చొరవను ఎంపీ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
SKLM: దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలో భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. మందస గ్రామంలో ఇవాళ ఆయన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో పతాకాన్ని ఆవిష్కరించి, నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కోనసీమ: రావులపాలెంలో రహదారి వెంబడి ఉన్న అక్రమ కట్టడాలు, ఆక్రమణలు తొలగింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. పట్టణంలో రోడ్ల వెంట అక్రమంగా నిర్మించిన కట్టడాలు రహదారి విస్తరణకు అడ్డంకిగా మారాయి. మంగళవారం ఎంపీడీవో సుబ్రహ్మణ్యం స్వయంగా తొలగింపు ప్రక్రియను పరిశీలించారు. రహదారి వెంబడి అక్రమ నిర్మాణాలు తొలగించడం వల్ల వాహన రాకపోకలు సులభతరమవుతాయన్నారు.