• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

క్రికెట్ బెట్టింగ్‌లపై పోలీసుల నిఘా.!

NTR: విజయవాడలో IPL సీజన్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్‌పై పోలీసులు కఠిన నిఘా ఏర్పాటు చేశారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్.వీ. రాజశేఖర బాబు ఆదేశాలతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్‌పై హైటెక్ నిఘా కొనసాగుతోంది. సోషల్ మీడియాలో బెట్టింగ్ ప్రచారాలపై ట్రాకింగ్ జరుగుతోంది. నిందితులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.

April 13, 2026 / 06:06 PM IST

స్టోన్ కటింగ్ మిషన్ కాలిపై పడి వ్యక్తికి తీవ్రగాయాలు

KDP: జమ్మలమడుగు(M) లింగాపురంకి చెందిన సుదీప్ ఆంజనేయపురం వద్ద కూలీ పని చేస్తుండగా స్టోన్ కటింగ్ మిషన్ అతని ఎడమ కాలిపై పడింది. దీంతో కాలుకి తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న EMT రామ మునయ్య, పైలెట్ గురు మోహన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స చేస్తూ ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 13, 2026 / 06:04 PM IST

కాకినాడలో త్రాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

KKD: కాకినాడ నగరంలో త్రాగునీటి ఎద్దడి నివారణకు సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ తెలిపారు. సోమవారం నగరంలోని గుడారిగుంట ప్రాంతంలోని లక్ష్మీనగర్, ఆర్ఆర్ నగర్ ప్రాంతాల్లో ఆయన అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను నేరుగా కమిషనర్ సత్యనారాయణ అడిగి తెలుసుకున్నారు.

April 13, 2026 / 06:00 PM IST

రేపు ఉరవకొండలో మంత్రి పయ్యావుల పర్యటన

ATP: ఉరవకొండ పట్టణ కేంద్రంలో మంగళవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటించనున్నారని ఏఎస్ డబ్ల్యూవో రామ్మోహన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అంబేద్కర్ జయంతి వేడుకలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారన్నారు. అధికారులు, దళిత సంఘాల ప్రతినిధులు, కూటమి నాయకులకు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

April 13, 2026 / 06:00 PM IST

రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపిన కూటమి ఎంపీలు

KRNL: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా సోమవారం భేటీ అయ్యారు. అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్ర కూటమి ఎంపీలతో కలిసి రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి యొక్క చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను లోకేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ నాగరాజు సహా ఇతర ఎంపీలు పాల్గొన్నారు.

April 13, 2026 / 05:56 PM IST

మీకోసం కార్యక్రమంలో 74 అర్జీలు

ప్రకాశం: ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు 74 అర్జీలు వచ్చాయి. ప్రజలతో నేరుగా మాట్లాడిన ఎస్పీ అర్జీలను పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మీకోసం కార్యక్రమం జరిగింది.

April 13, 2026 / 05:55 PM IST

పీఎం సూర్య ఘర్ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

PLD: రాజుపాలెం గ్రామంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పీఎం సూర్య ఘర్’ పథకాన్ని సోమవారం సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. పేదల ఇళ్లలో వెలుగులు నింపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.1200 కోట్లు ఖర్చు చేస్తున్నాయని పేర్కొన్నారు.

April 13, 2026 / 05:54 PM IST

కార్యకర్తను పరామర్శించిన TDP జిల్లా అధ్యక్షురాలు

KRNL: ఆదోని మండల అధ్యక్షుడు శివప్ప కుమారుడు వీరేంద్ర అనారోగ్యంతో ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించారు. వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వీరేంద్ర త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

April 13, 2026 / 05:46 PM IST

విద్యార్థులకు క్రీడా దుస్తులు వితరణ

ELR: నూజివీడు మండలంలోని దిగవల్లి జడ్పీ హైస్కూల్ ఆవరణములో బాస్కెట్ బాల్ క్రీడలో శిక్షణ పొందుతున్న విద్యార్థినీ విద్యార్థులకు PACS అధ్యక్షులు ఎలమంచిలి నాగేంద్రప్రసాద్, మాజీ ఎంఈఓ దిగవల్లి రాంబాబులు సోమవారం స్పోర్ట్స్ యూనిఫామ్ వితరణగా అందించారు. హెచ్ఎం సునీత మాట్లాడుతూ.. తమ పాఠశాల విద్యార్థులకు యూనిఫాం వితరణగా అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

April 13, 2026 / 05:45 PM IST

జూద స్థావరంపై పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్

BPT: పర్చూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనగల్లు గ్రామంలో జూదం జరుగుతోందన్న సమాచారం మేరకు ఎస్సై తమ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఐదుగురు జూదరులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.4,930 నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాట, కోడి పందాలు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

April 13, 2026 / 05:44 PM IST

పెద్దకడబూరులో చలివేంద్రం ప్రారంభం

KRNL: పెద్దకడబూరు MRO కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని తహసీల్దార్ వలిబాషా ఇవాళ ప్రారంభించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కార్యాలయానికి వచ్చే ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రోజువారీగా కార్యాలయానికి వచ్చే ప్రజలు దాహార్తితో ఇబ్బంది పడకుండా ఉండేందుకు చలివేంద్రం ఉపయోగపడుతుందన్నారు.

April 13, 2026 / 05:42 PM IST

మహిళలకు ప్రభుత్వం సమాన అవకాశాలు కల్పిస్తోంది: కలెక్టర్

KRNL: ఢిల్లీలో జరిగిన నారీ శక్తి వందన్ సమ్మేళనంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన సందేశాన్ని సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి వీక్షించారు. మహిళా సాధికారత, స్వయం ఉపాధిపై ప్రధాని చేసిన ప్రసంగాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు ఆసక్తిగా వీక్షించారు. మహిళలకు ప్రభుత్వం సమాన అవకాశాలు కల్పిస్తోందన్నారు.

April 13, 2026 / 05:40 PM IST

జనతా వారధి ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం: బీజేపీ

VSP: బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘జనతా వారధి’ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డా. కేఎన్ఆర్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడు పరశురాం రాజు, కన్వీనర్ పొలిమేర శ్రీనివాస్ కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి వినతులు స్వీకరించారు. వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

April 13, 2026 / 05:40 PM IST

‘కార్యకర్తల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి’

AKP: టీడీపీ కార్యకర్తల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు అప్పలనాయుడు తెలిపారు. ఇవాళ కే కోటపాడు మండలం గొట్లం, శృంగవరంలో పర్యటించి కార్యకర్తల సమస్యలు తెలుసుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పూర్తితో ‘కార్యకర్తే అధినేత’ కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు.

April 13, 2026 / 05:40 PM IST

ఎక్స్ మినిస్టర్‌కు ధన్యవాదాలు తెలిపిన నేతలు

ప్రకాశం: జరుగుమల్లికి చెందిన వైసీపీ నాయకుడు కొండూరి హర్షవర్ధన్ రెడ్డికి కీలక పదవి దక్కింది. ఆయన YCP స్టేట్ వాలంటరీ వింగ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సోమవారం జరుగుమల్లి వైసీపీ మండల అధ్యక్షుడు పిన్నిక శ్రీనివాసరావుతో పలువురు నాయకులు ఆదిమూలపు సురేశ్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.

April 13, 2026 / 05:38 PM IST