• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

బీఎల్‌వోలకు జీఎంసీ కమిషనర్ హెచ్చరిక

GNTR: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) మ్యాపింగ్‌ను సోమవారం కల్లా ప్రతి బీఎల్‌వో 70 శాతం పూర్తి చేయాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు ఉంటాయని జీఎంసీ కమిషనర్ కె. మయూర్ అశోక్ హెచ్చరించారు. శుక్రవారం కౌన్సిల్ హాలులో బీఎల్వోలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, విధుల్లో నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు.

May 30, 2026 / 08:43 AM IST

తంటికొండలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం

E.G: గోకవరం మండలం తంటికొండ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో రెండు తాటాకిల్లులు పూర్తిగా ధ్వంసం అయినట్లు స్థానికులు తెలిపారు. రెండు కుటుంబాల సభ్యులు కట్టుబట్టలతో మిగిలారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

May 30, 2026 / 08:24 AM IST

వీఎంఆర్డీఏ అదనపు కమిషనర్‌గా కీర్తి

విశాఖలోని వీఎంఆర్‌డీఎ అదనపు కమిషనర్‌గా దాట్ల కీర్తి శుక్రవారం భాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా కీర్తిని వీఎంఆర్‌డీఎ అదనపు కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. దీంతో ఆమె శుక్రవారం మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్ భరత్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన తదుపరి బాధ్యతలు చేపట్టారు. కీర్తి గతంలో వీఎంఆర్‌డీఎ కార్యదర్శిగా పని చేశారు.

May 30, 2026 / 08:20 AM IST

ధరణికోటలో రూ. కోటి అభివృద్ధి పనులు ప్రారంభం

PLD: పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “100 రోజులు-100 గ్రామాలు” పర్యటన 91వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి అమరావతి మండలం ధరణికోటలో పర్యటించిన ఆయన.. రూ.1.05 కోట్ల వ్యయంతో నిర్మించిన అదనపు పాఠశాల గదులు, సీసీ రోడ్లు, డ్రైన్లను ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

May 30, 2026 / 08:15 AM IST

నకిలీ అధికారిని అరెస్ట్ చేసిన మాచవరం పోలీసులు

NTR: ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఏసీబీ అధికారినంటూ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ అధికారిని మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురానికి చెందిన జయకృష్ణ పలువురు అధికారులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

May 30, 2026 / 08:12 AM IST

‘సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు’

GNTR: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ 3న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ, జిల్లా ఎస్పీతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. పి.వి.ఎస్ లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించే ప్రాంగణాన్ని సందర్శించిన అధికారులు, ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

May 30, 2026 / 08:10 AM IST

నేటితో ముగియున్న జన గణన తొలి దశ

అల్లూరి: జనాభా గణన-2027లో భాగంగా జరుగుతున్న మొదటి దశ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుందని కలెక్టర్ నిశాంతి తెలిపారు. “ఇళ్ల జాబితా, ఇళ్ల గణన” ప్రక్రియ జూన్ నెలతో ముగుస్తుందన్నారు. దీనికి సంబంధించిన ఎన్యుమరేటర్ల క్షేత్ర పర్యటన నేటితో ముగుస్తుందన్నారు. ఇప్పటి వరకు తమ ఇంటి వివరాలు నమోదు చేయించుకోని వారు ఇవాళ్టిలోగా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు.

May 30, 2026 / 08:06 AM IST

పీడీవోను సస్పెండ్ చేసిన కలెక్టర్

CTR: వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లె పంచాయతీ అభివృద్ధి అధికారి బాలసుబ్రహ్మణ్యంను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రిమినల్ కేసు నమోదు చేయాలని అందులో పేర్కొన్నారు. బొమ్మయ్యపల్లె గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారిగా ఉపాధి హామీ పథకంలో రూ.2.75 లక్షలు డ్రా చేసి లబ్దిదారులకు ఇవ్వకుండా దుర్వినియోగం చేయడంతో సస్పెండ్ చేశారు.

May 30, 2026 / 08:04 AM IST

బాధ్యతగా పనిచేస్తే గుర్తింపు ఉంటుంది: ఎమ్మెల్యే

SKLM: ప్రతి ఉద్యోగి బాధ్యతగా పనిచేసినప్పుడు గుర్తింపు తప్పదని ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ అన్నారు. జిల్లా గణంకాల అధికారి H.నాగ భూషణ్ పదవి విరమణ కార్యక్రమంలో శుక్రవారం ఆయన MLA రవికుమార్ పాల్గొన్నారు. ప్రతి ఉద్యోగి పదవిలో ఉన్నంతకాలం ప్రజలకు మంచి సేవలు అందిస్తే ఆ వ్యక్తిని సమాజం ఎప్పుడు గుర్తిస్తుందని తెలిపారు.

May 30, 2026 / 08:03 AM IST

పూడికతీత పనులపై కమిషనర్ కీలక ఆదేశాలు

KRNL: కర్నూలు నగరంలో చేపడుతున్న పూడికతీత పనులను నాణ్యంగా, గడువులోపు పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. ఏ.క్యాంపు, బి.క్యాంపు, గణేష్‌నగర్ ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం డ్రైన్లు, పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. డ్రైన్ల కింది భాగం వరకు పూడికలు తొలగించకపోతే బిల్లులు మంజూరు చేయొద్దని అధికారులకు స్పష్టం చేశారు.

May 30, 2026 / 08:00 AM IST

బెదిరించి నగదు కాజేసిన దుండగులు

ప్రకాశం: ఒంగోలు(M)పెళ్లూరు సమీపంలో శనివారం తెల్లవారుజామున ఓ లారీ డ్రైవర్‌ని గుర్తు తెలియని ఇద్దరు అగాంతకులు బెదిరించారు. చెన్నైకి వెళ్తున్న సమయంలో మూత్రం పోసేందుకు లారీని డ్రైవర్ సెల్వరాజ్ రోడ్డు పక్కన ఆపాడు. అదే సమయంలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు బెదిరించి రూ.2000 నగదుని మొబైల్ ఫోన్‌ను డ్రైవర్ వద్ద తీసుకొని పరారయ్యారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసారు.

May 30, 2026 / 08:00 AM IST

ఏపీటీడీసీ అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలి

NTR: విజయవాడ బెరమ్ పార్క్‌లో ఏపీటీడీసీ ఛైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసి, పర్యాటకులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు. పెండింగ్ ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సంస్థ ఎండీ పద్మావతి, ఈడీ మేక శేషగిరి, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

May 30, 2026 / 07:59 AM IST

ప్రభుత్వ బడుల్లో మెరుగైన విద్య: డీఈవో

ELR: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన అందుతోందని డీఈవో ఎం. వెంకటలక్ష్మమ్మ అన్నారు. నిడమర్రులో శుక్రవారం మన పాఠశాల-మన అందరి బాధ్యత ఎన్రోల్మెంట్ డ్రైవ్లో ఆమె పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చిన నలుగురు విద్యార్థులను ప్రభుత్వ బడిలో చేర్పించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లోని వసతులను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

May 30, 2026 / 07:54 AM IST

మహిళల భద్రత కోసం ‘ఆపరేషన్ దండాయన’: ఎస్పీ

NDL: జిల్లాలో మహిళల భద్రత కోసం ‘ఆపరేషన్ దండాయన’ కార్యక్రమం ప్రారంభించినట్లు శుక్రవారం ఎస్పీ సునీల్ తెలిపారు. నేరస్థులకు త్వరితగతిన శిక్షలు, 60 రోజుల్లో ఛార్జిషీట్ల దాఖలు, జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు దీనిలో భాగమని వెల్లడించారు. మహిళలపై నేరాలకు జీరో టాలెరెన్స్ పాలసీ తీసుకొస్తామని, స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ సిస్టమ్‌తో పర్యవేక్షిస్తామన్నారు.

May 30, 2026 / 07:43 AM IST

సబ్‌జూనియర్ ఫుట్‌బాల్ జట్ల ఎంపిక

SS: ఈనెల 31న హిందూపురం ఎంజీఎం క్రీడా మైదానంలో జిల్లా ఫుట్‌బాల్ సబ్‌జూనియర్ జట్ల ఎంపిక జరుగుతుందని జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జేవీ అనిల్‌కుమార్ తెలిపారు. ఈ ఎంపికలకు వచ్చే క్రీడాకారులు తమ అన్ని ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని సూచించారు. ఇతర పూర్తి వివరాల కోసం క్రీడాకారులు 8099598958 నంబరును సంప్రదించాలని కోరారు.

May 30, 2026 / 07:35 AM IST