• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

30న మండల సర్వసభ్య సమావేశం

అన్నమయ్య: ములకలచెరువు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 30న నిర్వహించనున్నట్లు ఇంఛార్జ్ ఎంపీడీవో రమణ ప్రకాష్ తెలిపారు. ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. మండల అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు వెల్లడించారు.

April 28, 2026 / 09:25 AM IST

ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు పొడిగింపు

KRNL: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు కర్నూలు ఆర్ఐవో లాలప్ప ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫెయిలైన విద్యార్థులు, ఇంప్రూమెంట్ రాసే విద్యార్థులు ఈనెల 30వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్ ఫీజును ప్రకటించిన తేదీల్లోనే చెల్లించాలని తెలిపారు.

April 28, 2026 / 09:13 AM IST

ఘనంగా శ్రీ పైడితల్లి అమ్మవారు దేవరోత్సవం

VZM: శ్రీ పైడితల్లి అమ్మవారి దేవరోత్సవం స్థానిక హుకుంపేటలో సోమవారం అర్ధరాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఘటాలను దర్శించుకుని పసుపు, కుంకుమ సమర్పించారు. అనంతరం చిత్ర, విచిత్ర వేషధారణలతో అంగరంగ వైభవంగా ఘటాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి అర్ధరాత్రి తర్వాత మూడు లాంతర్ల వద్దనున్న చదరుగుడిలో ప్రతిష్టించారు.

April 28, 2026 / 09:07 AM IST

బొమ్మనహాల్ మండలంలో 13.2 మి.మీ వర్షపాతం నమోదు

ATP: జిల్లాలో గత 24 గంటల్లో స్వల్ప వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉదయం 8 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా రెండు మండలాల్లో వర్షం కురిసింది. బొమ్మనహాల్ మండలంలో గరిష్ఠంగా 13.2 మి.మీ, డీ హీరేహాల్ మండలంలో 9.8 మి.మీ వర్షపాతం రికార్డయ్యింది. జిల్లా మొత్తం 23 మి.మీ వర్షం కురవగా, సగటున 0.7 మి.మీగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

April 28, 2026 / 09:06 AM IST

రూ.కోటితో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

నెల్లూరు: కావలి పట్టణంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డితో కలిసి పర్యటించారు. అనంతరం కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు రైల్వే అండర్ పాస్‌ను పరిశీలించారు. ఉదయగిరి రోడ్డు నుంచి ఐడీఎస్ఎంటీ లేఅవుట్ వరకు కోటి రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి కలెక్టర్ శంకుస్థాపన చేశారు. దీంతో వెంగళరావు నగర్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

April 28, 2026 / 09:06 AM IST

రేపు ధర్మవరంలో శ్రీ లక్ష్మీచెన్నకేశవ స్వామి రథోత్సవం

సత్యసాయి: ధర్మవరంలో శ్రీ లక్ష్మీచెన్నకేశవ స్వామి రథోత్సవం బుధవారం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది. రథోత్సవం కోసం ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు క్రమశిక్షణతో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నారు.

April 28, 2026 / 09:06 AM IST

రావణబ్రహ్మ వాహనంపై అగస్త్యేశ్వరుడు

KDP: ప్రొద్దుటూరు అగస్త్యేశ్వర స్వామి ఆలయంలోని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు సోమవారం స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. గణపతి, నవగ్రహ, రుద్ర, దీక్ష హోమాలను నిర్వహించారు. గంగా గౌరీ సమేత అగస్త్యేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను రావణబ్రహ్మ వాహనంపై కొలువు దీర్చారు. భక్తిశ్రద్ధలతో స్వామివారిని ఊరేగించారు.

April 28, 2026 / 09:04 AM IST

అంగరంగ వైభవంగా వేంకటేశ్వరస్వామి కళ్యాణం

ASR: అరకులోయలో వేంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవాన్ని శాస్ర్తోక్తంగా వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, కరతాళ ధ్వనుల మధ్య సాగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వేంకటేశ్వరస్వామి అలివేలుమంగ, పద్మావతి అమ్మవార్ల మెడలో మంగళ్యధారణ చేశారు. ఆ సమయంలో ఆలయ ప్రాంగణం “గోవిందా” అనే నామస్మరణతో మారుమ్రోగింది.

April 28, 2026 / 09:01 AM IST

సీతానగరంలో ఇసుక అక్రమ రవాణా జోరు

తూ.గో: సీతానగరం మండలం మునికూడలి, కాటవరం ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోందని స్థానికులు పేర్కొన్నారు. భారీ యంత్రాలతో రాత్రింబవళ్లు నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. అధికారుల పర్యవేక్షణ లేక రోడ్లు దెబ్బతిని, పర్యావరణానికి నష్టం కలుగుతోందన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

April 28, 2026 / 09:01 AM IST

వాడపల్లి అన్నదానం ట్రస్ట్‌కు లక్ష రూపాయలు విరాళం

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిత్య అన్నదాన పథకానికి మంగళవారం ఆలమూరు మండలం జొన్నాడ వాస్తవ్యులు గొలుగూరి సత్తిరెడ్డి, అనంతలక్ష్మి వారి కుటుంబ సభ్యులు  రూ. 1,00,151 విరాళం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాతలకు స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.

April 28, 2026 / 09:00 AM IST

సెల్ఫ్ ఎన్యూమరేషన్‌ను నమోదు చేసుకోండి: కలెక్టర్

KRNL: తొలిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్న జనగణన-2027లో భాగంగా ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ విధానాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ ఏ.సిరి సూచించారు. ఈ విధానం ద్వారా ప్రతీ కుటుంబం తమ ఇంటి వివరాలను మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా వెబ్‌సైట్ www.se.census.gov.in⁠లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.

April 28, 2026 / 08:52 AM IST

దేవరాపల్లి ఎంపీడీవోగా కిరణ్ బాధ్యతలు

AKP: దేవరాపల్లి మండల ఎంపీడీవోగా ఎస్. కిరణ్ వరప్రసాద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పనిచేసిన ఎం.వి. సువర్ణరాజు జిల్లా కోఆర్డినేటర్ (ఎస్ఈబ్ల్యూపీసీ)గా డిప్యూటేషన్‌పై వెళ్లడంతో ఆయన స్థానంలో కిరణ్ వరప్రసాద్ నియమితులయ్యారు. కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

April 28, 2026 / 08:40 AM IST

ప్రాణాలను రక్షించడంలో హెల్మెట్ కీలక పాత్ర: ఎస్పీ

SKLM: అరసవిల్లి జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన “అభయం హెల్మెట్ బ్యాంక్” ను సోమవారం సాయంత్రం SP మహేశ్వర రెడ్డి సందర్శించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యత పై అవగాహన కల్పించారు. ప్రమాదాల సమయంలో ప్రాణాలను రక్షించడంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు .

April 28, 2026 / 08:34 AM IST

రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

ప్రకాశం: సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు వద్ద ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంతమాగులూరు వైపు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి లారీ అతివేగంగా వచ్చి ఢీకొనడంతో ఆటో బోల్తా పడి ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. హైవే అంబులెన్స్ గాయాలైన వారిని నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించింది.

April 28, 2026 / 08:34 AM IST

నేడు శ్రీ మంచాలమ్మ పాలేటి గంగమ్మ తల్లి తిరునాళ్ళు

KDP: కమలాపురం మండలంలోని చదిపిరాళ్ల గొల్లపల్లె గ్రామాల మధ్యన వెలసిన మంచాలమ్మ పాలేటి గంగమ్మ తిరునాళ్ళు మంగళవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఛైర్మన్ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. ఉదయం అమ్మవారికి పూజలు, అభిషేకాలు, ప్రధాన కలశ స్థాపన, అఖండ దీపారాధన నిర్వహిస్తామన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి, అమ్మవారి కృపకు పాత్రులు కాగలరన్నారు.

April 28, 2026 / 08:29 AM IST