• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వీఆర్వో మృతికి నివాళులర్పించిన అధికారులు

W.G: వీఆర్వో చిన్న మరణం రెవెన్యూ శాఖకు తీరని లోటని నరసాపురం తహశీల్దార్ ఐవివి సత్యనారాయణ అన్నారు. ఇవాళ తహసీల్దార్ కార్యాలయంలో అనారోగ్యంతో అకాల మరణం చెందిన కటకంశెట్టి సూర్యనారాయణ (చిన్నా)కి రెవెన్యూ సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. సత్యనారాయణ అధ్యక్షతనలో సంతాప సభ నిర్వహించారు.

April 29, 2026 / 07:23 PM IST

అలెర్ట్.. రేపే లాస్ట్ డేట్..!

NDL: బేతంచర్ల నగర పంచాయతీ పరిధిలో పెండింగ్లో ఉన్న ఆస్తి పన్నులపై 50% వడ్డీ మాఫీ రాయితీ గడువు రేపటితో ముగుస్తుందని కమిషనర్ హరి ప్రసాద్ తెలిపారు. ఈనెల 9 నుంచి పొడిగించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 2025-26 సంవత్సరానికి ముందస్తుగా పన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ లభిస్తుందని పేర్కొన్నారు. పన్ను బకాయిలు ఉన్నవారు త్వరగా చెల్లించాలని సూచించారు.

April 29, 2026 / 07:22 PM IST

హత్య కేసులోని నింధితుడు అరెస్ట్

ఏలూరు టూ టౌన్ పరిధిలో జరిగిన బంటు అంజలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. పెళ్లి పేరుతో మోసం చేసి, అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే నిందితుడు ఆమెను హత్య చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా రాజమండ్రిలో ఇవాళ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అనుమానస్పద మృతినీ విచారణ అనంతరం హత్య కేసుగా మార్చామన్నారు

April 29, 2026 / 07:21 PM IST

‘పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలి’

BPT: బల్లికురవ మండలం కొణిదెన గ్రామంలో అద్దంకి వైసీపీ ఇంఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పార్టీ నాయకులతో సమావేశమై పార్టీ బలోపేతంపై సుధీర్ఘంగా చర్చించారు. స్థానిక సమస్యలు, ప్రజల అభ్యర్థనలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు. పార్టీని గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

April 29, 2026 / 07:19 PM IST

తాగి వాహనం నడిపిన వ్యక్తికి జరిమానా

VZM: మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు రూ.10,000 జరిమానా ఇవాళ విధించింది. రోజువారీ తనిఖీల్లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని నెల్లిమర్ల ఎస్సై గణేష్ ఈ సందర్బంగా తెలిపారు. ఇకపై మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా తప్పదని హెచ్చరించారు.

April 29, 2026 / 07:17 PM IST

‘శాఖల పనితీరు 100శాతం మెరుగుపడాలి’

ASR: ప్రభుత్వ శాఖలు 100శాతం లక్ష్యాలు సాధించేందుకు, ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించేందుకు కార్యక్రమాలన్ని ఈఆఫీసులోనే నిర్వహించాలని కలెక్టర్ నిషాంతి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో ఈ-ఆఫీస్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధికార యంత్రాంగం, జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు శిక్షణ ఏర్పాటు చేశామన్నారు, 

April 29, 2026 / 07:11 PM IST

జిల్లాలో NTR భరోసా పింఛన్లకు నిధులు విడుదల

ATP: జిల్లాలో ఏప్రిల్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లాలోని 2,75,973 మంది లబ్ధిదారుల కోసం రూ. 124.01 కోట్ల నిధులను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. మే 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వచ్చి పింఛన్ మొత్తం అందజేయనున్నారు.

April 29, 2026 / 07:06 PM IST

‘ఎండాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

NLR: ఎండాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు, సీఐ శ్రీనివాసరావు సూచించారు. బుచ్చి పట్టణంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించి, మాట్లాడారు. పరిసరాల ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు మొలవడం వల్ల మల విసర్జనకు వెళ్లిన వారు సిగరెట్టు తాగి నిప్పురవ్వలు అక్కడ వేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

April 29, 2026 / 07:05 PM IST

వ్యక్తిగత విమర్శలు చేయడం తగదు: హమమప్ప

సత్యసాయి: మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి హనుమప్ప డిమాండ్ చేశారు. బుధవారం పరిగి టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రి సవితపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. సవిత నాయకత్వంలో పెనుకొండ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, దాన్ని చూసి ఓర్వలేక పోతున్నారన్నారు.

April 29, 2026 / 07:04 PM IST

‘మే 2లోగా దరఖాస్తు చేసుకోండి’

E.G: అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్త, ఆయా పోస్టుల భర్తీకి మే 2వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని సూపర్వైజర్ అచ్చాయమ్మ తెలిపారు. కోరుకొండ ఐసీడీఎస్ పరిధిలోని ఇనుగంటివారిపేట, సీతానగరం, అశోక నగర్ కేంద్రాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. 21 నుంచి 35 ఏళ్ల వయసున్న స్థానిక మహిళలు ఈ పోస్టులకు అర్హులని, ఆసక్తి గలవారు వెంటనే కోరుకొండ కార్యాలయంలో సంప్రదించాలని అధికారులు సూచించారు.

April 29, 2026 / 07:02 PM IST

‘టీడీపీని మరింత బలోపేతం చేయాలి’

AKP: టీడీపీ శ్రేణులు క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్రస్థాయి కార్యదర్శిలకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో మాట్లాడారు. నాయకులు ప్రజా సమస్యలపై స్పందించాలన్నారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకు వెళ్లాలన్నారు.

April 29, 2026 / 07:00 PM IST

వేసవి శిక్షణ తరగతులు.. ఇంగ్లీష్‌పై అవగాహన

NTR: తిరువూరు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉచిత వేసవి శిక్షణ తరగతులలో భాగంగా ఇంగ్లీష్‌పై ఉపాధ్యాయుడు రాంప్రదీప్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు నిత్య జీవితంలో వివిధ సందర్భాలలో ఎదురయ్యే పరిస్థితులను తీసుకుని వాటిని ఆంగ్లంలో ఏ విధంగా ఉపయోగించాలి. ఆంగ్లంలో మాట్లాడేటప్పుడు సహజంగా చేసే కొన్ని పొరపాట్లు మొదలైన వాటి గురించి వివరించారు.

April 29, 2026 / 06:50 PM IST

‘జూన్ నాటికి కునుతూరు లేఅవుట్ పనులు పూర్తి చేయాలి’

ATP: ధర్మవరం మండలం కునుతూరు అహుడా లేఅవుట్‌లో అభివృద్ధి పనులను జూన్ నాటికి పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన లేఅవుట్‌ను సందర్శించి రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులను తనిఖీ చేశారు. నాణ్యతతో కూడిన పనులను వేగవంతం చేయాలని, గడువులోగా లేఅవుట్‌ను సిద్ధం చేయాలని సూచించారు.

April 29, 2026 / 06:44 PM IST

ఎస్టీ కాలనీ రోడ్డు నిర్మాణానికి రూ.80 లక్షలు మంజూరు

CTR: విజయపురం(M) శ్రీహరిపురం ఎస్టీ కాలనీలో రోడ్డు నిర్మాణానికి నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ రూ.80 లక్షలు మంజూరు చేయించారు. దశాబ్దాలుగా సరైన రహదారి లేక ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసుల కష్టాలు దీనితో తీరనున్నాయి. ప్రస్తుతం రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తమ చిరకాల వాంఛను నెరవేర్చినందుకు కాలనీ వాసులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

April 29, 2026 / 06:43 PM IST

వరకట్నంపై అవగాహన కార్యక్రమం

VSP: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో “వరకట్న నిషేధ చట్టం-1961”పై అవగాహన కార్యక్రమం పెందుర్తిలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీఏ సన్యాసినాయుడు వరకట్నం తీసుకోవడం, ఇవ్వడం నేరమని తెలిపారు. నేరస్తులకు జైలు శిక్షలు, జరిమానాలు ఉంటాయని హెచ్చరించారు. మహిళలు భయపడకుండా ఫిర్యాదు చేయాలని, 1098 వంటి హెల్ప్‌లైన్‌లను వినియోగించుకోవాలని సూచించారు.

April 29, 2026 / 06:41 PM IST