• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పర్యాటకులను ఆకట్టుకుంటున్న కోరంగి అభయారణ్యం

కాకినాడ: కోరంగి అభయారణ్యంలో పర్యాటకుల కోసం 2.295 కిలోమీటర్ల పొడవైన చెక్క నడక దారి ఉంది. ఆసియాలోనే రెండో అతిపెద్దదిగా గుర్తింపు పొందిన ఈ వంతెనను ఒక్క చెట్టు కూడా నరకకుండా నిర్మించారు. అభయారణ్యంలో 40 మీటర్ల ఎత్తులో ఉన్న వాచ్ టవర్ ద్వారా మొత్తం అడవిని ‘బర్డ్స్ ఐ వ్యూ’ లో చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఇక్కడ RX100లో పిల్లారా వంటి పాటలు కూడా చిత్రీకరించారు.

April 28, 2026 / 11:08 AM IST

నేటి నుంచి వేసవి విజ్ఞాన శిబిరాలు ప్రారంభం

ELR: చింతలపూడిలోని శాఖ గ్రంథాలయంలో ఈనెల 28 నుంచి జూన్ 6 వరకు వేసవి విజ్ఞాన శిబిరాలను ప్రారంభిస్తున్నట్లు గ్రంథాలయ అధికారి వర్మ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పుస్తక పఠనం, వ్యక్తిత్వ వికాసం, చిత్రలేఖనం, హస్త కళలు, యోగ, ధ్యానం, క్విజ్, వక్రత్వం, వ్యాసరచన వంటి పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున ఈ వేసవి విజ్ఞాన శిబిరాలను చిన్నారులు సద్వినియోగం చేసుకోవాల

April 28, 2026 / 10:37 AM IST

రివర్స్ టెండరింగ్ పేరిట YCP ద్రోహం: MLA

KRNL: రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టులో అవకతవకలు చేసి ఇప్పుడు ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఇవాళ వైసీపీపై ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ధ్వజమెత్తారు. RDS, గుండ్రేవుల, వేదావతి ప్రాజెక్టులను రివర్స్ టెండరింగ్ పేరుతో రద్దు చేసి సీమకు ద్రోహం చేశారనన్నారు. పట్టిసీమ ద్వారా CM చంద్రబాబు నీళ్లు తెచ్చినా వైసీపీ నేతలు విమర్శించారని మండిపడ్డారు.

April 28, 2026 / 10:35 AM IST

పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

మార్కాపురం పట్టణంలోని పెట్రోల్ బంకులను కలెక్టర్ విజయ సునీత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాటిల్స్, క్యాన్లలో పెట్రోల్ విక్రయించవద్దని యజమానులను హెచ్చరించారు. సాధారణ విధానంలోనే ప్రజలకు ఇంధనం అందించాలని సూచించారు. పట్టణంలో ఎటువంటి కొరత లేదని స్పష్టం చేస్తూ ‘నో స్టాక్’ బోర్డులు పెట్టరాదన్నారు. ఇబ్బందులు ఉంటే వెంటనే తెలియజేయాలన్నారు.

April 28, 2026 / 10:29 AM IST

సిద్ధవటంలో అలరించిన కోలాట ప్రదర్శన

KDP: సిద్దవటం మండలం మాధవరం-1లోని శ్రీ భద్రావతి బావనారాయణ దేవస్దానంలో 29వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రి భద్రావతి భావనారాయణ స్వాముల వారికీ పానుపు సేవా కార్యక్రమం వైభవంగా జరిగింది. అనంతరం మహిళలు నిర్వహించిన కోలాట ప్రదర్శన ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. గ్రామంలోని ప్రజలు కోలాట ప్రదర్శనను ఆసక్తికరంగా తిలకించారు.

April 28, 2026 / 10:23 AM IST

మాజీ సీఎం జగన్‌పై మంత్రి సుభాష్ తీవ్ర విమర్శలు

కోనసీమ: రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చిన ఘనత మాజీ సీఎం జగన్‌కి దక్కుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. మంగళగిరిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పాలనలో రాష్ట్రానికి రావలసిన పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయని అన్నారు. జే-బ్రాండ్ మద్యం పేరుతో నాసిరకం మద్యం విక్రయించి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడారని ఆరోపించారు.

April 28, 2026 / 10:13 AM IST

పీహెచ్‌సీలో మందుల కొరత.. రోగుల ఆవేదన

TPT: నాగలాపురం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందుల కొరత తీవ్రంగా ఉండడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసారు. రోజుకు 150 మందికి పైగా ఓపీకి వస్తున్నప్పటికీ అవసరమైన మందులు అందడం లేదని తెలిపారు. సాధారణ జ్వరం, షుగర్, బీపీ రోగులకు కూడా ప్రైవేట్ మెడికల్ షాపులను ఆశ్రయించాల్సి వస్తోంది. మందులు అందుబాటులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.

April 28, 2026 / 10:11 AM IST

‘లోకేష్ వద్దకు ప్రజల వినతులు వెల్లువ’

VSP: విశాఖలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మంగళవారం జరిగిన సమావేశానికి ముందు వచ్చిన ప్రజల సమస్యలు తెలుసుకుని సుమారు 60 వినతిపత్రాలు తీసుకున్నారు. అనంతరం గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లారు.

April 28, 2026 / 10:09 AM IST

ఎమ్మెల్యే ఆదేశాలు.. నీటి సమస్య పరిష్కారం

CTR: నగరి నియోజకవర్గం పరిధిలోని కాకవేడు AAW ప్రాంతంలో తాగునీటి సమస్య నెలకొంది. సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉండేలా ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా ఏర్పాటు చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు.

April 28, 2026 / 10:08 AM IST

నాదెండ్ల భాస్కరరావుకు మంత్రి సత్యకుమార్ నివాళి

సత్యసాయి: మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు చిత్రపటానికి మంత్రి సత్య కుమార్ యాదవ్ మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కలిసి పరామర్శించారు. భాస్కరరావు మృతి తెలుగు రాజకీయాలకు తీరని లోటని మంత్రి స్మరించుకున్నారు.

April 28, 2026 / 10:08 AM IST

‘పారిశుద్ధ్య సిబ్బంది పట్టణ పరిశుభ్రతను మెరుగుపరచాలి’

E.G: రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు సెంటర్ నుంచి బాలాజీ పేట వెళ్లే ప్రధాన రహదారిలో జరుగుతున్న పారిశుధ్య పనులను రాజమండ్రి రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ మత్సేటి శివసత్య ప్రసాద్ మంగళవారం పరిశీలించారు. పారిశుద్ధ్య సిబ్బంది సమన్వయంతో పని చేసి పట్టణ పరిశుభ్రతను మెరుగుపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

April 28, 2026 / 10:07 AM IST

బీజేపీ నుంచి ముగ్గురు మహిళా కార్యకర్తల బహిష్కరణ

ATP: జిల్లాలో కలకలం రేపిన హనీ ట్రాప్ కేసులో సంబంధం ఉన్న ముగ్గురు మహిళా కార్యకర్తలను BJP పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు రాజేష్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన చంద్రకళ, మల్లీశ్వరి, అనంతకుమారిలను ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.

April 28, 2026 / 10:05 AM IST

ఇంధన సరఫరాను పునరుద్ధరించాలి: ఉషశ్రీ చరణ్

సత్యసాయి: రాష్ట్రంలో నెలకొన్న డీజిల్ కొరతపై మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. గోరంట్లలోని పెట్రోల్ బంక్ వద్ద ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇంధన సంక్షోభం తలెత్తిందని విమర్శించారు. రవాణా రంగం కుదేలవుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. తక్షణమే ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని ఆమె డిమాండ్ చేశారు.

April 28, 2026 / 10:03 AM IST

రోడ్డుపై పార్కింగ్‌ చేసిన వాహనాలు తొలగింపు

కడపలో ట్రాఫిక్ సీఐ తులసి రామ్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. సీఎస్‌ఐ చర్చి, నాగరాజుపేట ప్రాంతాల్లో రోడ్డుపై పార్క్ చేసిన వాహనాలను తొలగించారు. మహిళా డిగ్రీ కళాశాల వద్ద దీర్ఘకాలంగా నిలిపిన కార్లను క్లియర్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తూ, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ప్రజలకు సూచించారు.

April 28, 2026 / 09:58 AM IST

రాఘవేంద్ర రెడ్డిని కలిసిన కౌతాళం నూతన సీఐ

KRNL: కౌతాళం నూతన సీఐ యుగంధర్ మాధవరం టీడీపీ కార్యాలయంలో ఇవాళ నియోజకవర్గ ఇంఛార్జ్ రాఘవేంద్ర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీస్ శాఖకు పూర్తి సహకారం ఆయనను కోరారు. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ సమస్యలు, దొంగతనాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు చురుగ్గా వ్యవహరించాలని రాఘవేంద్ర సూచించారు.

April 28, 2026 / 09:53 AM IST