• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

బహిరంగంగా మద్యం సేవిస్తున్న ఏడుగురిపై కేసులు

GNTR: మంగళగిరి మండలం కాజ గ్రామంలో ఆదివారం రాత్రి బహిరంగంగా మద్యం సేవిస్తున్న ఏడుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ మాట్లాడుతూ.. చట్టాన్ని ఉల్లంఘిస్తూ మద్యం సేవిస్తున్నందున చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజా ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

April 27, 2026 / 07:40 AM IST

నేటి నుంచి మే 3 వరకు వేడుకలు

WG: నరసాపురం కొప్పినీడి వారి వీధిలో ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి 39వ కళ్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం స్వామివారి కళ్యాణం కనుల పండువగా జరగనుంది. ఈ వేడుకలు మే 3 వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

April 27, 2026 / 07:36 AM IST

‘డీజిల్, పెట్రోల్‌పై అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు’

VZM: జిల్లాలో డీజిల్, పెట్రోల్‌కు ఎటువంటి కొరత లేదని ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు, రైతులు, వాహనదారులు ఆందోళన చెందన అవసరం లేదని తెలిపారు. ఈ మేరకు డీజిల్, పెట్రోల్ నిల్వలు అన్ని బంకుల్లో సమృద్ధిగా ఉన్నాయని, వదంతులు నమ్మవద్దని ఎస్పీ చెప్పారు. ఎవరైనా అసత్య ప్రచారాలు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కఠిన చర్యలు తప్పవన్నారు.

April 27, 2026 / 07:33 AM IST

విశాఖలో పెట్రోల్ గందరగోళం

విశాఖలో పెట్రోల్, డీజిల్ కొరతపై వదంతులు వాహనదారుల్లో ఆందోళన రేపుతున్నాయి. మధురవాడ, గాజువాక, కొమ్మాది ప్రాంతాల్లో కొన్ని ప్రైవేట్ బంకులు ‘నో స్టాక్’ బోర్డులు పెట్టడంతో క్యూ లైన్లు పెరిగాయి. దీంతో ప్రభుత్వ బంకులపై ఒత్తిడి పెరిగింది. జిల్లాలో తగిన నిల్వలున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలు వదంతులు నమ్మవద్దని సూచించారు.

April 27, 2026 / 07:32 AM IST

దిబగుంట్లలో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

NDL: గోస్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని దిబగుంట్ల గ్రామంలో ఆదివారం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ‘ఆపరేషన్ వజ్రపహార్’లో భాగంగా మాదకద్రవ్యాల నియంత్రణతో పాటు ప్రజల భద్రత లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు. సబ్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఇళ్లను తనిఖీ చేసి ఈమేరకు అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించారు.

April 27, 2026 / 07:32 AM IST

తవణంపల్లి ఎస్సైగా రమేశ్

CTR: తవణంపల్లి ఎస్సై బదిలీ అయ్యి సుమారు రెండు నెలలు అవుతున్న నేపథ్యంలో సోమవారం నూతన ఎస్సైగా రమేశ్ బాధ్యతలు చేపట్టనునట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం చిత్తూరు టూ టౌన్ ఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తున్న రమేశ్, తవణంపల్లి ఎస్సైగా బాధ్యతలు చేపట్టినున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

April 27, 2026 / 07:31 AM IST

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

SKLM: ఆమదాలవలసలోని ఉన్న ఒక బార్‌ షాప్‌లో ఆదివారం సాయంత్రం కసింవలస పేటకు చెందిన యువకుడు ఎస్ .దుర్గారావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్సై కాంతారావు తెలిపారు. మృతికి గల పూర్తి కారణాలు విచారణలో తెలియాల్సి ఉంది.

April 27, 2026 / 07:30 AM IST

మాచర్ల నూతన అర్బన్ ఎస్సైగా కత్తి స్వర్ణలత బాధ్యతలు

PLD: జిల్లా మాచర్ల నియోజకవర్గ పోలీస్ విభాగంలో కీలక మార్పు చోటుచేసుకుంది. మాచర్ల పట్టణ అర్బన్ ఎస్సై కత్తి స్వర్ణలత బాధ్యతలు స్వీకరించారు. నిన్నటి వరకు ఇక్కడ పనిచేసిన ఎస్సై బదిలీ కావడంతో, వారి స్థానంలో స్వర్ణలతను నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. శాంతి భద్రతలే ప్రథమ ప్రాధాన్యమని కొనియాడారు. 

April 27, 2026 / 07:29 AM IST

అధికారులతో చింతలపూడి ఎమ్మెల్యే కాన్ఫరెన్స్

ఏలూరు: జిల్లాలో తాజా పరిస్థితులపై జిల్లా మంత్రి, అధికారులతో పెట్రోలియం కంపెనీలతో చర్చించి చర్యలు చేపడుతున్నట్టు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పేర్కొన్నారు. మార్కెట్లో ఉన్న కంపెనీలలో 1, 2 మినహా అన్ని పెట్రోలియం కంపెనీలలో సరఫరాలో జరుగుతున్న జాప్యాన్ని నివారించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే 24 గంటల్లో సాధారణ పరిస్థితిలో ఏర్పడతాయన్నారు.

April 27, 2026 / 07:24 AM IST

భక్తి శ్రద్ధలతో కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు

అన్నమయ్య: మదనపల్లెలోని శాస్త్రి వీధిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఆదివారం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు, హోమాలు, అర్చనలు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది. అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.

April 27, 2026 / 07:22 AM IST

నేడు YCP ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన

KRNL: పంచాయతీ రాజ్‌ శాఖలో పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని వైసీపీ పంచాయతీ రాజ్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు అస్లాం కోరారు. బిల్లులు త్వరగా చెల్లించాలని కోరుతూ.. ఇవాళ కలెక్టరేట్ వద్ద వైసీపీ పంచాయతీ రాజ్‌ విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. నిరసన అనంతరం కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు.

April 27, 2026 / 07:16 AM IST

తీరు మారకపోతే తాట తీస్తాం: ఎస్పీ

NDL: జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో రౌడీషీటర్లు, నేరచరిత్ర కలిగిన వారికి ఆదివారం ఎస్పీ సునీల్ ఆదేశాల మేరకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరప్రవృత్తికి స్వస్తి పలికి సమాజంలో మంచి పౌరులుగా మెలగాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. పునరావాసం కోసం పోలీస్ శాఖ సహకారం అందిస్తుందన్నారు.

April 27, 2026 / 07:12 AM IST

భీమవరంలో పెట్రోల్ బంకుల తనిఖీ

WG: జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం భీమవరంలోని ఓ పెట్రోల్ బంకును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఇంధన లభ్యతను పరిశీలించారు. కృత్రిమ కొరత సృష్టించవద్దని, అవసరానికి మించి నిల్వ చేసుకోవద్దని ప్రజలకు సూచించారు. త్వరితగతిన సరఫరా చేయాలని యజమానులను ఆదేశించారు.

April 27, 2026 / 07:12 AM IST

వాసవి మాత ఉత్సవాల్లో మంత్రి సవిత సందడి

సత్యసాయి: పెనుకొండలోని వాసవీ మాత జయంతి ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించి, రథోత్సవాన్ని ప్రారంభించారు. వాసవీ మాత ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలని, ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

April 27, 2026 / 07:12 AM IST

చైన్ స్నాచింగ్ కేసు.. ఫోటో విడుదల చేసిన పోలీసులు

PPM: గుమ్మలక్ష్మీపురంలోని సంతవీధిలో రెండు రోజుల క్రితం ఓ మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసులు ఇద్దరు దుండగులు దొంగలించి పారిపోయిన ఘటన విదితమే. ఈ మేరకు ఎల్విన్‌ పేట పోలీసులు ఆదివారం దొంగతనానికి సంబంధించి అనుమానిత ఓ వ్యక్తి ఫోటోను విడుదల చేశారు. ఆ వ్యక్తి వివరాలు తెలిసినా, కనిపించినా సమీప పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సీఐ హరి తెలిపారు.

April 27, 2026 / 07:09 AM IST