ATP: CM చంద్రబాబు నాయుడు జన్మదినం రోజు ఏప్రిల్ 20 నుంచి రాయదుర్గం నియోజకవర్గంలో పది రోజులపాటు ప్రగతి పండుగ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. రాయదుర్గంలో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నెల 11 లోపు వెయ్యి మంది పేదలకు ఇంటి పట్టాల పంపిణీ చేస్తామని తెలిపారు.
ELR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ కార్యాలయంలో ఛైర్పర్సన్ పద్మశ్రీ అధ్యక్షతన గురువారం జిల్లా పరిషత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు త్వరితగతిన పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని ఆమె సూచించారు. పీఎఫ్ విభాగంలో పెండింగ్ ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
VSP: గాజువాకలోని మసీదు వద్ద ఇద్దరు యువకులు అనుమానస్పదంగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకున్నామని గాజువాక క్రైమ్ ఎస్సై సీహెచ్ హరికృష్ణ గురువారం తెలిపారు. గాజువాక ప్రాంతానికి చెందిన గండి బోయిన ఉదయ్ కిరణ్, తురక దుర్గారావు వద్ద నుంచి తనిఖీ చేసి బంగారం, 45 తులాల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నామన్నారు.
VZM: 2022లో జామి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బంగారం చోరీ కేసులో నిందితుడికి కోర్టు రూ.10,000 జరిమానా విధించినట్లు ఎస్సై వై.వి. జనార్ధన్ గురువారం తెలిపారు. అన్నంరాజుపేట గ్రామానికి చెందిన మంగమ్మ వద్దకు ఫ్లోర్ క్లీనింగ్ నెపంతో ఇద్దరు వ్యక్తులు వచ్చి, ఆమె మెడలోని బంగారు గొలుసును బలవంతంగా లాకెళ్లారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడికి తీర్పుని వెల్లడించింది.
శ్రీకాకుళం నగర పరిధిలోని నాగావళి నదిలో అనుమతి లేకుండా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు ఫిర్యాదు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ సి. మోహనరావు నేతృత్వంలో గురువారం తనిఖీలు నిర్వహించి, ఇసుక తరలిస్తున్న ఎక్స్కవేటర్, ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. గత ఏడాది డిసెంబర్‌తో అనుమతులు ముగిశాయని స్థానికలు పేర్కొన్నారు.
సత్యసాయి: విజయవాడలో విద్యుత్, జౌళి శాఖాధికారుల సమన్వయ సమావేశంలో మంత్రి సవిత కీలక నిర్ణయాలు వెల్లడించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి చేనేత, పవర్లూమ్ కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుందని ప్రకటించారు. చేనేతలకు 200 యూనిట్లు, పవర్లూమ్ మగ్గాలకు 500 యూనిట్ల వరకు రాయితీ కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇందు కోసం రూ.150 కోట్లు వెచ్చిస్తోందని తెలిపారు.
KRNL: ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో ఆన్లైన్ బెట్టింగ్‌లు, జూద కార్యకలాపాలపై దేవనకొండ పోలీసులు కఠిన నిఘా ఏర్పాటు చేశారు. గురువారం సీఐ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఐపీఎల్ బెట్టింగ్‌లు, ఆన్లైన్ రమ్మీ, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు.
కోనసీమ: అల్లవరం మండలం ఓడలరేవు తీర ప్రాంతంలో సముద్రపు కోతను అరికట్టడానికి గ్రోయింగ్స్ తోటల పెంపకానికి ఓఎన్జీసీ సహ కారంతో సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. గురువారం ఓఎన్జీసీ, అటవీ, రెవెన్యూ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి భూసేకరణ ప్రత్యామ్నాయ భూమి సేకరణ భూ పరిహారాలు చెల్లింపు అంశాలపై సమీక్షించారు.
KKD: తునిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉరేసుకొని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై విజయబాబు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని 1వ వార్డు డ్రైవర్స్ కాలనీలో నివాసం ఉంటున్న తాటిపర్తి బాలాజీ(28) అనే యువకుడు గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు సమాచారం. మృతుడు ప్రత్తిపాడు ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు.
KDP: జమ్మలమడుగు దిగువపట్నం కాలనీలో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం జరిగింది. ఆళ్లగడ్డ సుధాకర్ (45) అనే వ్యక్తి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గురువారం రేకుల ఇంట్లో పైపునకు చీరతో ఉరేసుకుని చనిపోయినట్లు చెప్పారు. కుటుంబ కలహాలే దీనికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KDP: పదో తరగతి పరీక్షల మూల్యాంకన రుసుమును 100% పెంచాలని కోరుతూ APTF నాయకులు గురువారం DEO శంషుద్దీన్‌కు వినతిపత్రం అందజేశారు. మూల్యాంకన విధుల్లో పాల్గొనే స్పెషల్ అసిస్టెంట్లకు TA,DAలు చెల్లించాలని, ట్యాబ్‌లలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని కోరారు. APTF జిల్లా అధ్యక్షుడు ఖాదర్ బాషా ఆధ్వర్యంలో ఉపాధ్యాయ నేతలు DEOను కలిసి తమ సమస్యలను వివరించారు.
NLR: కలువాయి మండలంలోని సచివాలయం సమీపంలో గురువారం రాత్రి 2 బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని రక్షించే ప్రయత్నాలు చేశారు. అనంతరం 108కు సమాచారం అందించగా క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.
ASR: జీకేవీధి మండలం సీలేరు మేజర్ పంచాయతీ అభివృద్ధి కోసం ప్రత్యేక కృషి చేస్తానని పంచాయతీ ప్రత్యేక అధికారి, మండల వ్యవసాయ అధికారి దాసరి గిరిబాబు అన్నారు. గురువారం ఆయన సీలేరు మేజర్ పంచాయతీ అధికారిగా నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పంచాయతీ, సచివాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
VZM: గజపతినగరం ప్రోహిబిషన్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని నెలివాడలో అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ జనార్దనరావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిందితుడి వద్ద నుంచి 8 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
PPM: అమరావతిలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర, రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో గడ్డం శేఖర్ బాబును కలిశారు. ఈ సందర్భంగా పార్వతీపురంలో 200 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఈవో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు స్థల సేకరణ చేసి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.