CTR: జనగణన 2027లో భాగంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్వీయ గణన పూర్తి చేశారు. బీవీ రెడ్డి కాలనీలోని తన నివాసంలో ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా గృహ వివరాలను నమోదు చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా జనగణనలో భాగస్వాములు కావాలని, ఏప్రిల్ 16 నుంచి 30 వరకు స్వీయ నమోదు అవకాశం ఉందని తెలిపారు. మే 1 నుంచి అధికారుల ద్వారా మొదటి దఫా గణన ప్రారంభమవుతుందని చెప్పారు.
TPT: జనతా వారధి కార్యక్రమంలో భాగంగా బీజేపీ నేతలు పీజీఆర్‌ఎస్‌లో జిల్లా డీఆర్వోకు వినతిపత్రం సమర్పించారు. గ్రామాల్లో తడి & పొడి చెత్తా సేకరణ, కంపోస్ట్ యూనిట్లు సరిగా పనిచేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పనిచేయని కంపోస్ట్ యూనిట్ల పునరుద్ధరణ, చెత్త వర్గీకరణ కఠినంగా అమలు, పారిశుధ్య కార్మికుల నియామకం, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ELR: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు పోటీతత్వంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ ప్రోగ్రాంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి అర్జీని చాలెంజీగా తీసుకుని నిర్ణీత సమయంలో శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. అలాగే ఈరోజు జరిగిన పీజీఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్లలో 257 అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు.
తూ.గో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి ప్రభుత్వ బాలుర పర్యవేక్షణ గృహాన్ని సోమవారం సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు. పర్యవేక్షణ గృహంలో ఉన్న బాలురతో మాట్లాడి వారి బాగోగులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలురకు ఆమె పలు సూచనలు చేశారు. వ్యసనాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలని, విద్యపై దృష్టి సారించాలన్నారు.
ATP: పామురాయి సమీపంలో జరిగిన మైనర్ బాలుడి హత్య కేసును అనంతపురం రూరల్ పోలీసులు 48 గంటల్లో ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. రజక కాలనీకి చెందిన కళ్యాణ్ సాత్విక్ అనే బాలుడిని, రామమోహన్ సిమెంట్ పెల్లలతో తలపై కొట్టి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. తన భార్యతో బాలుడు సన్నిహితంగా ఉన్నాడనే అనుమానంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
W.G: జిల్లా కలెక్టర్ నాగరాణిని భీమవరం కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నూతనంగా విధుల్లో జాయిన్ అయిన జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి బి.సుబ్బారావు మర్యాదపూర్వకంగా కలిశారు. అక్రమ మద్యం రవాణా అరికట్టడానికి కృషి చేయాలని, మద్యం షాపులు నిర్వహణను నిబంధనల మేరకు నిర్వహించేలా చూడాలని ఆదేశించారు.
KRNL: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల్లో అన్ని వసతులు ఉన్నాయని, విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ చేసుకోవాలని UTF జిల్లా అధ్యక్షులు రవికుమార్, KDCC దానమయ్య ఛైర్మన్ పేర్కొన్నారు. ఇవాళ గూడూరు పట్టణంలో ‘ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దాం’ కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లో చేర్పించాలన్నారు.
GNTR: దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిన గుంటూరు జిల్లా కలెక్టర్ సీ.యం. సాయి కాంత్ వర్మ ట్రైసైకిళ్లు, వీల్‌చైర్లు, వినికిడి ఉపకరణాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
కోనసీమ: రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగ నోట్లు ముద్రిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం అమలాపురం SP కార్యాలయంలో SP రాహుల్ మీనా వివరాలు వెల్లడించారు. వేములపల్లి గ్రామంలో మీసాల అప్పలరాజు, బత్తుల శ్రీను, ముబ్బాడి దేవి ప్రసాద్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.500 నకిలీ నోట్లు, ముద్రణ పరికరాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.
ప్రకాశం: ఎర్రగొండపాలెం స్థానిక R&B బంగ్లాలో బీజేపీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తలకు SIRపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ BLA1 ఆర్.ఏ. రమణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి తంగిరాల అశోక్ రెడ్డి దీనికి హాజరయ్యారు. కాగా, NWC మార్కాపురం జిల్లా ఛైర్మన్‌గా నియమితులై తొలిసారి వచ్చిన అశోక్ రెడ్డిని మండల బీజేపీ నాయకులు ఘనంగా సత్కరించారు.
NDL: ఆత్మకూరులో సీఎం చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. అన్నా క్యాంటీన్ వద్ద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పేదలకు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
W.G: నిషేధిత భూముల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ కోసం గ్రామ సభ నిర్వహించినట్లు VRO చిన్నారావు తెలిపారు. ఉండి మండలం మహాదేపట్నం గ్రామంలో సోమవారం గ్రామ సభ జరిగింది. కేవలం రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చాయని ఆయన పేర్కొన్నారు. పంచాయితీ సెక్రటరీ, ఆర్ఐ, ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్, SR డిపార్ట్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు.
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సోమవారం నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 115 ఫిర్యాదులు స్వీకరించారు. భూ వివాదాలు, మోసాలు, వేధింపులు, రోడ్డు ప్రమాదాలు తదితర సమస్యలపై వినతులు అందాయి. ప్రతి ఫిర్యాదుపై చట్టపరంగా విచారణ చేసి త్వరితగతిన న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.
కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 25న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి. శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన అభ్యర్థులు పాల్గొనవచ్చని తెలిపారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్ జిరాక్స్‌లతో ఆరోజు ఉదయం 10:30 గంటలకు హాజరు కావాలన్నారు. వివరాలకు 8639846568 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 113 అర్జీలు స్వీకరించబడినట్లు కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. ప్రతి అర్జీపై ప్రత్యేక దృష్టి పెట్టి, సమస్యలను నాణ్యంగా, గడువులో పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో ఆలస్యం, నిర్లక్ష్యానికి తావులేకుండా పని చేయాలని హెచ్చరించారు.