కాకినాడ: కోరంగి అభయారణ్యంలో పర్యాటకుల కోసం 2.295 కిలోమీటర్ల పొడవైన చెక్క నడక దారి ఉంది. ఆసియాలోనే రెండో అతిపెద్దదిగా గుర్తింపు పొందిన ఈ వంతెనను ఒక్క చెట్టు కూడా నరకకుండా నిర్మించారు. అభయారణ్యంలో 40 మీటర్ల ఎత్తులో ఉన్న వాచ్ టవర్ ద్వారా మొత్తం అడవిని ‘బర్డ్స్ ఐ వ్యూ’ లో చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఇక్కడ RX100లో పిల్లారా వంటి పాటలు కూడా చిత్రీకరించారు.
PPM: సీతంపేట ఐటీడీఏ పరిధిలోని ఏకైక పెట్రోల్ బంకులో గత రెండు రోజులుగా డీజిల్, పెట్రోల్ లభ్యం కావడం లేదు. ఇంధన నిల్వలు లేకపోవడంతో బంకు వద్ద ‘నో స్టాక్’ బోర్డులు ఏర్పాటు చేయగా, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే సరఫరా పునరుద్ధరించాలని అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
కృష్ణా: మచిలీపట్నంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ బాలాజీ ప్రజల వద్ద నుంచి 104 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీల రూపంలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ATP: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మంగళవారం తెల్లవారుజామున నగరంలోని 26వ డివిజన్లో ఆకస్మికంగా పర్యటించారు. కమిషనర్ జశ్వంత్ రావుతో కలిసి రాజీవ్ చిల్డ్రన్స్ పార్క్ పరిసరాలను పరిశీలించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నగరంలోని 28 పార్కుల్లో స్పెషల్ డ్రైవ్ ద్వారా తాగునీరు, టాయిలెట్స్ వంటి మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
కాకినాడ: యు. కొత్తపల్లి మండలం నాగులపల్లి రక్షిత మంచినీటి చెరువులో ఉన్న చేపలు మృతి చెందాయి. మూడు రోజుల నుండి మృతి చెందిన చేపలు అక్కడే ఉండిపోవడంతో దుర్వాసన వెదజల్లుతుంది. దీంతో 18 గ్రామాల ప్రజలు త్రాగునీరు తాగాలా వద్ద అనే సందేహంలో ఉన్నారు. వేసవకాలంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ELR: చింతలపూడిలోని శాఖ గ్రంథాలయంలో ఈనెల 28 నుంచి జూన్ 6 వరకు వేసవి విజ్ఞాన శిబిరాలను ప్రారంభిస్తున్నట్లు గ్రంథాలయ అధికారి వర్మ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పుస్తక పఠనం, వ్యక్తిత్వ వికాసం, చిత్రలేఖనం, హస్త కళలు, యోగ, ధ్యానం, క్విజ్, వక్రత్వం, వ్యాసరచన వంటి పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున ఈ వేసవి విజ్ఞాన శిబిరాలను చిన్నారులు సద్వినియోగం చేసుకోవాల
KRNL: రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టులో అవకతవకలు చేసి ఇప్పుడు ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఇవాళ వైసీపీపై ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ధ్వజమెత్తారు. RDS, గుండ్రేవుల, వేదావతి ప్రాజెక్టులను రివర్స్ టెండరింగ్ పేరుతో రద్దు చేసి సీమకు ద్రోహం చేశారనన్నారు. పట్టిసీమ ద్వారా CM చంద్రబాబు నీళ్లు తెచ్చినా వైసీపీ నేతలు విమర్శించారని మండిపడ్డారు.
మార్కాపురం పట్టణంలోని పెట్రోల్ బంకులను కలెక్టర్ విజయ సునీత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాటిల్స్, క్యాన్లలో పెట్రోల్ విక్రయించవద్దని యజమానులను హెచ్చరించారు. సాధారణ విధానంలోనే ప్రజలకు ఇంధనం అందించాలని సూచించారు. పట్టణంలో ఎటువంటి కొరత లేదని స్పష్టం చేస్తూ ‘నో స్టాక్’ బోర్డులు పెట్టరాదన్నారు. ఇబ్బందులు ఉంటే వెంటనే తెలియజేయాలన్నారు.
KDP: సిద్దవటం మండలం మాధవరం-1లోని శ్రీ భద్రావతి బావనారాయణ దేవస్దానంలో 29వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రి భద్రావతి భావనారాయణ స్వాముల వారికీ పానుపు సేవా కార్యక్రమం వైభవంగా జరిగింది. అనంతరం మహిళలు నిర్వహించిన కోలాట ప్రదర్శన ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. గ్రామంలోని ప్రజలు కోలాట ప్రదర్శనను ఆసక్తికరంగా తిలకించారు.
కోనసీమ: రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చిన ఘనత మాజీ సీఎం జగన్‌కి దక్కుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. మంగళగిరిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పాలనలో రాష్ట్రానికి రావలసిన పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయని అన్నారు. జే-బ్రాండ్ మద్యం పేరుతో నాసిరకం మద్యం విక్రయించి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడారని ఆరోపించారు.
TPT: నాగలాపురం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందుల కొరత తీవ్రంగా ఉండడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసారు. రోజుకు 150 మందికి పైగా ఓపీకి వస్తున్నప్పటికీ అవసరమైన మందులు అందడం లేదని తెలిపారు. సాధారణ జ్వరం, షుగర్, బీపీ రోగులకు కూడా ప్రైవేట్ మెడికల్ షాపులను ఆశ్రయించాల్సి వస్తోంది. మందులు అందుబాటులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.
VSP: విశాఖలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మంగళవారం జరిగిన సమావేశానికి ముందు వచ్చిన ప్రజల సమస్యలు తెలుసుకుని సుమారు 60 వినతిపత్రాలు తీసుకున్నారు. అనంతరం గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లారు.
CTR: నగరి నియోజకవర్గం పరిధిలోని కాకవేడు AAW ప్రాంతంలో తాగునీటి సమస్య నెలకొంది. సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉండేలా ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా ఏర్పాటు చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు.
సత్యసాయి: మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు చిత్రపటానికి మంత్రి సత్య కుమార్ యాదవ్ మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కలిసి పరామర్శించారు. భాస్కరరావు మృతి తెలుగు రాజకీయాలకు తీరని లోటని మంత్రి స్మరించుకున్నారు.
E.G: రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు సెంటర్ నుంచి బాలాజీ పేట వెళ్లే ప్రధాన రహదారిలో జరుగుతున్న పారిశుధ్య పనులను రాజమండ్రి రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ మత్సేటి శివసత్య ప్రసాద్ మంగళవారం పరిశీలించారు. పారిశుద్ధ్య సిబ్బంది సమన్వయంతో పని చేసి పట్టణ పరిశుభ్రతను మెరుగుపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.