• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మాజీ మంత్రి హౌస్ అరెస్ట్

SKLM: మహిళలను ఉద్దేశించి ABN రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు శ్రీకాకుళంలోని ABN కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. బుధవారం కాశీబుగ్గ పోలీసులు ఆయనను ఇంటి వద్దే ఆపి హౌస్ అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు కూడా ప్రజలకు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు.

April 8, 2026 / 03:21 PM IST

అనంతపురంలో నిరసనకు దిగిన వైసీసీ నేతలు

ATP: మహిళలపై ఏబీఎన్ రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అనంతపురంలోని ఏబీఎన్ కార్యాలయం వద్ద వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ ఆందోళన చేపట్టారు. వైసీపీ నేతల కుటుంబ సభ్యులపై నీచమైన రాతలు రాశారంటూ మండిపడ్డారు. మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేసేలా వ్యవహరించడం దుర్మార్గమని విమర్శించారు. రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

April 8, 2026 / 03:20 PM IST

‘వేస్ట్ టు వండర్’ పోటీలు

VSP: స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26లో భాగంగా జీవీఎంసీ నిర్వహిస్తున్న “వేస్ట్ టు వండర్” పోటీలకు ఏప్రిల్ 24 చివరి తేదీగా నిర్ణయించినట్లు బుధవారం కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఇందులో స్క్రాప్‌తో 4-8 అడుగుల శిల్పాలు రూపొందించి సమర్పించాలన్నారు. ఇందులోని ఉత్తమ కళా ఖండాలను నగరంలోని ప్రధాన కూడళ్లలో ప్రతిష్ఠించనున్నట్లు పేర్కొన్నారు.

April 8, 2026 / 03:11 PM IST

‘నీటి సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు’

AKP: నీటి సంరక్షణతో పాటు భూగర్భ జలాల పెంపుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. జలధార-జల హారతి కార్యక్రమంపై అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులతో సమన్వయ కమిటీ సమావేశాన్ని ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం 100 రోజులు కొనసాగుతుందన్నారు.

April 8, 2026 / 03:06 PM IST

‘వైసీపీ దుష్ప్రచారాన్ని పట్టించుకోవద్దు’

PLD: యడ్లపాడు మండలం జాలాది, ఉప్పరపాలెంలో బుధవారం రూ.20 లక్షలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పుల్లారావు శంకుస్థాపన చేశారు. అమరావతిపై వైసీపీ దుష్ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటుందని తెలిపారు. చంద్రబాబు పాలనలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి ఎలాంటి ఢోకా ఉండదని ఆయన స్పష్టం చేశారు.

April 8, 2026 / 03:00 PM IST

స్పాట్ వాల్యుయేషన్‌ను పర్యవేక్షించిన కలెక్టర్

నంద్యాల(మం) వెంకటేశ్వరపురం వద్ద ఉన్న ఎస్‌డీఆర్ స్కూల్‌‌లో నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను బుధవారం కలెక్టర్ జీ. రాజకుమారి పర్యవేక్షించారు. వాల్యుయేషన్ కేంద్రంలో జరుగుతున్న పనితీరును పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.

April 8, 2026 / 02:59 PM IST

నగరి ఎమ్మెల్యే రేపటి షెడ్యూల్‌ ఇదే..!

CTR: ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ రేపు పుత్తూరు, నగరిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2:30కు గొల్లపల్లి సచివాలయంలో పాసుబుక్‌ల పంపిణీ, 3 గంటలకు SC & BC హాస్టల్ సందర్శన చేసి విద్యార్థులతో సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు నగరి పార్టీ కార్యాలయంలో 50 మందికి CMRF చెక్కులు పంపిణీ చేయనున్నారు.

April 8, 2026 / 02:55 PM IST

పెళ్లకూరుకు చేరిన సైకిల్ యాత్ర

TPT: డ్రగ్స్ రహిత ఏపీ లక్ష్యంగా పోలీసులు దండి మార్చ్ 2.0 సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ యాత్ర పెళ్లకూరు మండలానికి చేరుకుంది. వీరిని సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై ఆదిలక్ష్మి స్వాగతించారు. యువతతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. యువత మాదకద్రవ్యాలు బారిన పడకుండా కాపాడటం అందరి బాధ్యతని ఎస్సై ఆదిలక్ష్మి తెలిపారు.

April 8, 2026 / 02:53 PM IST

గోదావరి మోక్ష దామం నిర్మాణానికి భూమి పూజ

W.G: పెనుగొండ మండలంలోని సిద్ధాంతం ఘాట్ వద్ద గోదావరి మోక్ష దామం నిర్మాణానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం భూమి పూజ నిర్వహించారు. సుమారు రూ. 3 కోట్ల వ్యయంతో, 62 సెంట్ల విస్తీర్ణంలో ఈ మోక్ష దామం నిర్మించనున్నారు. స్థానిక ప్రజలకు అంత్యక్రియల కోసం శుభ్రమైన, సక్రమమైన ఆధునిక సౌకర్యాలు కల్పించబడతాయని వారు చెప్పుకొచ్చారు.

April 8, 2026 / 02:48 PM IST

‘భూసేకరణ వేగవంతం చేసి అండర్ బ్రిడ్జి పూర్తి చేయాలి’

KDP: విశ్వనాధపురం వద్ద పెండింగ్‌లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలని సీపీఎం నేతలు ఆర్డీవోను కలిసి వినతి పత్రం సమర్పించారు. భూసేకరణ, పరిహారం సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరగా, ఆర్డీవో వారంలోగా పరిశీలించి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ మార్గంపై సుమారు 35 గ్రామాలకు చెందిన 50 వేల మంది ఆధారపడుతున్నారని తెలిపారు.

April 8, 2026 / 02:45 PM IST

కరెంట్ స్తంభం ఎక్కి వ్యక్తి మృతి

అన్నమయ్య: సుండుపల్లి(మం) ఈడికిపల్లి గ్రామానికి చెందిన రాజా (45) బుధవారం కరెంట్ స్తంభం ఎక్కి ప్రాణాలు కోల్పోయాడు. పోలోపల్లి పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజ్ పోయిందని రైతు లైన్మెన్‌కు సమాచారం ఇవ్వగా, ప్రైవేటు వ్యక్తి రాజాకు అక్కడికి వెళ్లమని సూచించినట్లు సమాచారం. ఎల్‌సీ క్లియరెన్స్ తీసుకోకుండానే రాజా విద్యుత్ స్తంభం ఎక్కగా 11కేవీ లైన్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.

April 8, 2026 / 02:44 PM IST

విద్యార్థులకు కూలింగ్ వాటర్ క్యాన్‌లు వితరణ

ELR: నూజివీడు(మం) అన్నవరం గ్రామంలోని జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు శ్రీ సత్య సాయి భక్తులు కూలింగ్ వాటర్ క్యాన్‌లను బుధవారం బహుకరించారు. పాఠశాల హెచ్ఎం విజయకుమారి మాట్లాడుతూ.. వేసవి నేపథ్యంలో విద్యార్థుల దాహార్తి తీర్చేందుకు కూలింగ్ వాటర్ క్యాన్‌లు వితరణగా అందించడం అభినందనీయమన్నారు.

April 8, 2026 / 02:43 PM IST

ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోండి: ఏఐఎస్ఎఫ్

KRNL: కౌతాళం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో నిర్వహించిన విచారణ తూతూ మంత్రంగానే జరిగిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు యస్. ఈరేష్ ఇవాళ విమర్శించారు. విచారణ పూర్తై రోజులు గడిచినా నివేదికను బయటపెట్టకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే నివేదికను వెల్లడించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

April 8, 2026 / 02:40 PM IST

నరసరావుపేటలో YCP నేతలు నిరసన

PLD: ABN ఆంధ్రజ్యోతి ఛానల్‌లో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నరసరావుపేటలో బుధవారం YCP నేతలు ఆందోళన చేపట్టాయి. ఆంధ్రజ్యోతి తీరును నిరసిస్తూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజల మద్దతుతో ఈ ఉధ్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

April 8, 2026 / 02:30 PM IST

పిల్లలకు టీకాలు తప్పనిసరి: హుస్సేన్ రెడ్డి

NDL: పుట్టిన ప్రతి బిడ్డకు తప్పనిసరిగా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని బుధవారం హెల్త్ ఎక్స్‌టన్షన్ ఆఫీసర్ హుస్సేన్ రెడ్డి అన్నారు. మహానందిలో చిన్నారులు, బాలింతలు, గర్భవతులకు టీకాలు వేశారు. ఎండాకాలంలో వడదెబ్బ నుంచి తట్టుకునేందుకు ORS ద్రావణం తీసుకోవాలని సూచించారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఇది ఉచితంగా లభిస్తుందని తెలిపారు.

April 8, 2026 / 02:30 PM IST